»   » ప్రియాంక చోప్రా-నిక్ జొనాస్ వివాహానికి ప్రధాని మోడీ?

ప్రియాంక చోప్రా-నిక్ జొనాస్ వివాహానికి ప్రధాని మోడీ?

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Priyanka Chopra and Nick Jonas Wedding Details : Modi will Be Special Guest For Event

  బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా త్వరలో అమెరికన్ సింగర్, నటుడు నిక్ జొనాస్‌ను పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్‌లో వీరి వివాహం వైభవంగా జరుగబోతోంది. డిసెంబర్ 2 హిందూ స్టైల్ వెడ్డింగ్, డిసెంబర్ 3న క్రిస్టియన్ స్టైల్ మ్యారేజ్ జరుగబోతోంది.

  అయితే ఈ వివాహ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఆహ్వానించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రియాంక చోప్రా-నిక్ జొనాస్ కలిసి స్వయంగా తమ పెళ్లి శుభలేఖను ప్రధానమంత్రికి అందించబోతున్నారని తెలుస్తోంది.

  మోడీ అపాయింట్మెంట్ తీసుకున్న ప్రియాంక

  మోడీ అపాయింట్మెంట్ తీసుకున్న ప్రియాంక

  ప్రధాని మోడీని కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్న ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నట్లు సమాచారం. నిక్ జొనాస్ ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత ఇద్దరూ కలిసి వెళతారట.

  వెల్ కం హోం బేబీ

  తనను పెళ్లాడేందుకు ఇండియా వస్తున్న నిక్ జొనాస్‌ను ఉద్దేశించి ప్రియాంక ట్విట్టర్లో ఆసక్తికర పోస్ట్ చేశారు. వెల్ కం హోం బేబీ అంటూ తనకు కాబోయే భర్తను సాధరంగా ఆహ్వానించింది.

  అమెరికా నుంచి బయల్దేరుతూ నిక్

  అమెరికా నుంచి ఇండియా బయల్దేరుతూ నిక్ తన సోషల్ మీడియా పేజీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్ నగరమా... మళ్లీ కలుస్తాను అంటూ పోస్ట్ పెట్టారు.

   అతికొద్ది మంది అతిథులు మాత్రమే

  అతికొద్ది మంది అతిథులు మాత్రమే

  జోధ్‌పూర్ ఉమైద్ భవన్‌లో జరిగే వివాహ వేడుకకు 200 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం అందిందట. అయితే పెళ్లి వేడుక తర్వాత ముంబైలో బాలీవుడ్ ప్రముఖుల కోసం గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నారు. అనంతరం లాస్‌ఏంజెలెస్‌లో హాలీవుడ్ ప్రముఖుల కోసం మరో వెడ్డింగ్ రిసెప్షన్ జరుగబోతోంది.

   రాల్ఫ్ లోరెన్ దుస్తుల్లో ప్రియాంక చోప్రా

  రాల్ఫ్ లోరెన్ దుస్తుల్లో ప్రియాంక చోప్రా

  హిందూ వివాహం జరిగే రోజు ప్రియాంక చోప్రా అబు జానీ-సందీప్ ఖోస్లా క్రియేషన్ దుస్తులు ధరించబోతోంది. క్రిస్టియన్ వెడ్డింగ్ రోజు రాల్ఫ్ లోరెన్ డిజైనర్ గౌనులో దర్శనమివ్వబోతోంది.

   ఐవరీ సూట్లో నిక్ జొనాస్

  ఐవరీ సూట్లో నిక్ జొనాస్

  క్రిస్టియన్ వెడ్డింగ్ రోజు వరుడు నిక్ జొనాస్ ఐవరీ సూట్లో దర్శనమివ్వబోతున్నాడు. ప్రియాంక రెడ్ కలర్ గౌనులో మెరవబోతోందని తెలుస్తోంది. పెళ్లి వేడుకలో ఇద్దరూ ది మోస్ట్ బ్యూటిఫుల్ జంటగా కనిపించబోతున్నారని టాక్.

  సంగీత్ వేడుకలో నిక్ జొనాస్ డాన్స్

  సంగీత్ వేడుకలో నిక్ జొనాస్ డాన్స్


  పెళ్లికి ముందు జరిగే సంగీత్ వేడుకలో నిక్ జొనాన్స్ సింగింగ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంతో పాటు పలు బాలీవుడ్ పాటలకు డాన్స్ చేయబోతున్నారట. కొరియోగ్రాఫర్ గణేష్ హెగ్డే ఆధ్వర్యంలో నిక్ జొనాస్ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు సమాచారం.

  English summary
  Priyanka Chopra and Nick Jonas are supposed to tie the nuptial knots following two rituals including Hindu and Christian. And now a buzz is making rounds that Nick and Priyanka might meet Prime Minister of India Narendra Modi to invite him for their wedding.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more