దేశ సరిహద్దులో డాన్స్ పెర్పార్మెన్స్, యంగ్ హీరో భావోద్వేగం.. (వీడియో)
బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ రిపబ్లిక్ డే సందర్భంగా తన జీవితంలో అత్యున్నతమైన క్షణాలను ఆస్వాదించారు. 70వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని వాగా-అట్టారి బోర్డర్లో జరిగిన మిలటరీ వేడుకల్లో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
వి అన్‌బిలీవబుల్ డాన్స్ ట్రూపుతో కలిసి దేశ సరిహద్దులో జరిగిన ఈ వేడుకల్లో వరుణ్ తన పవర్ ప్యాక్డ్ డాన్స్ పెర్ఫార్మెన్స్‌తో మెప్పించారు. బిఎస్ఎఫ్ ఎంబ్లమ్‌తో కూడిన డ్రెస్ ధరించిన వరుణ్.. బాలీవుడ్ దేశభక్తి గీతాలకు డాన్స్ చేశారు.
వరుణ్ ధావన్ భావోద్వేగం
ఈ విషయాన్ని తన సోషల్ మీడియా పేజీ ద్వారా షేర్ చేస్తూ.. ‘అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇవి నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని క్షణాలు. అట్టారి బోర్డర్లో ప్రదర్శన ఇచ్చే అవకాశం రావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను' అంటూ భావోద్వేగానికి గురయ్యాడు.
వీడియో షేర్ చేసిన తరణ్ ఆదర్శ్
వరుణ్ ధావన్ డాన్స్ పెర్ఫార్మెన్స్‌కు సంబంధించిన వీడియోను ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ యంగ్ హీరో డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసి అభిమానులు ముగ్దులైపోయారు.

సినిమాలు...
ప్రస్తుతం వరుణ్ ధావన్.. రెమో డిసౌజా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. డాన్స్ బేస్డ్ చిత్రంగా రూపొందుతున్న దీన్ని తాత్కాలికంగా #3 అనే పేరుతో పిలుస్తున్నారు. శ్రద్ధా కపూర్ లీడ్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఎబిసిడి సీక్వెలా?
#3... ఏబీసీడి ఫ్రాంచైజీలో వస్తున్న మూడో ఇన్‌స్టాల్మెంట్ అని ప్రచారం జరుగుతున్నప్పటికీ... అలాంటిదేమీ లేదని, ఇది పూర్తిగా కొత్త కాన్సెప్టుతో రూపొందుతోందని నిర్మాత భూషణ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ చిత్రంతో పాటు వరుణ్ ధావన్ అభిషేక్ వర్మన్ ‘కలంక్'లో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











