Just In
- 17 min ago
HIT2 అప్డేట్.. ప్రాజెక్ట్ నుంచి విశ్వక్ సేన్ అవుట్!.. కొత్త హీరో ఎవరంటే?
- 31 min ago
పూరి తనయుడి రొమాంటిక్ సినిమా ఆగిపోలేదు.. ఫైనల్ గా ఓ క్లారిటీ ఇచ్చేశారు
- 43 min ago
ఆ సినిమా కోసం కదిలొచ్చిన మంత్రి.. తలసాని కామెంట్స్ వైరల్
- 1 hr ago
PSPK27 రిలీజ్ డేట్ ఫిక్స్.. మహేష్ బాబుతో బాక్సాఫీస్ ఫైట్‌కు సిద్దమైన పవన్ కళ్యాణ్
Don't Miss!
- News
ఆ తపన ఉన్నా శరీరం సహకరించలేదు: చిన్నప్పుడు చీరాలలో: ఆ యుద్ధ విద్యలకు ప్రోత్సాహం: పవన్
- Finance
కోవిడ్ క్లెయిమ్స్ రూ.9,000 కోట్లు, హెల్త్ పాలసీవే రూ.7,100 కోట్లు
- Sports
హైదరాబాద్‌లోనూ ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించండి.. బీసీసీఐకి కేటీఆర్ రిక్వెస్ట్!
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఎంత చెప్పినా వినలేదు.. ఆ హీరో చేత ఏడుసార్లు.. తాప్సీ కామెంట్స్ వైరల్
తాప్సీ.. ఈ పేరు గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు నాట నుంచి సినీ ప్రపంచానికి పరిచయమైంది. సినీ కెరీర్ ప్రారంభంలో గ్లామర్ డాల్‌గానే అందరూ చూసినా.. తానెంటో నిరూపించుకుంది. ఓ లెక్కన చెప్పాలంటే ప్రస్తుతం తాప్సీ హవా నడుస్తోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. వినూత్న కథలకు, పాత్రలకు సరైన చిరునామాగా నిలబడింది.

తాజాగా తప్పడ్‌తో..
తాజాగా తప్పడ్ (చెంపదెబ్బ) అనే చిత్ర ట్రైలర్ విడుదలైంది. మహిళకు ఉండే ఆత్మగౌరవంపై దెబ్బ తగిలితే ఎలా ఉంటుందనే పాయింట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల ఈసినిమా ట్రైలర్ విడుదలై.. వైరల్‌గా మారింది. చెంపదెబ్బ కొట్టాడని భర్తకు విడాకులు ఇచ్చేందుకు భార్య రెడీ అయితే సమాజం ఎలా చూస్తుంది.. కోర్టు ఎలా తీర్పు ఇస్తుంది.. అనే సున్నితమైన అంశాల నేపథ్యంలో తెరకెక్కించినట్టు అర్థమవుతోంది.

ఆ సీనే కీలకం..
ఇందులో తాప్సీ భర్తగా పవైల్ గులాటి నటించాడు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌తో తాప్సీని చెంపదెబ్బ కొట్టే సీన్ హైలెట్‌గా నిలిచింది. ఆ సీన్‌కు సంబంధించిన షూటింగ్ జరిగిన తీరును వివరిస్తూ.. ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. సినిమాకు చెంపదెబ్బ కొట్టే సీన్ కు అధిక ప్రాధాన్యత ఉండటంతో.. దాన్ని సహజంగా చేయాలని డిసైడ్ అయ్యారట చిత్ర యూనిట్.

ఎంత చెప్పినా వినలేదు..
ఈ సీన్ ఎంత సహజంగా వస్తే.. అంత బాగుంటుందని.. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు సహజంగా ఫీల్ కావాలంటే చెంపదెబ్బ సీన్ నేచురల్‌గా ఉండాలని ఫిక్స్ అయినట్టు చెప్పుకొచ్చింది. అందుకే ఆ షాట్ కోసం రెండు రోజులు సమయం తీసుకొని హీరో పవైల్ సిద్ధమయ్యాడని చెప్పింది తాప్సీ. తనను చెంపదెబ్బ కొట్టేందుకు చాలా భయపడటంతో పాటు.. ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడని తెలిపింది. ముందు తనను కొట్టాలని కోరేవాడని, అలా కొడితే భయం పోయి తానూ కొట్టగలనని అనేవాడంటూ చెప్పుకొచ్చింది.

ఏడు సార్లు కొట్టాడు..
ఎన్నిసార్లు చేసినా షాట్ సరిగా రాలేదని.. కొన్నిసార్లు చెంప మీద కొట్టబోయి మెడ మీదా.. చెవి మీదా కొట్టేవాడని తెలిపింది. దీంతో ఈ షాట్ ఓకే కావటం కోసం ఏడుసార్లు చెంప దెబ్బలు తినాల్సి వచ్చిందని తాప్సీ పేర్కొంది. అదే పనిగా షాట్ మీద షాట్ అవుతున్నా.. ఓకే కాక పోవటంతో.. నా గురించి ఆలోచించటం మానేయ్.. గట్టిగా ఒక చెంపదెబ్బ కొట్టు చాలని తాను చెప్పినట్లుగా పేర్కొంది.