twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లైంగిక వేధింపులు: పోలీస్ కంప్లయింట్, నటుడితో పాటు అందరినీ ఇరికించింది!

    |

    ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ మీద గత కొన్ని రోజులుగా మీడియాలో లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న తనుశ్రీ దత్తా ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కంప్లయింట్ ఇవ్వకుండా మీడియాలో ఈ రచ్చ ఏంది? అంటూ ఆమెపై విమర్శలకు రావడం, ఆమె మీద పరువు నష్టం కేసులు నమోదు కావడంతో తనుశ్రీ కూడా లీగల్‌గా ప్రోసీడ్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. 2008లో హిందీ మూవీ 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమా షూటింగులో నానా పాటేకర్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, లైంగికంగా వేధించాడని ఈ మాజీ మిస్ ఇండియా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.

    <strong>లైంగికంగా వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయవా? నీ తీరుపై అనుమానం!</strong>లైంగికంగా వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయవా? నీ తీరుపై అనుమానం!

    నటుడితో పాటు అందరినీ ఇరికించింది

    నటుడితో పాటు అందరినీ ఇరికించింది

    నానా పాటేకర్‌తో పాటు కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య, నిర్మాత సమీ సిద్ధిఖీ, దర్శకుడు రాకేష్ సారంగ్, మహా రాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎంఎన్ఎస్) కార్యకర్తలపై ఆమె ఫిర్యాదు చేశారు.

     ఎఫ్ఐఆర్ నమోదు చేయని పోలీసులు

    ఎఫ్ఐఆర్ నమోదు చేయని పోలీసులు

    ముంబైలోని ఓషివరా పోలీస్ స్టేషన్లో తనుశ్రీ దత్త ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తనుశ్రీ నుండి రాతపూర్వకమైన ఫిర్యాదు స్వీకరించారని, అయితే ఈ ఫిర్యాదుపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఎఫ్ఐఆర్) నమోదు చేయాలని తెలుస్తోంది.

    ఆరోజు ఏం జరిగింది?

    ఆరోజు ఏం జరిగింది?

    2008లో ‘హార్న్ ఓకే ప్లీజ్' మూవీలో నానా పాటేకర్, తనుశ్రీ దత్తా మీద పాట చిత్రీకరిస్తుండగా.... ఆమెను ఒక అసభ్యకరమైన స్టెప్ వేయాలని చెప్పారని, అందుకు ఆమె నిరాకరించడంతో నానా పాటేకర్ వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

     బట్టలిప్పమన్నాడంటూ ఆ దర్శకుడిపై కూడా

    బట్టలిప్పమన్నాడంటూ ఆ దర్శకుడిపై కూడా

    నానా పాటేకర్ మీద మాత్రమే కాదు... బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మీద కూడా తనుశ్రీ దత్తా ఆరోపణలు చేశారు. ‘చాకొలేట్' మూవీ సెట్స్‌‌లో అందరి ముందు తనను బట్టలిప్పమన్నాడంటూ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అటు నానా పాటేకర్ తో పాటు, వివేక్ అగ్నిహోత్రి తమపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఆమెకు లీగల్ నోటీసులు పంపారు.

     నానా వెంట పడిన మీడియా

    నానా వెంట పడిన మీడియా

    హౌస్‌‌ఫుల్ 4 షూటింగ్ నుండి వస్తూ శనివారం నానా పాటేకర్ కంట పడటంతో అతడిని మీడియా వెంబడించింది. తనుశ్రీ దత్తా విషయంలో స్పందించాలని కోరగా... అబద్దం ఎప్పుడూ అబద్దమే, ఈ విషయంలో నేను పదేళ్ల క్రితమే వివరణ ఇచ్చాను అన్నారు.

     నా కూతురు లాంటిదన్న నానా

    నా కూతురు లాంటిదన్న నానా

    తనుశ్రీ దత్తా వివాదంపై మీడియాతో మాట్లాడటానికి నానా పాటేకర్ ఇష్ట పడటం లేదు. పదేళ్ల క్రితం ఈ ఆరోపణలు తెరపైకి వచ్చినపుడు తనుశ్రీ దత్తా తన కూతురు లాంటిదని స్టేట్మెంట్ ఇచ్చారు.

     బిగ్ బాస్ 12 ఎంట్రీ కోసమే అంటూ

    బిగ్ బాస్ 12 ఎంట్రీ కోసమే అంటూ

    పదేళ్ల క్రితం ఈ గొడవ జరిగినపుడు నానా పాటేకర్‌కు మద్దతుగా ఎంఎన్ఎస్ పార్టీ కార్యకర్తలపై ఆమె కారుపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఈ ఇష్యూను తనుశ్రీ తిరగతోడటంపై ఎంఎన్ఎస్ పార్టీ కార్యకర్తలు మండి పడ్డారు. బిగ్ బాస్ 12లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసమే ఆమె ఈ ఆరోపణలు చేస్తుందని ఫైర్ అయ్యారు.

     తనుశ్రీకి కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి మద్దతు

    తనుశ్రీకి కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి మద్దతు

    కాగా... ఈ లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారంలో తనుశ్రీ దత్తాకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనక గాంధీ మద్దతు పలికారు.

    English summary
    Bollywood actress Tanushree Dutta has finally filed a written police complaint against veteran actor Nana Patekar for alleged sexual harassment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X