twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ సూసైడ్‌: సల్మాన్, కరణ్‌ జోహర్‌పై బీహార్ కోర్టు సంచలన నిర్ణయం

    |

    యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ప్రజల్లో, అభిమానుల్లో, సన్నిహితుల్లో భావోద్వేగాలు రేకెత్తాయి. యువ హీరో మరణం సూసైడ్ కాదంటూ ఆరోపణలు సంధించారు. కంగన రనౌత్, శేఖర్ సుమన్ లాంటి సినీ ప్రముఖులు సుశాంత్ మరణం పక్కా ప్లాన్డ్ మర్డర్ అంటూ బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌లో కొందరు ప్రముఖులు, కొన్ని గ్రూపులు పథకం ప్రకారం సుశాంత్‌ను ఆత్మహత్య చేసుకొనేలా చేశారు. ఈ క్రమంలో బీహార్‌ కోర్టులో సల్మాన్, కరణ్ జోహర్, సంజయ్ లీలా భన్సాలీ లాంటి వారిపై కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆ పిటిషన్ కోర్టు ముందుకు విచారణకు రాగా..

    సీబీఐ దర్యాప్తకు డిమాండ్లు

    సీబీఐ దర్యాప్తకు డిమాండ్లు


    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి దాదాపు నెలరోజులకు దగ్గరవుతున్నా.. ప్రతీ రోజు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న సిబీఐ దర్యాప్తు కోరుతూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. పలు రకాల హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండ్ చేస్తున్నారు. సీబీఐ విచారణ చేపట్టడానికి ఎందుకు ఆలస్యం, సీబీఐ విచారణ చేపట్టాల్సిందే అంటూ ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వాన్ని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

    ఎంపీలు, సినీ ప్రముఖులు అనుమానాలు

    ఎంపీలు, సినీ ప్రముఖులు అనుమానాలు

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్‌పై బీజీపీ ఎంపీలు మనోజ్ తివారీ, రూపా గంగూలీ లాంటి సినీ ప్రముఖులు కూడా అనుమానాలను వ్యక్తం చేశారు. సుశాంత్ మరణం వెనుక బయటకు తెలియని అనేక కారణాలు ఉన్నాయి. కాబట్టి సీబీఐ విచారణ తప్పనిసరిగా చేపట్టాలనే డిమాండ్ చేశారు. వీరికి తోడుగా రాజస్థాన్, బీహార్‌లో బలంగా ఉన్న కర్ణిసేన కూడా పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది.

    ముజఫర్‌పూర్ కోర్టులో పిటిషన్లు

    ముజఫర్‌పూర్ కోర్టులో పిటిషన్లు

    ఇలాంటి పరిస్థితుల్లో సుశాంత్ సూసైడ్ మరణానికి కారణం సల్మాన్ ఖాన్, కరణ్ జోహర్, సంజయ్ లీలా భన్సాలీ, ఏఖ్తా కపూపర్ మహేష్ భట్ పేర్లను సూచిస్తూ బీహార్‌లో సుధీర్ కుమార్ ఓజా అనే వ్యక్తి ముజఫర్‌పూర్ కోర్టులో ఫిర్యాదు చేశారు. కంగన, ఇతర నటీనటుల వ్యాఖ్యలు, మాట్లాడిన వీడియోలను కోర్టుకు అందజేశారు. సుశాంత్ మరణం సహజ మరణం కాదు.. ఈ ఆత్మహత్య వెనుక ఏవో కారణాలు ఉన్నాయనే అనుమానాలను ఓజా తన ఫిర్యాదులో వ్యక్తం చేశారు.

    సల్మాన్, కరణ్‌పై కేసు విచారించలేం

    సల్మాన్, కరణ్‌పై కేసు విచారించలేం

    అయితే ఓజా ఫిర్యాదును పరిశీలించిన బీహార్ కోర్టు కీలక నిర్ణయం తీసుకొన్నది. ఈ కేసు మా విచారణ పరిధిలో లేదు కాబట్టి కేసును తిరస్కకరిస్తున్నాం. సల్మాన్ ఖాన్, ఏక్తా కపూర్, సంజయ్ లీలా భన్సాలీ, కరణ్ జోహర్‌పై సుధీర్ కుమార్ ఓజా చేసిన ఫిర్యాదును స్వీకరించి విచారించలేమని కోర్టు స్పష్టం చేసింది.

    Recommended Video

    Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
     కోర్టు ఆదేశాలను సవాల్ చేసి పైకోర్టుకు వెళ్తాం

    కోర్టు ఆదేశాలను సవాల్ చేసి పైకోర్టుకు వెళ్తాం

    ముజఫర్‌పూర్ కోర్టు పిటిషన్‌ను తిరస్కరించడంపై సుధీర్ కుమార్ ఓజా మీడియాలో స్పందించారు. ఛీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆర్డర్‌ను గౌరవిస్తాం. కానీ సీఎంజే నిర్ణయాన్ని జిల్లా కోర్టులో ఛాలెంజ్ చేస్తాం. సుశాంత్ మరణంతో బీహార్ విషాదంలో, బాధలో కూరుకుపోయింది. సుశాంత్‌కు జరిగిన అన్యాయాన్ని బదులుగా వారి కుటుంబానికి న్యాయం లభించేలా పోరాటం చేస్తాం అని సుధీర్ కుమార్ ఓజా స్పష్టం చేశారు. గతంలో ఓజా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను కోర్టుకు లాగిన సందర్భాలు ఉన్నాయనేది గమనార్హం.

    English summary
    Bollywood hero Sushant Singh Rajput suicide: CJM of Muzaffarpur rejected petition on Salman Khan, Karan Johar and Sanjay Leela Bhansali. Sudhir Kumar Ojha petition rejected by citing jurisdictional limitations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X