Don't Miss!
- News డీజీ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా టాటాపై ఈసీ బదిలీ వేటు: కీలక ఆదేశాలు
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఆ హీరో హీరోయిన్.... కొడుకును చూసుకునే ఆయాకు ఇచ్చే జీతం ఎంతో తెలుసా?
బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ దంపతులకు సంవత్సరన్నర వయసున్న కుమారుడున్న ఉన్న సంగతి తెలిసిందే. తమ ముద్దుల కుమారుడికి తైమూర్ అలీ ఖాన్ అనే పేరు పెట్టుకున్నారు. కరీనా కొడుకు పుట్టిన తర్వాత కూడా సినిమాల్లో నటిస్తున్నారు. దీంతో తైమూర్ బాగోగులు చూసుకోవడానికి ఆయాను నియమించుకున్నారు.
అయితే తైమూర్ బాగోగులు చూసుకునే ఆయాకు సైఫ్-కరీనా దంపతులు చెల్లించే జీతం ఇపుడు హాట్ టాపిక్ అయింది. ఆమెకు నెలకు రూ. 1.5 లక్షలు చెల్లిస్తున్నారట. ఓవర్ టైమ్ బాబును చూసుకోవాల్సి వస్తే అదనంగా చెల్లిస్తున్నారట.
ఓ ఆంగ్లపత్రిక కథనం ప్రకారం... తైమూర్‌ను చూసుకుంటున్న ఆయాకు నెల రూ. 1.5 లక్షలు చెల్లిస్తున్నారు. ఒక్కోసారి ఓవర్ టైమ్ పని చేసినపుడు రూ. 1.75 లక్షల వరకు చెల్లిస్తున్నారని, బాబును తిప్పడానికి ఆమె కోసం ప్రత్యేకంగా కారు కూడా ఏర్పాటు చేశారని సమాచారం.
అంతే కాదు... సైఫ్-కరీనా విదేశాలకు వెకేషన్ వెళ్లినపుడు తైమూర్‌ను కూడా తీసుకెళతారని, ఆ సమయంలో కూడా ఆయాను కూడా వారి వెంట తీసుకెళతారని సమాచారం. ముంబైలోని ఓ ఒక హై ప్రొఫైల్ ఏజెన్సీ నుండి ఆయాను రిక్రూట్ చేసుకున్నారని, తుషార్ కపూర్, సోహా అలీ ఖాన్ కూడా తమ పిల్లలను చూసుకోవడానికి ఇదే ఏజెన్సీ నుండి ఆయాలను రిక్రూట్ చేసుకున్నారని టాక్.