twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇప్పుడైనా మేల్కోవాలి.. టాలెంట్‌ను తొక్కేయకండి.. వివేక్ ఒబేరాయ్ ఎమోషనల్ పోస్ట్

    |

    సుశాంత్ సింగ్ ఆత్మహత్య ఘటనలోంచి ఎవ్వరూ బయటకు రాలేకపోతున్నారు. ఎంతో ప్రతిభావంతుడైన నటుడు డిప్రెషన్‌కు లోనవ్వడం.. ఉరి వేసుకుని ఇలా తనువు చాలించడం అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. అందరూ కలిసి సుశాంత్‌ను ఏకాకి చేశారని, అతని మరణానికి బాలీవుడ్‌లోని నెపోటిజమే కారణమని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అంతే కాకుండాకొందరు సెలెబ్రిటీలు కూడా దీనిపై స్పందిస్తున్నారు. ఇప్పటికైన మారండని, ప్రతిభకు పట్టం కట్టాలని కోరుతున్నారు.

    Recommended Video

    Sushant Singh Rajput : Vivek Oberoi Emotional నన్ను కూడా సుశాంత్ లానే తొక్కేసారు ?
    ముగిసిన అంత్యక్రియలు..

    ముగిసిన అంత్యక్రియలు..

    ఆదివారం (జూన్ 14)ఆత్మహత్యకు పాల్పడిన సుశాంత్‌కు నిన్ని పోస్ట్ మార్టం నిర్వహించారు. చివరి చూపు కోసం కూపర్ హాస్పిటల్‌లోనే సుశాంతి పార్దివ దేహాన్ని ఉంచారు. అయితే సుశాంత్ మరణంపై స్పందించి, ట్వీట్లు వేసిన తారలు చివరి చూపు చూడటానికి మాత్రం రాలేదు. సోషల్ మీడియాలో స్పందించని వివేక్ ఒబేరాయ్, మాజీ ప్రేయసి కృతిసనన్, రియా చక్రవర్తి, స్నేహితుడు మహేష్ శెట్టి మాత్రమే వచ్చారు.

    ట్రెండింగ్‌లో వివేక్ ఒబేరాయ్..

    ట్రెండింగ్‌లో వివేక్ ఒబేరాయ్..

    సుశాంత్ చివరి యాత్రలో వివేక్ ఒబేరాయ్ పాల్గొంటారని తాము అనుకోలేదని నెటిజన్స్ ట్వీట్స్ చేశారు. రియల్ హీరో అనిపించుకున్నాడని పొగడ్తలు కురిపించారు. తనను కూగా గతంలో బాలీవుడ్ వెలివేసిందని, సల్మాన్ తన కెరీర్‌ని తొక్కేశాడని నెటిజన్ల వివేక్ ఒబేరాయ్ గురించి మాట్లాడుకున్నారు.

    ఎమోషనల్ పోస్ట్..

    ఎమోషనల్ పోస్ట్..

    సుశాంత్ అంత్యక్రియల్లో పాల్గొన్న వివేక్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ‘సుశాంత్ దహన సంస్కారాల్లో చూస్తుంటే హృదయం బద్దలైపోతోంది. నా వ్యక్తిగత అనుభవం, నాకు ఎదురైన పరిస్థితులను చెప్పి అతనికి ఉన్న బాధను తీర్చాలని అనుకున్నాను. నేను బాధలతోనే ప్రయాణం చేశాను. అది ఎంతో చీకటిగానూ, ఒంటరిగాను ఉంటుంది.

    ఆత్మహత్య పరిష్కారం కాదు..

    ఆత్మహత్య పరిష్కారం కాదు..

    కానీ చావు ఒక్కటే సమాధానం కాదు. ఆత్మ హత్య ఎప్పటికీ పరిష్కారం కాదు. ఆయన తన కుటుంబ సభ్యులు, మిత్రులు, మిలియన్ల కొద్ది ఉన్న అభిమానులను దు:ఖం గురించి ఆలోచించి ఉండడు. అతని కోసం ఎంతో మంది ఉన్నారని అనుకొని ఉండడు.

     ఆ బాధను వర్ణించలేను..

    ఆ బాధను వర్ణించలేను..

    ఈ రోజు చితికి మంటను పెడుతున్న ఆయన నాన్న చూస్తుంటే.. ఆ కళ్లలోని బాధను భరించలేకపోయాను. తిరిగి రా అంటూ అతని సోదరి ఏడుపులు.. మాటల్లో చెప్పడానికి వీల్లేని విషాదం. ఓకుటుంబంగా చెప్పుకుని సినీ ఇండస్ట్రీ.. లోతుగా పరిశీలించుకోవాల్సిన సమయమిది.. మనల్ని మనం మార్చుకోవాల్సిన తరుణం వచ్చింది.

    బిచ్చింగ్ తగ్గించాలి..

    బిచ్చింగ్ తగ్గించాలి..

    ఒకరి గురించి చెడుగా(బిచ్చింగ్) చెప్పడం తగ్గించి.. జాగ్రత్త చూసుకోవడం నేర్చుకోవాలి. పవర్ ప్లేను తక్కువ వాడుతూ.. గొప్ప మనసును చాటాలి. ఈగోను తగ్గించుకొని ప్రతిభకు సరైన స్థానాన్ని కల్పించాలి. ఈ కుటుంబం నిజంగా ఓ కుటుంబంలా మారాలి.

    ప్రతిభను తొక్కేయకూడదు..

    ప్రతిభను తొక్కేయకూడదు..


    ప్రతిభను వికసించేలా చేసే ఈ స్థలంలో తొక్కేయకూడదు. ప్రతిభకు ప్రశంసలు ఇచ్చే స్థలంలో మ్యానిపులేట్స్ చేయకూడదు. మనమంతా మేల్కోవాల్సిన సమయం ఇది. నిత్యం నవ్వుతూ ఉండే సుశాంత్‌ను మిస్ అవుతున్నాను. ఆయనకున్న బాధలన్నింటిని దూరం చేయాలని దేవున్ని కోరుతున్నాను. నీవు లేని లోటు భరించే శక్తిని కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నీ స్థాయికి తగ్గట్టు సరైన చోటే నువ్ ఉంటావని ఆశిస్తున్నాను.. అయితే మేము ఆ చోటుకు అర్హులు కాకపోవచ్చు' అని అందర్నీ కంటతడి పెట్టించాడు.

    English summary
    Vivek oberoi Emotional Post On Sushant Cremation And Bollywood. Vivek oberoi says that Being at Sushant’s cremation today was so heartbreaking. I truly wish I could have shared my personal experience and helped him ease his pain.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X