twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మృత్యువుతో ప్రముఖ హీరో పోరాటం.. బతికేది కష్టమేనట.. శ్రీదేవి విషాదం మరువకముందే..

    By Rajababu
    |

    Recommended Video

    శ్రీదేవి మరణవార్త మరవకముందే ....

    విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ జీవన్మరణ సమస్యతో పోరాడుతున్నారు. ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఇర్ఫాన్‌కు సన్నిహితులు, స్నేహితులు, సహచర నటులు అండగా నిలుస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై వెల్లువెత్తున్న వదంతులపై, వస్తున్న వార్తలపై ఎలాంటి నిర్ణయానికి రావొద్దని వైద్యులు సలహా ఇస్తున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఇర్ఫాన్ ఓ యోధుడు అని భార్య పేర్కొనడం గమనార్హం. శ్రీదేవి మరణవార్త నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న సినీలోకానికి ఇర్ఫాన్ వ్యాధి వార్త తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది.

     ఇర్ఫాన్‌కు అరుదైన వ్యాధి

    ఇర్ఫాన్‌కు అరుదైన వ్యాధి

    ఇర్ఫాన్ ఖాన్ ఆరోగ్యంపై భార్య సుతాప సిక్దర్ ఫేస్‌బుక్‌లో ఓ ప్రకటన చేశారు. ఇర్ఫాన్ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ కష్టకాలంలో సపోర్ట్‌గా నిలిచిన వారికి నా థ్యాంక్స్.

     ఆరోగ్యం ఫర్వాలేదు

    ఆరోగ్యం ఫర్వాలేదు

    ప్రస్తుతం ఇర్ఫాన్ ఆరోగ్యం పర్వాలేదు. ఆయన బాధపడుతున్న వ్యాధిపై ఎలాంటి ఊహాగానాలు చేయవద్దు. నా ప్రియ స్నేహితుడు, నా జీవిత భాగస్వామి గొప్ప పోరాట యోధుడు అని అన్నారు.

    మనోధైర్యంతో పోరాటం

    మనోధైర్యంతో పోరాటం

    తన జీవిత ప్రయాణంలో అడ్డంకిగా నిలిచిన మహమ్మారిపై అద్భుతమైన మనోధైర్యంతో పోరాటం సాగిస్తున్నారు. ఆయనకు మద్దతుగా మనం భగవంతుడిని కోరడం తప్ప మరోకటి లేదు అని సుతాప పేర్కొన్నారు.

     దేవుడికి రుణపడి

    దేవుడికి రుణపడి

    విపత్కర పరిస్థితుల్లో నా భర్త ఓ యోధుడిగా మార్చిన దేవుడికి ఎల్లవేళలా రుణపడి ఉంటాను. ఆ అరుదైన వ్యాధి నుంచి ఎలా బయటపడాలి అనే విషయంపై వైద్యులపై సంప్రదింపులు జరుపుతున్నాం.

     జీర్ణించుకోలేకపోతున్నాం..

    జీర్ణించుకోలేకపోతున్నాం..

    ఇర్ఫాన్ సోకిన వ్యాధి గురించి తలచుకొంటేనే జీర్ణించుకోలేకపోతున్నాను. నేను కాదు మా కుటుంబం, స్నేహితులు, ఫ్యాన్స్ కూడా తట్టుకోలేకపోతున్నారు. కానీ ఇర్ఫాన్ మాత్రం మనో నిబ్బరంగా ఉన్నాడు. ఆ మహమ్మారిపై విజయం సాధిస్తాడు అనే విశ్వాసాన్ని సుతాప వ్యక్తం చేశారు.

     ఏదో నిర్ణయానికి రావొద్దు

    ఏదో నిర్ణయానికి రావొద్దు

    ఇర్ఫాన్ ఆరోగ్యంపై ఆందోళన చెందిన మీడియా ఏదో ఒక నిర్ణయానికి వస్తున్నారు. వాటి ఆధారంగా కథనాలు రాస్తున్నారు. అలాంటి వార్తలు మరింత ఆందోళనకరంగా మారుతాయి అని సుతాప పేర్కొన్నారు.

     వ్యాధి గురించి నేనే వెల్లడిస్తా

    వ్యాధి గురించి నేనే వెల్లడిస్తా

    ఇప్పటివరకు ఇర్ఫాన్ ఏ వ్యాధితో బాధపడుతున్నారనే విషయ ఇంకా వెలుగు చూడలేదు. కానీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు పూర్తయిన తర్వాతనే నేను బాధపెడుతున్న వ్యాధి గురించి నేనే స్వయంగా మీడియాకు వెల్లడిస్తాను అని ఇర్ఫాన్ ఒక ప్రకటనలో తెలిపారు.

     అమెరికాకు ఇర్ఫాన్‌ఖాన్

    అమెరికాకు ఇర్ఫాన్‌ఖాన్

    ఇదిలా ఉండగా, ఇర్ఫాన్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాన్ని సినీ విమర్శకుడు ఉమర్ సంధూ ట్వీట్ చేశారు. తనకు సోకిన వ్యాధికి సంబంధించిన చికిత్స కోసం అమెరికాకు వెళ్లాలని భారతీయ వైద్యులు కోరారు అని ట్విట్టర్‌లో ఉమెర్ సంధూ వెల్లడించారు.

     ఏడాదికి మించి బతకడం

    ఏడాదికి మించి బతకడం

    ప్రస్తుతం ఇర్ఫాన్ ఆరోగ్య పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 6 నుంచి 12 నెలలకు మంచి బతకడం కష్టమే. ఆయన ఆరోగ్యం గురించి మనం భగవంతుడిని ప్రార్థించాలి అని ఉమర్ సంధూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

    English summary
    Ailing actor Irfan Khan's wife says her partner is facing his health scare -- a "rare disease" -- like a "warrior". But Umair Sandhu tweeted that Officially Confirmed, Indian doctors asked #IrfanKhan to go to USA for treatment. He is in very bad situation and having only 6-12 months more time. Our all prayers are with #IrrfanKhan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X