Just In
- 7 min ago
RRR రిలీజ్ డేట్ వల్ల మరో తలనొప్పి.. అసలైన వాళ్లే వద్దంటే డేట్ తప్పకుండా మార్చాల్సిందే..
- 1 hr ago
మహేష్ చేయాల్సిన పవర్ఫుల్ కథలో పవన్ కళ్యాణ్.. పదేళ్ల తరువాత సెట్స్ పైకి..
- 1 hr ago
క్రాక్ హిట్టు కాదు.. అంతకు మించి.. రవితేజ కెరీర్ లోనే బిగెస్ట్ కలెక్షన్స్
- 2 hrs ago
బుట్టబొమ్మ ఫుల్ బిజీ.. కుదరకపోయినా మెగా హీరో కోసం ఒప్పుకుందట
Don't Miss!
- Finance
రూ.5, రూ.10, రూ.100 నోట్ల రద్దు: RBI ఏం చెప్పిందంటే?
- News
Bigg Boss కంటెస్టెంట్ నటి ఆత్మహత్య , కారణం ఇదే..!
- Automobiles
సరికొత్త 2021 కెటిఎమ్ 890 డ్యూక్ ఆవిష్కరణ; ఇది భారత్కు వస్తుందా..?
- Sports
India vs England: వారికి ఐదు రోజులు.. వీరికి మాత్రం మూడు రోజులే!!
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సుశాంత్ vs అలియా సడక్ 2: రికార్డులతో బ్యాలెన్స్ చేస్తున్న ఫ్యాన్స్.. మొహం ఎక్కడ పెట్టుకుంటారు?
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత బాలీవుడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్కసారిగా నెపోటిజమ్ భూతానికి భయం కలిగించేలా అభిమానులు భారీ స్థాయిలో నిరసన తెలుపుతున్నారు. అలియా భట్ సడక్ 2 ట్రైలర్ పై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ అంతా ఇంతా కాదు. ఒక విధంగా సుశాంత్ మరణానికి ఇదొక చిన్నపాటి రివెంజ్ అనేంతలా ఆడియెన్స్ వారికి దిమ్మదిరిగే షాక్ ఇస్తున్నారు.

వారి చేతుల్లో ఉండే సమస్యే అయితే..
వారి చేతుల్లో ఉండే సమస్యే అయితే బాలీవుడ్ లో నెపోటిజమ్ వ్యవస్థను పూర్తిగా నిర్ములించేవారేమో అనేంతలా స్పందిస్తున్నారు నెటిజన్స్. సుశాంత్ సింగ్ మృతి వెనుక నెపోటిజమ్ అనే భూతం తప్పకుండా ఉందని అతనిని పైకి రానివ్వకుండా చేశారనే కామెంట్స్ రోజురోజుకి ఎక్కువవుతున్నాయి.

పాతాళానికి వెళ్లిపోయేలా..
ఇక ఇలాంటి క్లిష్ట సమయంలోనే పూర్తిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారి సినిమా వస్తుండడంతో మొదటి అడుగులోనే షాక్ తగిలింది. మహేష్ భట్ దర్శకత్వంలో ఆయన కూతురు అలియా భట్ అలాగే సంజయ్ దత్, ఆదిత్య రాయ్ కపూర్ వంటి వారు నటించడం నెపోటిజమ్ కి ప్రతీకగా ఉందనే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దెబ్బకు సడక్ 2 ట్రైలర్ పాతాళానికి వెళ్లిపోయేలా డిస్ లైక్స్ కొట్టేశారు.

10 మిలియన్స్ టార్గెట్
యూ ట్యూబ్ లో అత్యదిక డిస్ లైక్స్ వచ్చిన ట్రైలర్ గా సడక్ 2 నిలిచింది. ప్రస్తుతం 8.1మిలియన్స్ కి పైగా డిస్ లైక్స్ రాగా ఆ సంఖ్యను 10 మిలియన్స్ కి పెంచాలని అభిమానులు టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇక మరోవైపు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన ఆఖరి చిత్రం దిల్ బెచారా ట్రైలర్ 10 మిలియన్ లైక్స్ అందుకుంది.

మొహం ఎక్కడ పెట్టుకుంటారు?
ఓ వైపు డిస్ లైక్స్, మరోవైపు లైక్స్ ద్వారా బ్యాలెన్స్ చేయాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్లు అర్ధమవుతోంది. ఈ రికార్డులతో మొహం ఎక్కడ పెట్టుకుంటారు ఆమె విధంగా మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మహేష్ భట్ నిర్మాతగా వ్యవహరించి చాలా కాలం తరువాత డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో మొదట్లో కొంత హైప్ ఉన్నప్పటికీ ఇప్పుడు అది కాస్త బెడిసికొట్టింది.

హాట్ స్టార్ పై కూడా నెగిటివ్ కామెంట్స్
ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ హాట్ స్టార్ లో ఈ నెల 28న సినిమాను విడుదల చేయనున్నారు. అయితే అభిమానులు హాట్ స్టార్ ని కూడా అన్ ఇన్స్టాల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అనే విధంగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సినిమా బావుందా బాలేదా అనే విషయాన్ని పక్కన పెడితే అసలు సినిమాపై కనీసం ఒక లుక్కేస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.