twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బూతులు, అసభ్యకరమైన సీన్లు.... పాక్‌లో కరీనా, సోనమ్ కపూర్ మూవీపై నిషేదం!

    By Bojja Kumar
    |

    కరీనా కపూర్, సోనమ్ కపూర్, స్వర భాస్కర్, సిఖా తల్సానియా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం 'వీరే ది వెడ్డింగ్' పై పాకిస్థాన్లో నిషేదం విధించారు. ఈ చిత్రంలో బూతులతో కూడిన సెక్సువల్ డైలాగులు, అసభ్యకరమైన సీన్లు ఉన్నాయంటూ పాకిస్థాన్ సెన్సార్ బోర్డ్ ఈ నిర్ణయం తీసుకుంది. తమ సెన్సార్ నిబంధనలు ఉల్లంగించే విధంగా ఈ చిత్రం ఉందని పాకిస్థాన్ సెన్సార్ బోర్డ్ చైర్మ డన్యాల్ గిలాని తెలిపారు.

    మంగళవారం పాకిస్థాన్ సెన్సార్ బోర్డు సభ్యుల కోసం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. సినిమా చూసిన అనంతరం సింధ్ ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ కొన్ని కత్తిరింపులతో అనుమతి ఇచ్చినా... ఫైనల్ గా పాక్ కేంద్ర సెన్సార్ బోర్డ్ నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిషేధానికి సింధ్ సెన్సార్ బోర్డ్ కూడా అంగీకరించడం గమనార్హం.

    Veere Di Wedding banned in Pakistan

    ఇక ఇండియాలో ఈ సినిమాకు 'ఎ' సర్టిఫికెట్ జారీ చేశారు. సినిమా సెన్సార్ సమయంలో కొందరు ప్యానల్ మెంబర్స్ సినిమాలో వాడిన పదజాలంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ తరం యువత ఉపయోగించే లాంగ్వేజ్ ఉన్నది ఉన్నట్లుగా సినిమాలో వాడారని, ఆ డైలాగులు తీసేస్తే సినిమా నేచురల్ ఫ్లేవర్ మిస్సవుతుందని జితేంద్ర, అనిల్ కపూర్ వాదించినట్లు సమాచారం. దీంతో ఎలాంటి కట్స్ లేకుండా ఈ చిత్రానికి 'ఎ' సర్టిఫికెట్ జారీ చేశారు.

    జూన్ 1న 'వీరే ది వెడ్డింగ్' మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. శశాంకా ఘోష్ దర్శకత్వం వహించారు. అనిల్ కపూర్, రియా కపూర్, నిఖిల్ ద్వివేది, ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మాతలు. 'వీరే ది వెడ్డింగ్' అంటే స్నేహితుల పెళ్లి అని అర్థం. వినోదాత్మకంగా, ఈ తరం యువతకు నచ్చేలా ఈ చిత్రం ఉంటుందని అంటున్నారు.

    English summary
    Pakistan's CBFC has unanimously decided to ban the release of Veere Di Wedding, starring Sonam Kapoor and Kareena Kapoor Khan, because of its vulgar language and objectionable sexual dialogues. "Members of the CBFC unanimously decided to not allow the film for public exhibition in the cinemas as its content flouts the Censorship of Film Code 1980," Danyal Gilani, Central Board of Film Censors (CBFC) Chairman, told IANS via social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X