సంచలనంగా కత్రినా పెళ్లి ఖర్చులు: ఆ ఒక్క దానికే 7 లక్షలు.. ఆమె పెట్టుకునే మెహందీ ప్రత్యేకత ఏంటంటే!
కొంత కాలంగా దేశంలో ఉన్న పలు సినీ ఇండస్ట్రీల్లో వరుసగా పెళ్లి భాజాలు మోగుతున్నాయి. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకూ ఉన్న చాలా మంది సినీ ప్రముఖులు ఈ మధ్యనే వివాహాలు చేసుకున్నారు. ఎక్కువగా ఈ పరిస్థితి బాలీవుడ్‌లోనే కనిపిస్తోంది. ఇప్పటికే అక్కడ ఇటీవలి కాలంలో చాలా మంది పెళ్లిళ్లు చేసుకున్నారు. మరికొందరు ఏడడుగులు నడిచేందుకు రెడీగా ఉన్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో చాలా కాలంగా ప్రేమ పక్షుల్లా విహరిస్తోన్న కత్రినా కైఫ్, వికీ కౌశల్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరి పెళ్లికి సంబంధించిన కొన్ని ఖర్చుల వివరాలు బయటకు వచ్చాయి. ఆ లెక్కలు చూసి సినీ ప్రియులంతా షాక్ అవుతున్నారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

చారిత్రక ప్రదేశంలో కత్రినా వికీ పెళ్లి
చాలా రోజులుగా ప్రేమాయణం సాగిస్తోన్న కత్రినా కైఫ్, వికీ కౌశల్ పెళ్లికి రెడీ అయ్యారు. ఇందుకోసం రాజస్థానంలోని 14వ శతాబ్దం నాటి సిక్స్ సెన్సెస్ బార్వారా కోటలో ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ కోటను రాజస్థాన్‌కు చెందిన రాజవంశీకులు కట్టించారు. రాంథంబోర్ నేషనల్ పార్క్‌కు ఈ వేదిక 700 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలు కూడా ఉన్నాయి.

తక్కవ మందే... వాళ్ల రాకతో సందడి
కత్రినా కైప్, వికీ కౌశల్ పెళ్లి డిసెంబర్ 9న అంగరంగ వైభవంగా జరగబోతుంది. దీని కోసం చాలా తక్కువ మందిని మాత్రమే ఆహ్వానించారు. ఇందులో కొంత మంది బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు, బంధువులు, స్నేహితులు మాత్రమే పాల్గొంటారని తెలుస్తోంది. ఈ ఆహ్వానం పొందిన వారిలో చాలా మంది ఇప్పటికే రాజస్థాన్ చేరుకున్నారు. దీంతో అక్కడ సందడిగా మారింది.

పెళ్లి ఖర్చులు చూస్తే షాక్ అవుతారు
బాలీవుడ్ జంట కత్రినా కైప్, వికీ కౌశల్ పెళ్లికి సిక్స్ సెన్సెస్ బార్వారా కోట ముస్తాబైంది. ఇప్పటికే అక్కడ పలు రకాల కార్యక్రమాలు కూడా జరిగాయి. దీంతో దేశం మొత్తం ఈ పెళ్లిపైనే దృష్టి సారించింది. అందుకు అనుగుణంగానే ఈ వివాహం గురించి ఎన్నో రకాల ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పెళ్లి ఖర్చుల వివరాలు వైరల్ అవుతున్నాయి.

ఆ ఒక్క దానికే 7 లక్షలు ఖర్చు చేస్తూ
14 శతాబ్దానికి చెందిన సిక్స్ సెన్సెస్ బార్వారా కోటలో వికీ కౌశల్, కత్రినా కైఫ్ వివాహం చేసుకుంటున్నారు. ఇందుకోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో వధువరులు ఇద్దరూ చెరో సూట్‌ను బుక్ చేసుకున్నారట. దానికి ఒక్క రాత్రికి రూ. 7 లక్షలు ఖర్చు అని తెలిసింది. ఇందులో ప్రత్యేకంగా స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుందని అంటున్నారు.

కత్రినా మెహందీకి ఎంత ఖర్చంటే!
బాలీవుడ్ ప్రేమ పక్షలు వికీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి దేశ వ్యాప్తంగా సంచలనం అవుతోంది. దీనికి కారణం ఈ వివాహ మహోత్సవం కోసం వాళ్లు వెచ్చిస్తోన్న మొత్తాలే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే హోటల్‌కు, విందుకు, ఇతర కార్యక్రమాలకు అయ్యే ఖర్చుల వివరాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు కత్రినా మెహందీ విలువ లక్ష రూపాయలని ఓ న్యూస్ లీకైంది.
Recommended Video

ఆమె పెట్టుకునే మెహందీ ప్రత్యేకం
పెళ్లి వేడుక కోసం కత్రినా కైఫ్ పెట్టుకునే మెహందీకి ఎంతో ప్రత్యేకత ఉందట. రాజస్థాన్‌లోని పాలీ జిల్లాలోని సోజత్ మెహందీ (హెన్నా)నే ఆమె పెట్టుకోబోతుందట. దీని ప్రత్యేకత ఏంటంటే.. రసాయనాలు లేకుండా కేవలం చేతితోనే సహజంగా తయారు చేస్తారట. ఇది సుమారు లక్ష రూపాయలు ఉంటుందట. అయితే, కత్రినాకు ఆ సంస్థ ఉచితంగానే దీన్ని అందిస్తుందని టాక్.


Click it and Unblock the Notifications











