ఐశ్వర్యరాయ్, అనిల్ కపూర్ ‘ఫన్నే ఖాన్’ ట్రైలర్

By Bojja Kumar

బాలీవుడ్ స్టార్స్ అనిల్ కపూర్, ఐశ్వర్యరాయ్, రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న హిందీ చిత్రం 'ఫన్నే ఖాన్' ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. అతుల్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ద్వారా ట్రైలర్ షేర్ చేస్తూ... ట్రైలర్ తనకు ఎంతో నచ్చిందని పేర్కొన్నారు.

మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్లో అనిల్ కపూర్‌ను.... తన కూతురు కోసం మ్యూజిక్ ఆల్బం చేయాలని, పెద్ద పాప్ స్టార్‌ను చేయాలని ఆరాటపడే మధ్యతరగతి ఫ్యామిలీ మ్యాన్‌గా చూపించారు. మ్యూజిక్ ఆల్బం చేయాలంటే బారీగా డబ్బు అవసరం... ఆ డబ్బు కోసం పాప్ స్టార్ (ఐశ్వర్యరాయ్)ను రాజ్ కుమార్ రావ్ సహాయంతో కిడ్నాప్ చేస్తారు. ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి.

'ఫన్నేఖాన్‌.. అంటే చాలా అర్థాలున్నాయి. ఆర్టిస్టు, సింగర్‌, మ్యూజిషియన్‌ లేక పూర్తిగా ఇడియట్‌. కానీ వీళ్లంతా ఫన్ పంచేవారు. ఈ కథ ఒకే దానిపై.. దీని అర్థాన్ని పూర్తిగా మార్చిన ఓ వ్యక్తిది' అని గతంలో విడుదలైన టీజర్లో చెప్పుకొచ్చారు.

Watch: Anil Kapoor & Aishwarya Rai Bachchans Fanney Khan Trailer Out

ఈ చిత్రానికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. 1999లో 'తాల్‌' తర్వాత అనిల్ కపూర్, ఐశ్వర్యరాయ్ కలిసి నటిస్తున్న చిత్రం ఇది. ఆగస్టు 3న ఆ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బెల్జియం చిత్రం 'ఎవ్రీబడీస్‌ ఫేమస్‌'కు హిందీ రీమేక్‌ ఇది. 2001లో ఈ సినిమా ఉత్తమ విదేశీ చిత్రంగా అకాడమీ అవార్డుకు నామినేట్‌ అయ్యింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X