నటి నోటి దూల.. కులాల మీద అనుచిత వ్యాఖ్యలు..అట్రాసిటీ కేసు పెట్టిన పోలీసులు!

బాలీవుడ్ నటి, బిగ్ బాస్ తో మంచి ఫేం తెచ్చుకున్న యువికా చౌదరి తెలుగు వారికి పెద్దగా పరిచయం లేదు. కానీ హిందీ సినిమాలు చూసేవారికి ఆమె సుపరిచితురాలు. పలు సినిమాలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. అంతేకాకుండా బుల్లితెరలో కూడా ఎన్నో షోలలో పాల్గొని మంచి క్రేజ్ అందుకుంది. తాజాగా ఈ బ్యూటీ నోటి దూల ఇప్పుడు చిక్కుల్లో చిక్కుకునేలా చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

ఆ వీడియోలో

ఆ వీడియోలో

బిగ్ బాస్ 9 ఫేమ్, నటుడు యువికా చౌదరి పై హర్యానా పోలీసులు కేసు నమోదు చేశారు. కొన్ని రోజుల క్రితం ఒక వీడియోలో ఆమె చేసిన కొన్ని కామెంట్స్ కు గాను ఆమె మీద కేసు నమోదు చేశారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అట్రాసిటీ చట్టం కింద హన్సీ నగర పోలీస్ స్టేషన్‌లో యువికా చౌదరిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. రజత్ కల్సన్ అనే దళిత హక్కుల కార్యకర్త ఫిర్యాదు చేసిన తరువాత ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున

సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున

యువికా చౌదరి ఒక వీడియోలో కులాలని కించపరుస్తూ వ్యాఖ్యానించిన నేపధ్యంలో #ArrestYuvikaChaudhary అనే ట్యాగ్ అప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. వైరల్ అయిన ఒక వీడియోలో, యువికా తన ప్రదర్శన గురించి మాట్లాడుతుండగా కనిపించింది, ఆమె తన భర్త ప్రిన్స్ తో మాట్లాడుతున్నారు. "నేను వ్లాగ్స్ షూట్ చేస్తున్నప్పుడు నేను ఎప్పుడూ భంగిలాగా ఎందుకు దుస్తులు ధరించాలి?" ఆమె ప్రశ్నించింది.

ఆ పదం వాడడంతో

ఆ పదం వాడడంతో

నిజానికి భంగి అనే పదం 19వ శతాబ్దంలో ఉన్నత కులాల వారు ఉపయోగించేవారు., పారిశుధ్యం మరియు మాన్యువల్ స్కావెంజింగ్‌ పనిచేసే దళిత కులాలని అలా పిలిచేవారు. ఇక ఈ కామెంట్స్ గురించి పెద్ద రచ్చ జరగడంతో యువికా క్షమాపణ కూడా చెప్పింది. యువికా చౌదరి మరియు ఆమె భర్త ప్రిన్స్ నరులా ఇటీవల వ్లాగ్‌లో ఈ పదాన్ని ఉపయోగించినందుకు క్షమించమని కోరుతూ వీడియోలను పంచుకున్నారు.

Recommended Video

Ichata Vahanamulu Nilupa Radu Teaser
నాకు అర్థం తెలీదు

నాకు అర్థం తెలీదు

మేము ఎటువంటి వివక్ష చూపించే ఉద్దేశంతో ఇలా మాట్లాడలేదని పదానికి అసలు అర్థం తెలియదని వారు చెప్పారు. "నేను మీకు క్షమాపణలు కోరుతున్నాను. నేను తెలియకుండానే ఈ పదాన్ని ఉపయోగించాను మరియు దాని అర్థం నాకు తెలియదు, తెలియకుండానే జరిగిన పొరపాటును దయచేసి క్షమించండి "అని ఆమె వీడియో రిలీజ్ చేసింది. అయితే అప్పటికే జరగాల్సిన రచ్చ జరిగిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X