»   » ఆడ పిల్లకు అన్యాయం జరిగితే... అమితాబ్ బచ్చన్ ఇలాగేనా మాట్లాడేది?

ఆడ పిల్లకు అన్యాయం జరిగితే... అమితాబ్ బచ్చన్ ఇలాగేనా మాట్లాడేది?

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ మీద నటి తనుశ్రీ దత్తా సెక్సువల్ హరాస్మెంట్ ఆరోపణలు చేసినప్పటి నుంచి మీడియాలో ఈ ఇష్యూ గురించి హాట్ టాపిక్ నడుస్తోంది. బాలీవుడ్ సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా ఈ గొడవ గురించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి.

  పర్హాన్ అక్తర్, ప్రియాంక చోప్రా, శిల్పా శెట్టి తదితర బాలీవుడ్ సెలబ్రిటీలు తనుశ్రీ దత్తాకు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. మరికొందరు సెలబ్రిటీలు నానా పాటేకర్ చాలా మంచి వ్యక్తి అంటూ సపోర్ట్ చేస్తున్నారు. అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం ఎవరి వైపు మాట్లాడకుండా దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు.

  అమితాబ్ బచ్చన్ ఏమన్నారంటే?

  అమితాబ్ బచ్చన్ ఏమన్నారంటే?

  అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద స్టార్ తన విషయంలో స్పందించిన తీరుపై తనుశ్రీ దత్తా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంటులో అమితాబ్‌కు ఈ ప్రశ్న ఎదురవ్వగా... నేను తనుశ్రీ దత్తాను కాదు, నానా పాటేకర్ కాదు, అందుకే దీనిపై నేను స్పందించాలనుకోవడం లేదు అంటూ దాటవేశారు.

   అమితాబ్ మాటలు బాధించాయి

  అమితాబ్ మాటలు బాధించాయి

  బిగ్ బి స్పందించిన తీరుపై తనుశ్రీ దత్తా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.....‘ఆయన మాటలు నన్ను చాలా బాధించాయి. సామాజిక అంశాలపై సినిమాలు తీసే ఇలాంటి పెద్ద స్టార్లు ప్రేక్షకులను ప్రశంసలు అందుకుంటారు. కానీ తమ కళ్ల ముందు ఒక ఆడపిల్ల తనకు జరిగిన అన్యాయం గురించి చెబితే పట్టించుకోరు.' అని వ్యాఖ్యానించారు.

   దారుణమైన అవమానం, బాలీవుడ్లో అడుగు పెట్టను

  దారుణమైన అవమానం, బాలీవుడ్లో అడుగు పెట్టను

  నేను బాలీవుడ్‌లోకి రావడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్లు కొందరు అంటున్నారు. ఇక్కడ నాకు ఇంత అవమానం జరిగిన తర్వాత మళ్లీ బాలీవుడ్లోకి వస్తానని ఎలా అనుకున్నారు. అలాంటి ఉద్దేశ్యమే లేదు. నాకు అమెరికా పౌరసత్వం ఉంది. అక్కడికే వెళ్లిపోతాను.... అని తనుశ్రీ దత్తా వ్యాఖ్యానించారు.

   ఎన్నో ఆఫర్లు వచ్చినా వదలుకున్నాను

  ఎన్నో ఆఫర్లు వచ్చినా వదలుకున్నాను

  నాకు ఆ సంఘటన ఎదురైన తర్వాత 30, 40 సినిమాల్లో అవకాశం వచ్చింది. కానీ ఇలాంటి పరిస్థితులు ఉన్న ఇండస్ట్రీలో పని చేయాలనిపించలేదు. అందుకే అవన్నీ వదలుకున్నాను. ప్రజలు కూడా నాకు జరిగిన వేధింపుల విషయాన్ని పట్టించుకోవడం లేదు... అని తనుశ్రీ దత్తా ఆవేదన వ్యక్తం చేశారు.

  English summary
  Now, in an interview with HT, Tanushree expressed her disappointment with Big B’s response to the entire controversy. “I’m hurt, as these are people who do movies on social causes." Talking further about how these movies win the hearts of the audience, the actress shared, "But when it comes to standing up and doing something about what is happening in front of you, there are these evasive statements that don’t make sense,” the actress said.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more