For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మీటూ ఆరోపణలతో వణికించిన ఆ బ్యూటీ మళ్ళీ రాబోతోంది.. ఎందుకంటే?

  |

  మీటూ ఉద్యమాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్లిన నటిమణుల్లో తనూశ్రీ దత్తా ఒకరు. ఈ గ్లామరస్ బ్యూటీ ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చినప్పటికీ అప్పుడప్పుడు కాంట్రవర్సీ న్యూస్ లతో హైలెట్ అవుతూనే ఉంది. ఎలాంటి వివాదం మొదలైన కూడా తనదైన శైలిలో కౌంటర్లు వేస్తూ మీడియాలో చర్చనీయాంశంగా మారుతోంది. ఇక 2018లో సీనియర్ టాలెంటేడ్ నటుడిపై అమ్మడు లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

  బాలీవుడ్ లో రీ ఎంట్రీ..

  బాలీవుడ్ లో రీ ఎంట్రీ..

  ఇక చాలా రోజుల తరువాత తనుశ్రీ దత్తా సోషల్ మీడియాలో తిరిగి వస్తున్నట్లు ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో త్వరలోనే ఆమె బిగ్ బడ్జెట్ సౌత్ ప్రాజెక్టులతో పాటు బాలీవుడ్ లో కూడా మరికొన్ని సినిమాలు చేయడానికి సిద్ధమవుతోందట. ఇప్పటికే ముంబైలోని 12 కాస్టింగ్ కార్యాలయాల నుంచి పిలుపు వచ్చిందని చెప్పిన అమ్మడు ముగ్గురు పెద్ద సౌత్ ఫిల్మ్ మేనేజర్‌లు కూడా టచ్ లో ఉన్నారని చెప్పింది.

  బలాన్ని పెంచుకోబడనికి సిద్దమైన తనూశ్రీ దత్తా

  బలాన్ని పెంచుకోబడనికి సిద్దమైన తనూశ్రీ దత్తా

  2008లో సీనియర్ నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా ఇబ్బంది పెట్టాడని, అసభ్యంగా తాకాడు అంటూ రెండేళ్ల క్రితం అందరిని షాక్ కి గురి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఆరోపణలు చేశాక కేసు నమోదైంది. కానీ నానా పటేకర్ ఎలాంటి తప్పు చేయలేదని క్లీన్ చీట్ వచ్చింది. ఇక చాలా రోజుల తరువాత తనూశ్రీ దత్తా మళ్ళీ బాలీవుడ్ లో తన బలాన్ని పెంచుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

  యూఎస్ జాబ్ పై క్లారిటీ

  యూఎస్ జాబ్ పై క్లారిటీ

  ఇక యూఎస్ జాబ్ పై కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. నేను ఎల్ఏలో ఐటి ఉద్యోగం చేస్తున్నానని కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. నిజం ఏమిటంటే యుఎస్ ప్రభుత్వ రక్షణ రంగంలో అద్భుతమైన ఐటి ఉద్యోగ అవకాశాన్ని పొందాను. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన ఉద్యోగ అవకాశం. ఈ రంగంలో పనిచేయడం గౌరవంగా ఉండేది. అయితే నేను నా నటనతో మళ్ళీ బిజీ కావాలని అనుకుంటున్నాను. ఈ రక్షణ ఉద్యోగం కోసం నేను 3 సంవత్సరాల పాటు ఒప్పందంపై సంతకం చేయవలసి వచ్చింది.

  ఆఫర్స్ చాలానే వస్తున్నాయి

  ఆఫర్స్ చాలానే వస్తున్నాయి

  ఇక అనవసరంగా కొందరి కారణంగా అమెరికా వెళ్లాల్సి వచ్చిందని చెప్పిన తను శ్రీ.. ఆందోళన చెందకుండా మళ్ళీ నా సినిమా కెరీర్ తో బిజీ అవ్వాలని అనుకుంటున్నానని అంది. ఇప్పటికే కొన్ని బిగ్ బడ్జెట్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. అలాగే సౌత్ సినిమాలు కూడా చేయబోతున్నాను. ఇక వెబ్ సిరీస్ ఆఫర్స్ కూడా చాలానే వస్తున్నాయని చెప్పిన తనూశ్రీ దత్తా బాలీవుడ్ లో మళ్ళీ తన రేంజ్ ఏమిటో చూపిస్తానని ధీమా వ్యక్తం చేసింది. మరి ఆమె ఎంతవరకు బిజీ అవుతుందో చూడాలి.

  English summary
  Tanushree Dutta was one of the actresses who took the Meetoo movement to another level. Despite giving a break to this glamorous beauty industry it continues to be highlighted with occasional controversy news. No matter what the controversy, it is becoming a topic of discussion in the media with counters in its own style. In 2018, it is known that Ammadu made sexual allegations against a senior talented actor.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X