»   »  వావ్.... సల్మాన్ ఖాన్ సినిమాలో హాలీవుడ్ స్టార్? ఆ ట్వీట్ అర్థం అదేనా?

వావ్.... సల్మాన్ ఖాన్ సినిమాలో హాలీవుడ్ స్టార్? ఆ ట్వీట్ అర్థం అదేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
సల్మాన్ ఖాన్ సినిమాలో హాలీవుడ్ స్టార్?

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా త్వరలో 'రేస్ 3' చిత్రం రాబోతోంది. భారీ యాక్షన్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలు సల్మాన్ ఖాన్ ట్విట్టర్ ద్వారా బయట పెడుతున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్ మెయిన్ మ్యాన్‌ అని చెబుతూనే మరో ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు ఈ కండల వీరుడు. హాలీవుడ్ స్టార్ సిల్వెస్టర్ స్టోలెన్‌కు సంబంధించిన వీడియో విడుదల చేశారు.

సిల్వెస్ట్ స్టోలెన్ వీడియో పోస్టు చేస్తూ 'ఈ వారం మీకు 'రేస్ 3' ఫ్యామిలీని పరిచయం చేయబోతున్నాను' అని సల్మాన్ ట్వీట్ చేయడంతో ఈ చిత్రంలో సిల్వెస్టర్ స్టోలెన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి.

 గతంలోనూ బాలీవుడ్ మూవీలో గెస్ట్ రోల్ చేసిన సిల్వెస్టర్ స్టోలెన్

గతంలోనూ బాలీవుడ్ మూవీలో గెస్ట్ రోల్ చేసిన సిల్వెస్టర్ స్టోలెన్

అక్షయ్ కుమార్, కరీనా కపూర్ జంటగా 2009లో వచ్చిన ‘కంబఖ్త్ ఇష్క్' చిత్రంలో సిల్వెస్టర్ స్టోలెన్ అతిపాత్ర పోషించారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆయన బాలీవుడ్ మూవీలో నటించబోతున్నారనే వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి.

ఆ చిత్రంలో ఎవరెవరు నటించారంటే

ఆ చిత్రంలో ఎవరెవరు నటించారంటే

అప్పట్లో వచ్చిన ‘కంబఖ్త్ ఇష్క్' చిత్రంలో హాలీవుడ్ బిగ్గీస్ బ్రాండన్ రోత్, డేనిస్ రిచర్డ్స్, సిల్వెస్టర్ స్టోలెన్ అతిథి పాత్రలో కనిపించి ఇండియన్ అభిమానులను ఆశ్చర్య పరిచారు.

 డేనిస్ రిచర్డ్స్‌తో రొమాన్స్ చేసిన అక్షయ్

డేనిస్ రిచర్డ్స్‌తో రొమాన్స్ చేసిన అక్షయ్

అంతే కాదు ఆ సినిమాలో అక్షయ్ కుమార్ డేసిన్ రిచర్డ్స్‌తో పలు రొమాంటిక్ సీన్లలో కూడా నటించారు.

రేస్ 3లో సిల్వెస్టర్ స్టోలెన్?

రేస్ 3లో సిల్వెస్టర్ స్టోలెన్?

సల్మాన్ ఖాన్ తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించిన వివరాల ప్రకారం ‘రేస్ 3' చిత్రంలో సిల్వెస్టర్ స్టోలెన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.

 రేస్ 3 గురించి ఆసక్తికర విషయాలు

రేస్ 3 గురించి ఆసక్తికర విషయాలు

అంతే కాదు ‘రేస్ 3' చిత్రంలో సల్మాన్ ఖాన్ కస్టమైజ్డ్ ఫెరారీ కారు నడుపుతూ కనిపించబోతున్నారు. ఈ కారు దుబాయ్‌లోని రిచ్చెస్ట్ కిడ్ రషీద్ బెల్హాసాకు చెందినది అని సమాచారం.

 రేస్ 3లో ఎవరెవరు?

రేస్ 3లో ఎవరెవరు?

రేస్ 3 చిత్రంలో సల్మాన్ ఖాన్, బాడీ డియోల్, అనిల్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, డైసా షా తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

జూన్ 15న గ్రాండ్ రిలీజ్

‘రేస్ 3' చిత్రాన్ని జూన్ 15న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. సల్మాన్ ఖాన్ ఏ మాత్రం డిసప్పాయింట్ చేయడనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు.

English summary
Salman Khan is setting Twitter ablaze as he's introducing the starcast of Race 3 along with their characters and he just revealed today that Bobby Deol is the "main man" of the film and we should all buckle up as the race is going to be intense hereafter. If this was not enough, Salman Khan shared a video clip of Hollywood biggie Sylvester Stallone and he's standing in the backdrop of a painting of himself, which is done by Salman Khan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X