twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఆ డైరెక్టర్ పిచ్చిపనులతో విసిగిపోయా.. ఆరేళ్లుగా వేధింపులు’

    |

    బాలీవుడ్ తార స్వర భాస్కర్ మరోసారి లైంగిక వేధింపులపై నోరువిప్పింది. ఓ డైరెక్టర్‌తో ఎదురైన శారీరక వేధింపులను ఓ వేదికపై బహిరంగ పరిచింది. హలీవుడ్ డైరెక్టర్ హార్వే వెయిన్‌స్టెయిన్ జీవితం, వివాదాలపై జరిగిన చర్చలో నటి దియా మిర్జా, ఆనంద్ పట్వర్థన్‌తో కలిసి స్వరభాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఓ డైరెక్టర్ చేసిన అకృత్యాలను బయటపెట్టింది. అయితే డైరెక్టర్ పేరును మాత్రం వెల్లడించడానికి నిరాకరించింది. ఇంతకీ ఆమెకు ఎదురైన వేధింపులు ఏమిటంటే..

    ఆ దర్శకుడు అలా ప్రవర్తించేవాడు

    ఆ దర్శకుడు అలా ప్రవర్తించేవాడు

    ఓ సినిమాకు పనిచేసే సమయంలో ఆ చిత్ర దర్శకుడు తనతో అనుచితంగా ప్రవర్తించేవాడు. ఎప్పుడూ శారీరక అనుభవం కోసం ప్రయత్నించేవాడు. తనతో ప్రవర్తించి తీరును అర్ధం చేసుకోవడానికి ఆరేళ్లు పట్టింది. అలాంటి వ్యక్తి వల్ల మానసికంగా చాలా నష్టపోయాను అని స్వరభాస్కర్ పేర్కొన్నది.

    మూడేళ్ల క్రితం కూడా ఓ డైరెక్టర్

    మూడేళ్ల క్రితం కూడా ఓ డైరెక్టర్

    మూడు ఏళ్ల క్రితం కూడా ఓ డైరెక్టర్ ఇలానే ప్రవర్తించాడు. అతడు అలా వ్యవహరిస్తాడని నేను అనుకోలేదు. కానీ ఎలాగో అలా తప్పించుకొన్నాను. నా ఒంటిపై చేయి పడకుండా జాగ్రత్తగా కాపాడుకొన్నాను. అలాంటి సంఘటన తలచుకొంటేనే నాకు భయంగా ఉంటుంది అని స్వర భాస్కర్ పేర్కొన్నారు.

     డైరెక్టర్ పిచ్చిపనులు తెలిసేవి

    డైరెక్టర్ పిచ్చిపనులు తెలిసేవి

    డైరెక్టర్ చేసే పిచ్చి పనులు నాకు స్పష్టంగా అర్ధమయ్యేవి. కానీ నా మనసును అదుపులో పెట్టుకొని సానుకూలంగా వ్యవహరించే దానిని. ఆ డైరెక్టర్ చెడ్డవాడు కాకపోవచ్చు. కానీ తాను అవకాశం ఇచ్చినందుకు ఇతరుల నుంచి ఏదో రకంగా లబ్ది పొందాలని చూసేవాడు అని స్వర భాస్కర్ తెలిపారు.

    బయటకు చెబితే దోషిగా చూస్తారు

    బయటకు చెబితే దోషిగా చూస్తారు

    మన దేశంలో లైంగిక వేధింపులను బయటకు చెప్పే సంస్కృతి ఇంకా రాలేదు. అలాంటివి బయటకు చెబితే బాధితురాలినే దోషిగా చూసే పరిస్థితి ఉంటుంది. ప్రతిభను కాకుండా ఇతర అంశాలను చూడటం ప్రపంచమంతా ఉంది. కానీ బాధితులకు ఇది చాలా అశాంతిని కలిగిస్తుంది అని స్వరభాస్కర్ అభిప్రాయపడ్డారు.

    English summary
    Actor Swara Bhasker has revealed she was sexually harassed by a director but it took her nearly six to eight years to realise what had happened as the culture doesn't teach women to recognise predatory behaviour.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X