twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షారుక్, అమీర్ అయితే ఏంటటా? పసలేకపోతే వాళ్లేం పీకలేరు... సినీ ప్రముఖుడు కామెంట్

    |

    ప్రేక్షకుల అభిరుచిని బట్టి సినీ పరిశ్రమ తమ ఆలోచనలను మానుకోవాల్సి వస్తున్నది. కథ, కథనాలు బాగా లేకపోతే ఎంత పెద్ద సినిమానైనా, భారీ బడ్జెట్ చిత్రాన్నైనా ప్రేక్షకులు తిప్పిపంపిస్తున్నారు. అందుకు సాక్ష్యంగా సల్మాన్, అమీర్, షారుక్ ఖాన్ సినిమాలు బాలీవుడ్‌లో సాక్ష్యంగా నిలిచాయి. కథ బాగున్న చిన్నచిత్రాలను ప్రేక్షకులు హృదయాలకు హత్తుకొంటున్నారు. అయితే ప్రస్తుతం వస్తున్న సినిమాలపై నిర్మాత, దర్శకుడు విక్రమాదిత్య మోత్వాని సంచలన కామెంట్లు చేశారు. ఆయన ఏమన్నారంటే..

    స్టోరీ బాగా లేకపోతే

    స్టోరీ బాగా లేకపోతే

    బాలీవుడ్‌లో గానీ, ఇతర పరిశ్రమలో గానీ ప్రేక్షకులు అభిరుచి మారుతున్నదనే విషయంగా స్పష్టం కనిపిస్తున్నది. కథ బాగా చెప్పలేకపోతే సినిమాను మొహమాటం లేకుండా తిరస్కరిస్తున్నారు. కథ, కథనాలు బాగా లేకపోతే సినిమాను వెంటనే తిప్పి పంపిస్తున్నారు. కాబట్టి మంచి రచనలపైనే సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంది అని విక్రమాదిత్య అన్నారు. ఉడాన్, లుటేరా, ట్రాప్డ్ అనే చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

    టాప్ హీరోల సినిమాలు బోల్తా

    టాప్ హీరోల సినిమాలు బోల్తా

    భారీ బడ్జెట్, అగ్ర తారలతో రూపొందిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, జీరో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అందుకు కారణం కథ లేకపోవడమే. అదే సమయంలో స్త్రీ, అంధాదున్, బదాయి హో సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టాయి. కారణం అవి ప్రేక్షకులను మెప్పించే విధంగా కథ, కథనాలు ఉండటమే అని విక్రమాదిత్య చెప్పారు.

    మారిన ప్రేక్షకుల అభిరుచి

    మారిన ప్రేక్షకుల అభిరుచి

    సినిమా పరిశ్రమలో స్క్రీనింగ్ సంస్కృతి వేగంగా మారుతూ వస్తున్నాయి. ఒకప్పుడు సింగిల్ స్క్రీన్లు ఉండేవి. ఇప్పుడు మల్టీప్లెక్స్‌లు వచ్చాయి. అలాగే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ లాంటి స్క్రీమింగ్ ప్లాట్‌ఫాంలు అందుబాటులోకి వచ్చాయి. కథ బాగుంటే ఎక్కడి నుంచైనా మంచి స్పందన వ్యక్తమయ్యే అవకాశం ఉంటుందని పలు సందర్భాల్లో వ్యక్తమైంది. కాబట్టి మంచి కథలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది అని విక్రమాదిత్య అన్నారు.

     ఏ హీరో నటించాడనే విషయాన్ని

    ఏ హీరో నటించాడనే విషయాన్ని

    కథ బాగా లేకపోతే ఎంత పెద్ద చిత్రం, ఏ హీరో నటించాడనే విషయాన్ని ప్రేక్షకుడు పట్టించుకోవడం లేదు. నాసిరకంగా ఉండే సినిమాలను వెంటనే తిరస్కరిస్తున్నారు. స్టార్ హీరోలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తారనే అంచనాలు తప్పుతున్నాయి. మంచి కథతో రూపొందిన సినిమాలు ప్రేక్షకులను సినిమా హాళ్లకు రప్పిస్తున్నాయి అని విక్రమాదిత్య చెప్పారు.

    English summary
    vikramaditya Motwane Said that, It doesn't matter how big the film is if the story is not good. films like Thugs of Hindostan and Zero, which did not work despite being fronted by Aamir Khan and Shah Rukh Khan
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X