Don't Miss!
- Sports
IND vs AUS: ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్.. అతను ఆడటం భారత్కు కీలకం!
- News
టీఎస్ ఎస్పీడీసీఎల్లో 1601 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- Finance
h1b layoffs: సెలవులో ఉన్న టెక్కీకి లేఆఫ్.. US వెళ్లే దారిలేక..
- Lifestyle
Happy Propose Day 2023: మీరు ప్రపోజ్ చేయడానికి ఈ ప్లేసెస్ ది బెస్ట్, అవేంటంటే..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Besharam song: పఠాన్ యూనిట్ కు శివాజీ గ్రూప్ హెచ్చరిక.. పాటపై ఆగ్రహంతో షారుక్ దిష్టిబొమ్మ దహనం
బేషారం రంగ్ పాట విడుదలైన రోజే పఠాన్ సినిమాపై ఊహించిన స్థాయిలో హైప్ అయితే క్రియేట్ అయ్యింది. అయితే ఈ సినిమా పాటకు భారీ స్థాయిలో గుర్తింపు లభించినప్పటికీ కూడా అదే విధంగా నెగటివ్ కామెంట్స్ కూడా ఎక్కువ స్థాయిలోనే వస్తున్నాయి. రాజకీయంగా కూడా ఈ సినిమాపై తీవ్రస్థాయిలో వివాదాలు మొదలవుతున్నాయి. ఇక ఇటీవల కొంతమంది నిరసన వ్యక్తం చేస్తూ హీరో హీరోయిన్ బొమ్మలకు నిప్పు పెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

రాష్ట్రమంత్రి హెచ్చరిక
రీసెంట్ గా మధ్యప్రదేశ్ కు చెందిన రాష్ట్ర మంత్రి నారోత్తన్ మిశ్రా అభ్యంతర సన్నివేశాలు ఉన్నాయని తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా పాటలో కాషాయం రంగులో బికినీని ధరించి అవమానపరిచే విధంగా చేశారు అని నిరసనలు వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో సినిమాపై నిషేధం విధించాలి అని మరికొందరు నిరసన వ్యక్తం చేశారు.

వీర్ శివాజీ గ్రూప్ ఆగ్రహం
వీర్ శివాజీ గ్రూప్ కు సంబంధించిన కార్యకర్తలు ఇండోర్లో భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహిస్తూ దీపిక పదుకొన్, షారుఖ్ ఖాన్ లకు సంబంధించిన దిష్టిబొమ్మలను కూడా నిప్పు పెట్టి దగ్ధం చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ సినిమాలోని పాటలో కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయని అవి హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతిస్తున్నాయి అని చెబుతూ వెంటనే ఈ సినిమాను అడ్డుకోవాలి అని కూడా వారు డిమాండ్ చేశారు.

సినిమాను అడ్డుకుంటాం
మంత్రి నరోత్తమ్ మిశ్రా కూడా ఈ సినిమా యూనిట్ కు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. వెంటనే ఈ సినిమాలోని పొరపాట్లను సరిదిద్దుకోకపోతే సినిమాను అడ్డుకోవడానికి ప్రభుత్వం తరఫున ఏమేమి చేయాలో అది చేస్తామని కూడా అన్నారు. దీంతో ఇప్పుడు ఈ సాంగ్ చిత్ర యూనిట్ పై కొంత ఒత్తిడి పెరిగే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా ఈ సాంగ్ పై కొంత ట్రోల్స్ అయితే నడిచాయి. దీపిక బికినీలో ఇంతకుముందు చాలాసార్లు కనిపించింది. ఇక ఈ పాటలో అయితే ఆమె మరీ వల్గర్ గా ఉందనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.

వివాదాస్పదంగా మారడంతో
అసలే షారుక్ ఖాన్ బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ లేక చాలా కాలం ఇండస్ట్రీకి గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. ఇక పఠాన్ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని ఆయన సిద్ధమవుతున్నాడు. ఇక బేషారం పాటకు కూడా మొదట భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ సాంగ్ లోని బికినీ వివాదాస్పదంగా మారడంతో చిత్ర యూనిట్ లో మరికొంత టెన్షన్ నెలకొంది. భారీ బడ్జెట్ తో యాక్షన్ మూవీగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

గ్రాండ్ రిలీజ్ అప్పుడే..
మరి ఈ విషయంలో చిత్ర యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. పటాన్ సినిమాను 2023 జనవరి 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. యష్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమాలో అతిధి పాత్రలో కనిపించబోతున్నాడు.