twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాల్ థాకరే బయోపిక్ టైల్రర్: నవాజుద్దీన్ లుక్ అదుర్స్, వివాదాస్పద అంశాలతో..

    |

    భారత రాజకీయాల్లో... ముఖ్యంగా మహారాష్ట్ర రాజకీయాల్లో వివాదాస్పద నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి బాల్ థాకరే. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కున్న 'థాకరే' చిత్రం ట్రైలర్ బుధవారం ముంబైలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి థాకరే కుమారుడు, ప్రస్తుత శివసేన పార్టీ ప్రెసిడెంట్ ఉద్ధవ్ థాకరే కూడా హాజరయ్యారు.

    ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికీ ఈ చిత్రంలో బాల్ థాకరే పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన భార్య మీనా థాయ్ థాకరే పాత్రలో అమృతరావు కనిపించబోతున్నారు. అల్లర్లు, గొడవలు, హింసాత్మక సంఘటనలతో ట్రైలర్ మొదలైంది.

    'ఈ సమయంలో బొంబాయిని ఒక వ్యక్తి మాత్రమే శాంత పరచగలడు' అనే బ్యాగ్రౌండ్ వాయిస్‌తో బాల్ థాకరే పాత్రలో నవాజుద్ధీ సిద్ధికీ ఎంట్రీ అదిరిపోయేలా ప్రజంట్ చేశారు. థాకరే పాత్రలో నవాజుద్దీన్ లుక్ పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

    ఈ ట్రైలర్లో పలు వివాదాస్పద అంశాలను కూడా ప్రస్తవించారు. ముఖ్యంగా బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో బాల్ థాకరే స్పందించిన తీరు కూడా సినిమాలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

    Thackeray trailer released

    మరాఠీల కోసం బాల్ థాకరే ఎలాంటి పోరాటం చేశారు, ఆయన పార్టీ పెట్టడానికి కారణం ఏమిటి లాంటి అంశాలతో పాటు పార్టీ స్థాపించిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది సినిమాలో చూపించబోతున్నారు. 'థాకరే' చిత్రానికి అభిజిత్ పాన్సే దర్శకత్వం వహించారు. శివసేన పొలిటీషియన్ సంజయ్ రౌత్ స్టోరీ అందించారు. జనవరి 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    English summary
    The first trailer for Thackeray, a biopic on controversial politician Bal Thackeray, was released on Wednesday. The film stars Nawazuddin Siddiqui as the late Shiv Sena supremo, and Amrita Rao as his wife, Meena Tai Thackeray. Thackeray has been scheduled for a January 25 release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X