Don't Miss!
- News
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..!!
- Finance
Telangana Budget: కీలక రంగాలకు కేటాయింపులు ఇలా.. జర్నలిస్టుల సంక్షేమానికి కూడా..
- Sports
INDvsAUS : స్పిన్ పిచ్‌లతో భారత్‌కూ సమస్యే?.. రికార్డులు చూస్తే తెలిసిపోతోంది!
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Aryan Khan కేసులో మరో ట్విస్టు.. బెయిల్ కోసం 50 కోట్ల ముడుపులు.. షారుక్ మేనేజర్‌కు బిగుస్తున్న సిట్ ఉచ్చు
బాలీవుడ్ బాద్షా ఆర్యన్ ఖాన్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకొన్నది. ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం షారుక్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ ముడుపులు చెల్లించడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై ముంబైకి చెందిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ రంగంలోకి దూకింది. తాజాగా షారుక్ మేనేజర్‌కు మరోసారి సమన్లు జారీ చేసేందుకు సిద్ధమైంది. ఈ కేసుకు సంబంధించిన వివాదంలోకి వెళ్లితే...

25 కోట్ల ముడుపులు చెల్లించేందుకు
అక్టోబర్ 2వ తేదీన ముంబై నుంచి గోవాకు వెళ్తున్న క్రూయిజ్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో ఆర్యన్ ఖాన్‌తోపాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో సుమారు నెలరోజులపాటు ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో జుడిషియల్ రిమాండ్‌పై ఉన్నారు. ఆ సమయంలో షారుక్ ఖాన్ కుటుంబం బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేసింది. అయితే ఈ కేసులో ఎన్సీబీ తరఫు ప్రత్యక్ష సాక్షి కేపీ గోసవి తీరు వివాదాస్పదంగా మారింది. ఆర్యన్ బెయిల్ కోసం షారుక్ మేనేజర్ పూజా పూజా దద్లానీతో 25 కోట్లు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.

పూజా దద్లానీపై ఆరోపణలు
ఆర్యన్ ఖాన్ కోసం షారుక్ ఖాన్ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో పూజా దద్లానీతో కేపీ గోసవి ముడుపుల కోసం ఫోన్‌లో ముడుపులు చెల్లింపు విషయంలో సంప్రదింపులు జరిపారు. ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు పూజా దద్లానీ సానుకూలంగా ఉన్నారు అంటూ ప్రత్యక్ష సాక్షి ప్రభాకర్ సెయిల్, సామ్ డిసౌజా మీడియా ముందుకు వచ్చి సంచలన విషయాలు బయట పెట్టారు. ఈ విషయంపై నిగ్గు తేల్చడానికి మహారాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేసింది.

ముందస్తుగా 50 లక్షల ముడుపులు
పూజా దద్లానీ, కేపీ గోసవి ముడుపుల వ్యవహారంలో ఆరోపణలు చేసిన సామ్ డిసౌజాను నవంబర్ 15వ తేదీన సిట్ విచారించింది. అక్టోబర్ 3న ఆర్యన్ ఖాన్ అరెస్ట్‌కు ముందు పూజా దద్లానీ నుంచి గోసవి 50 లక్షల రూపాయలు తీసుకొన్నాడు. ఆ తర్వాత ఆర్యన్ ఖాన్ అరెస్ట్ జరగడంతో ఆ మొత్తాన్ని పూజాకు తిరిగి ఇచ్చాడు అని డిసౌజా తాజా విచారణలో వెల్లడించినట్టు సమాచారం.

పూజా దద్లానీ ముడుపులపై సిట్
పుజా దల్దానీ, కేపీ గోసవి ముడుపుల వ్యవహారంపై ప్రభాకర్ సెయిల్ చేసిన ఆరోపణలను ఆధారంగా చేసుకొని దర్యాప్తు ప్రారంభించింది. ఆ నేపథ్యంలోనే పూజా దద్లానీకి సిట్ రెండుసార్లు సమన్లు జారీ చేసింది. అయితే తన ఆరోగ్యం సరిగా లేదనే సాకుతో విచారణకు పూజా గైర్హాజరు అయింది. అయితే ఈ కేసులో మూడోసారి ఆమెకు సమన్లు జారీ చేయాలని సిట్ నిర్ణయించినట్టు తెలిసింది.

విచారణకు హాజరు కాకుండా పూజా దద్లానీ
సిట్ విచారణకు హాజరు కాకుండా తప్పించుకొంటున్న పూజా దద్లానీ వ్యవహారంపై ముంబై పోలీసులు గుర్రుగా ఉన్నారు. ఈ వ్యవహారంలో న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో పూజా దద్లానీ విచారణకు హాజరవుతుందా? లేదా వేచి చూడాల్సిందే.
Recommended Video

ఆర్యన్ ఖాన్ బెయిల్‌పై విడుదల
27 రోజుల తర్వాత అంటే అక్టోబర్ 3వ తేదీన ముంబై, గోవా క్రూయిజ్‌లో జరిగిన పార్టీలో డ్రగ్స్ ఉపయోగిస్తున్నారనే ఆరోపణలపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే పలుమార్లు బెయిల్ పిటిషన్‌ను స్థానిక ముంబై కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. అయితే బాంబే హైకోర్టు అక్టోబర్ 28న ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేయడంతో ఆర్యన్ ఖాన్ బయటకు వచ్చారు.