మరింత విబిన్నంగా సిద్ధమైన తాప్సి.. ఈసారి ఏలియన్ కథతో...
న్న
సొట్టబుగ్గల సుందరి తాప్సి అదృష్టం ఏమిటో గాని సౌత్ లో ఎలాంటి సినిమాలు చేసినా కూడా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేదు. కానీ బాలీవుడ్ లో ఆమె సెలక్షన్ మాత్రం గట్టిగానే వర్కౌట్ అవుతోంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను ఎక్కువగా టచ్ చేయకుండా కాస్త డిఫరెంట్ సినిమాలతో క్రేజ్ అందుకుంటోంది.
అవసరమైతే తాప్సి కొన్ని చిన్న సినిమాలకు రెమ్యునరేషన్ ను కూడా తగ్గించుకుంటున్నట్లు సమాచారం. ఇక నెక్స్ట్ ఈ బ్యూటీ ఒక ఏలియన్ కథలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఒక సీనియర్ దర్శకుడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన యువకుడు ఆ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ సినిమాతో పాటు తాప్సి లిస్టులో మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి.

మొత్తం ఈ బ్యూటీ చేతిలో 8 సినిమాలు ఉండగా అందులో 5 సినిమాల షూటింగ్స్ పూర్తయ్యాయి. రష్మీ రాకెట్, హసీనా దిల్ రుబా వంటి సినిమాలపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం తాప్సి ఎక్కువగా మిథాలి రాజ్ బయోపిక్ కోసం హార్డ్ వర్క్ చేస్తోంది. శభాష్ మితు టైటిల్ తో తెరకెక్కుతున్న ఆ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్నారు. దాదాపు నాలుగైదు నెలల పాటు తాప్సి క్రికెట్ కోచింగ్ కూడా తీసుకుంది. ఎలాగైనా ఆ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకోవాలని కష్టపడుతోంది. మరి సినిమా ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











