For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  'యురి' చిత్రమే చివరిది.. ఘనవిజయం తర్వాత నటుడు మృతి!

  |
  Uri The Surgical Strike Actor Lost His Life In Mumbai || Filmibeat Telugu

  గత ఏడాది విడుదలైన బాలీవుడ్ చిత్రాలలో యురి ది సర్జికల్ స్ట్రైక్ చిత్రం అతిపెద్ద విజయంగా నిలిచింది. ఆదిత్య ధార్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. యురి చిత్రం 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించాడు. మోహిత్ రైనా, యామిని గౌతమ్, పరేష్ రావల్ కీలక పాత్రల్లో నటించారు. 2016లో ఇండియన్ ఆర్మీపై పాక్ ఉగ్రమూకలు దాడి తెగబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఇండియా తిరుగులేని విధంగా సర్జికల్ స్ట్రైక్ జరిపి ప్రతీకారం తీర్చుకుంది. ఈ అంశం ఆధారంగానే ఆదిత్య ధార్ యురి చిత్రాన్ని తెరకెక్కించారు. ఇదిలా ఉండగా చిత్ర యూనిక్ కు విషాదాన్ని కలిగించే సంఘటన జరిగింది.

  నటుడు మృతి

  నటుడు మృతి

  యురి చిత్రంలో నవతేజ్ హుందాల్ హోమ్ మినిష్టర్ పాత్రలో నటించారు. ఆయన సోమవారం రోజు సాయంత్రం తుదిశ్వాస విడిచారు. నవతేజ్ మృతికి కారణాలు తెలియలేదు. కొన్ని దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో ఉన్నప్పటికీ నవతేజ్ కు సరైన గుర్తింపు రాలేదు. ఆయన చివరగా నటించిన యురి చిత్రం ఘనవిజయం సాధించింది. కొన్ని సన్నివేశాల్లో మాత్రమే కనిపించినప్పటికీ హోమ్ మినిష్టర్ పాత్రలో నవతేజ్ చక్కగా ఒదిగిపోయారు.

  సంతాపం తెలియజేస్తూ

  సంతాపం తెలియజేస్తూ

  నవతేజ్ మృతి చేసిన విషయాన్ని సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సంస్థ అధికారికంగా ధృవీకరించింది. నవతేజ్ మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రఘాడ సానుభూతి తెలియజేసింది. మంగళవారం రోజు నవతేజ్ కు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. నవతేజ్ కేవలం నటుడిగా మాత్రమే కాక.. నటనలో చాలా మందికి మెళుకువలు నేర్పిస్తూ శిక్షణ అందిస్తున్నారు.

  ఇద్దరు కుమార్తెలు

  ఇద్దరు కుమార్తెలు


  నవతేజ్ సతీమణి పేరు నీలం. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఇద్దరు కుమార్తెలలో ఒకరైన అవంతిక హుందాల్ బుల్లి తెర నటిగా రాణిస్తోంది. ఏహ్ హై మహబాతేన్ అనే సీరియల్ లో నటిస్తోంది. ఇక నవతేజ్ ఖల్నాయక్, తేరే మేరె సాప్నే లాంటి విజయవంతమైన చిత్రాల్లో నవతేజ్ నటించాడు. 90 వ దశకం నుంచే నవతేజ్ నటుడిగా కొనసాగుతున్నారు.

  అద్భుత విజయం

  అద్భుత విజయం

  ఉగ్ర దాడుల అనంతరం ఇండియన్ ఆర్మీ చాలా సైలెంట్ గా పాక్ భూభాగంలోకి ప్రవేశించి ఉగ్ర స్థావరాలని కూల్చి వేసింది. ఇండియన్ ఆర్మీ జరిపిన దాడిలో చాలామంది ఉగ్రవాదులు మరణించారు. ఈ కథని దర్శకుడు ఆదిత్య ధార్ వెండి తెరపై చాలా పవర్ ఫుల్ గా చూపించారు. విక్కీ కౌశల్ ఆర్మీ మేజర్ పాత్రలో అద్భుతంగా నటించాడు.

  English summary
  Uri actor Navtej Hundal dies in Mumbai. Navtej Hundal, who was last seen in Vicky Kaushal and Yami Gautam-starrer Uri: The Surgical Strike, is survived by his wife and two daughters.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more