Don't Miss!
- Sports
విరాట్ కోహ్లీ ఆ బంతిని వదిలేయాల్సింది.. ఇన్ని తప్పులు ఎప్పుడూ చేసుండకపోవచ్చు: సెహ్వాగ్
- News
పీఎం కిసాన్ వద్దా..? సగ మందికి కూడా రావడం లేదు: రాములమ్మ ఫైర్
- Finance
తెలంగాణలో యూరియా ప్లాంట్‌ను తెరిపించింది మేమే: మోడీ: రూ.8 లక్షల కోట్లు
- Automobiles
భారతదేశంలోకి రావాలంటే మా కండిషన్స్ ఇవి: టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్
- Lifestyle
'ఈ' టీ తాగడం వల్ల మీ గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చు అని మీకు తెలుసా?
- Technology
Xiaomi Pad 6 లాంచ్ వివరాలు వచ్చేసాయి ! స్పెసిఫికేషన్లు చూడండి
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
The Kashmir Filesపై సింగపూర్ బ్యాన్.. రెచ్చగొట్టేలా, ఏకపక్షంగా ఉందంటూ !
కాశ్మీరీ పండిట్ల ఊచకోత ఆధారంగా తెరకెక్కిన 'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.337 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఇప్పటికే అనేక వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇక మరోసారి ఈ సినిమాను వివాదాల్లో చిక్కుకుంది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన 'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రాన్ని సింగపూర్‌లో నిషేధించినట్లు వార్తలు వస్తున్నాయి. సింగపూర్‌లో నిషేధం వార్తలు వెలుగులోకి వచ్చిన తర్వాత, తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ ట్విట్టర్ ద్వారా బీజేపీ సహా వివేక్ అగ్నిహోత్రిపై విరుచుకుపడ్డారు. ఒక నివేదిక యొక్క స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ, శశి థరూర్'భారతదేశంలోని అధికార పార్టీ ప్రచారం చేస్తున్న చిత్రం సింగపూర్‌లో నిషేధించబడింది.' అంటూ ఆయన పేర్కొన్నారు.
శశి థరూర్ షేర్ చేసిన స్క్రీన్ షాట్ 'ది కాశ్మీర్ ఫైల్స్'పై నిషేధం వెనుక కారణాన్ని వివరిస్తుంది. స్క్రీన్‌షాట్ లో "కాశ్మీర్ ఫైల్స్‌లో కశ్మీర్‌లో జరుగుతున్న ఘర్షణలో ముస్లింలు రెచ్చగొట్టేలా మరియు హిందువులు హింసించబడుతున్నారని ఏకపక్షంగా చిత్రీకరించారు. దీని కారణంగా ఈ సినిమాను మన బహుళ-మత సమాజంలో వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని అలాగే సామాజిక దూరాన్ని సృష్టిస్తుంది." సామరస్యానికి భంగం కలిగించే అవకాశం ఉంది కాబట్టి విడుదల చేయడం లేదని ఉంది. ఇక సింగపూర్‌లోని మతపరమైన సంఘాలను కించపరిచే ఏదైనా మెటీరియల్ విడుదల చేయడానికి అనుమతించబడదు కాబట్టి ఈ సినిమాను కూడా అక్కడ నిషేధించారు. ఇక ఈ విషయం మీద దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి శశి థరూర్‌ను ఇడియట్ అంటూ పిలుస్తూనే ప్రియమైన శశి థరూర్ అని సంభోదించారు.

అంతే కాక సింగపూర్ ప్రపంచంలోనే అత్యంత తిరోగమన సెన్సార్ అని ఆయన పేర్కొన్నారు. 'ది లాస్ట్ టెంప్టేషన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్' (మీ మేడమ్‌ని అడగండి) క్యూబునబ్య కూడా నిషేధించింది. రొమాంటిక్ చిత్రం 'ది లీలా హోటల్ ఫైల్స్' కూడా అక్కడ నిషేధించబడింది. దయచేసి కాశ్మీరీ హిందూ మారణహోమాన్ని ఎగతాళి చేయడం ఆపండి అంటూ ఆయన పేర్కొన్నారు. ఇదే విషయం మీద అనుపమ్ ఖేర్ ట్వీట్ చేస్తూ, 'డియర్ శశి థరూర్! కాశ్మీరీ హిందువుల ఊచకోత పట్ల మీ ఉదాసీనత బాధాకరం. గత్యంతరం లేక, కనీసం స్వయంగా కాశ్మీరీ అయిన సునంద కోసమైనా, మీరు కాశ్మీరీ పండిట్‌ల పట్ల కొంత సున్నితత్వాన్ని ప్రదర్శించాలి అలాగే దేశం కాశ్మీర్ ఫైల్స్‌ను నిషేధించినందుకు విజయం సాధించి నట్టు ఫీల్ అవకూడదని పేర్కొన్నారు. అనుపమ్ ఖేర్ ట్వీట్ తర్వాత వివేక్ అగ్నిహోత్రి శశి థరూర్‌ని మళ్ళీ టార్గెట్ చేశారు. 'హే శశి థరూర్, దివంగత సునంద పుష్కర్ కాశ్మీరీ హిందువు అన్నది నిజమేనా? జోడించిన స్క్రీన్ షాట్ నిజమేనా? నిజమే అయితే, హిందూ సంప్రదాయంలో చనిపోయిన వారికి గౌరవం ఇవ్వడానికి, మీరు మీ ట్వీట్‌ను తొలగించి, వారి ఆత్మకు క్షమాపణ చెప్పాలి. అని డిమాండ్ చేశారు.