నేను గర్భవతిని కాదు.. చూసుకోండి అంటూ టివి భామ అర్థనగ్న ఫోటోలు!
Recommended Video

సోషల్ మీడియాలో ఘాటు అందాలతో రెచ్చగొట్టే టివి సెలెబ్రిటీ సలోని చోప్రా మరో మారు రెచ్చిపోయింది. ఏకంగా అర్థనగ్న చిత్రాలు పోస్ట్ చేసి వేదాంతాలు వల్లించింది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన సలోని చోప్రా టాప్ లెస్ ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం బెల్జియం టూర్ లో ఉంది. అక్కడ తాను బస చేస్తున్న హోటల్ గది నుంచే ఈ అర్థ నగ్న ఫోటోలు పోస్ట్ చేసింది.

వేదాంతం
తన అర్థ నగ్న ఫోటోల ద్వారా ఏమో సందేశం ఇచ్చే ప్రయత్నం చేసింది. అమ్మాయిలందరూ వారి లోపాలని సెలెబ్రేట్ చేసుకోవాలని, లోపం లేని అమ్మాయి, అబ్బాయి ఎవరూ లేరని చెబుతోంది.
గర్భవతిని కాదు
తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో కామెంట్ చేస్తూ.. నేను గర్భవతిని కాదు అంటూ క్లారిటీ ఇచ్చింది. అసలు ఈ విషయం ఎందుకు తెలియజేయాల్సి వచ్చిందో ఎవరికీ అర్థం కావడం లేదు. అది కూడా టాప్ లెస్ పోజు పోస్ట్ చేసి తన కడుపు ప్లాట్ గా ఉందంటూ క్లారిటీ ఇచ్చింది. తన ప్రెగ్నెన్సీ గురించి ఎక్కడైనా రూమర్స్ వినిందేమో.. అందుకే ఇలా చేస్తోంది అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
అమ్మాయిలందరూ
అమ్మాయిలందరూ నాజూకు నడుముతో ఉండరు. అంత మాత్రాన వారు ప్రెగ్నెన్సీ తో ఉన్నట్లు కాదు. అబ్బాయిలందరికి సిక్స్ ఫ్యాక్ ఉండదు కదా. నాజూకుగా ఉన్న అమ్మాయిలందరూ ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు. బొద్దుగా ఉన్న అమ్మాయిలంతా అనారోగ్యంతో ఉన్నట్లు కాదు అని తెలిపింది.
నేరం కాదు
ఇటీవల సుప్రీం కోర్టు సంచలనతీర్పు వెల్లడించిన సెక్షన్ 377 గురించి కూడా సలోని చోప్రా మాట్లాడింది. నేను లెస్బియన్ ని కాదు. అయినా కూడా నాకు సుప్రీం తీర్పు సంతోషాన్ని ఇచ్చింది. ఇక మనదేశంలో స్వలింగ సంపర్కం నేరం కాదు అని సలోని చోప్రా వెల్లడించింది.

బుల్లి తెరపై
సలోని చోప్రా బుల్లి తెరపై రాణిస్తోంది. ఎంటివి షోలతో పాపులర్ అయింది. సోషల్ మీడియాలో ఇలా ఘాటు ఫోజులు పెడుతూ యువతని ఆకర్షిస్తోంది.


Click it and Unblock the Notifications











