twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ రోజు ఆయన లేకపోతే బతికే వాడిని కాదు, నాకు ప్రాణబిక్షపెట్టారు!

    |

    మహారాష్ట్రను తన కనుసైగల్లో నియంత్రించిన పొలిటికల్ టైగర్ బాల్ థాక్రే. థాక్రే మరణం తర్వాత ప్రస్తుతం ఆయన జీవితం ఆధారంగా సినిమా రూపొందింది. ఈ చిత్రంలో థాక్రే పాత్రను ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దీఖీ పోషించారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ముంబైలో జరుగగా, ఆ ఈవెంట్‌కు బిగ్‌బీ అమితాబ్ హాజరయ్యారు. ఆ సందర్భంగా థాక్రే గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

    కూలీ షూటింగ్‌‌లో ప్రమాదం

    కూలీ షూటింగ్‌‌లో ప్రమాదం

    1983లో కూలీ చిత్రం షూటింగ్‌లో దారుణమైన ప్రమాదానికి గురయ్యాను. ఆ సమయంలో నా ఆరోగ్యం విషమించింది. వాతావరణం సరిగా లేకపోవడంతో నన్ను ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ దొరకలేదు. అలాంటి సమయంలో బాల్ థాక్రే వెంటనే స్పందించి తన అంబులెన్స్‌లో నన్ను హాస్పిటల్‌కు చేర్చారు అని బిగ్‌బీ ఆనాటి రోజులను గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యాడు.

    బాల్ థాక్రే స్పందించకపోతే

    బాల్ థాక్రే స్పందించకపోతే

    నేను గాయపడిన రోజున సకాలంలో బాల్ థాక్రే స్పందించకపోతే నా పరిస్థితి అదోలా ఉండేది. ఈ రోజు నేను బతికి ఉండేవాడిని కాదు. నాకు ప్రాణబిక్ష పెట్టారు. ఆయనతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అతనంటే నాకు ఎనలేని అభిమానం అని అమితాబ్ చెప్పారు.

     జయను కూతురిలా చూసుకొన్నాడు

    జయను కూతురిలా చూసుకొన్నాడు

    జయ బచ్చన్‌తో నా పెళ్లి జరిగినప్పుడు కూడా థాక్రే పెద్ద మనసుతో వ్యవహరించాడు. పెళ్లి తర్వాత మమల్ని ఆహ్వానించడంతో థాక్రేను కలిశాం. ఆ సమయంలో జయబచ్చన్‌ను ఓ కూతురిలా చూసుకొన్నారు అని అమితాబ్ వెల్లడించారు.

    థాక్రే మూవీ 24న రిలీజ్

    థాక్రే మూవీ 24న రిలీజ్

    ప్రపంచవ్యాప్తంగా థాక్రే చిత్రం జనవరి 24న రిలీజ్ కానున్నది. నవాజుద్దీన్ సిద్ధిఖీ థాక్రే పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. ఆయన భార్య మీనాతాయ్‌‌గా బాలీవుడ్ నటి‌ అమృతారావు నటించారు. ఈ చిత్రం కంగన రనౌత్ నటించిన మణికర్ణికతో పోటీ పడనున్నది.

    English summary
    Bollywood Super Star Amitabh Bachchan revealed details of his friendship with the politician Bal Thackeray. He attended for Thackeray's Biopic Trailer launch. Nawazuddin Siddiqui will play Thackeray role in the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X