»   » ఖరీదైన విల్లాను అమ్ముకొన్న బాలీవుడ్ హీరో.. నటనకు గుడ్‌బై!

ఖరీదైన విల్లాను అమ్ముకొన్న బాలీవుడ్ హీరో.. నటనకు గుడ్‌బై!

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ ఏదంటే యష్ రాజ్ ఫిలింస్. ఆ బ్యానర్‌లో యష్ చోప్రా రూపొందించిన చిత్రాలు బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. ఆ సంస్థ నుంచి నట వారసుడిగా యష్ చోప్రా కుమారుడు ఉదయ్ చోప్రా పరిశ్రమకు పరిచయం అయ్యారు. అయితే నటుడిగా ఉదయ్ రాణించలేకపోయారు. అమీర్ ఖాన్ నటించిన ధూమ్3 చిత్రంలో చివరిసారిగా ఆయన తెరపైన కనిపించారు. అయితే ఉదయ్ నటనకు స్వస్తి చెప్పి మరో రంగంపై దృష్టిపెట్టినట్టు, ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగు చేశాయి. అవేమిటంటే..

  ఖరీదైన విల్లా అమ్మకం

  ఖరీదైన విల్లా అమ్మకం

  ఉదయ్ చోప్రా తన విలాసవంతమైన విల్లాను అమ్ముకొన్నట్టు వచ్చిన వార్త బాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశాయి. హాలీవుడ్ హిల్స్‌లోని ఖరీదైన బంగ్లాను సుమారు 26 కోట్ల రూపాయలకు అమ్మినట్టు సమాచారం. అందమైన స్విమ్మింగ్ పూల్, స్పా ఉన్న ఇంటిని అమ్మివేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఎందుకోసం అమ్మారనే ప్రశ్నగానే మిగిలింది.

  నటనకు ఉదయ్ చోప్రా గుడ్‌బై

  నటనకు ఉదయ్ చోప్రా గుడ్‌బై

  2013 నుంచే సినిమాలకు దూరంగా ఉంటున్న ఉదయ్ చోప్రా నటనకు గుడ్‌బై చెప్పినట్టు ఉదయ్ చోప్రా వెల్లడించారు. యాక్టింగ్‌ను వదిలిపెట్టి మరో కెరీర్‌ను ఎంచుకోవాలనుకొన్నాను. నా సోదరుడు ఆదిత్య చోప్రా యష్ రాజ్ ఫిలింస్, ఇంటర్నేషనల్ వ్యవహారాలను చూసుకోవాలని సూచించారు. దాంతో అమెరికాకు వెళ్లి ప్రొడక్షన్ కోర్సు చేశాను అని తెలిపారు.

   నిర్మాతగా మారిన ఉదయ్

  నిర్మాతగా మారిన ఉదయ్

  లాస్ ఎంజెలెస్‌లోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో ప్రొడక్షన్ డిజైన్ కోర్సు పూర్తయిన వెంటనే హాలీవుడ్ నటులు జాసన్ బేట్‌మెన్, ఒలివియా విల్డేతో ది లాంగెస్ట్ వీక్ అనే చిత్రాన్ని రూపొందించాను. ఆ తర్వాత ప్రముఖ నటి నికోల్ కిడ్మన్‌తో గ్రేస్ ఆఫ్ మోనాకో చిత్రాన్ని నిర్మించాను. దానిని కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శిస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ కమర్షియల్‌గా ఫెయిల్యూర్ అయింది.

  మరో హాలీవుడ్ చిత్రం నిర్మాణం

  మరో హాలీవుడ్ చిత్రం నిర్మాణం

  త్వరలోనే సెడ్యూసింగ్ ఇంగ్రిడ్ బెర్మన్ చిత్రాన్ని నిర్మిస్తున్నాను. హాలీవుడ్‌లో ప్రముఖ ఫొటో జర్నలిస్టు రాబర్ట్ కాపా జీవితం ఆధారంగా సినిమాను రూపొందిస్తున్నాను. జెస్సికా చాస్టిన్ కీలక పాత్రను పోషిస్తున్నారు అని ఉదయ్ చోప్రా తెలిపారు.

  English summary
  Uday Chopra is selling his sprawling villa in the posh Hollywood Hills for a whopping $3.799 million (around Rs 25.47 crore). The luxurious pad boasts of, among other things, a saltwater pool and spa. Uday, who was last seen on the big screen in Dhoom 3 (2013), has had a rather forgettable stint in front of the camera
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more