twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డౌన్: ‘1 నేనొక్కడినే’ యూఎస్ ప్రీమియర్ షో కలెక్షన్స్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మహేష్ బాబు తాజా సినిమా '1 నేనొక్కడినే' చిత్రం యూఎస్ ప్రీమియర్ షోలో అనుకున్న రేంజిలో కలెక్షన్లు సాధించలేదు. ప్రిమియర్ షోలో ఈచిత్రం రికార్డులన్నీ బద్దలు కొడుతూ అత్యధిక కలెక్షన్లు సాధిస్తుందని అంతా భావించారు. కానీ కలెక్షన్లు టాప్ రేంజిని అందుకోలేక పోయాయి.

    ఇంతకు ముందు విడుదలైన పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' చిత్రం 65 లొకేషన్లలో ప్రీమియర్ షో ప్రదర్శితం అయి....$345,359 వసూలు చేసింది. ఇప్పటి వరకు ఇదే రికార్డు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'బాద్ షా' చిత్రం 76 లొకేషన్లలో ప్రీమియర్ షో ప్రదర్శితం అయి... $234,686 రాబట్టి రెండో స్థానంలో ఉంది.

    ఇక మహేష్ బాబు తాజా సినిమా '1 నేనొక్కడినే' చిత్రం 73 లొకేషన్లలో ప్రీమియర్ షో ప్రదర్శితం అయి $226,278 వసూలు చేసి మూడో స్థానాన్ని మాత్రమే దక్కించుకుంది. ప్రీమియర్ షో టికెట్ ప్రైస్ కూడా భారీగా ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

    సాధారణంగా....ఎన్ఆర్‌ఐ ప్రేక్షకులు క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. '1 నేనొక్కడినే' చిత్రం విడుదల ముందు నుంచి సైకలాజికల్ థ్రిల్లర్ అనే ఫీలింగ్ కలిగించడం, ఇది ఫ్యామిలీ మూవీ కాక పోవడంతో యూఎస్‌లో ప్రీమియర్ షోలో అనుకున్న రేంజిలో కలెక్షన్లు సాధించ లేక పోయిందని స్పష్టమవుతోంది.

    మరో వైపు తొలి రోజు సినిమాకు అనుకున్న రేంజిలో హిట్ టాక్ రాలేదు. సినిమాలో చాలా బోరింగ్ సన్నివేశాలు ఉన్నాయని పలువురు సినీ గోయర్స్ విమర్శించడంతో....వెంటనే నిర్మాతలు నివారణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సినిమాలోని బోరింగ్ సన్నివేశాలు తొలగించి 20 నిమిషాల నిడివి తగ్గించారు.

    ఈ విషయాన్ని చిత్ర నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర స్వయంగా వెల్లడించారు. ట్రిమ్ చేసిన వెర్షన్ రేపటి నుంచి ప్రదర్శితం అవుతుందని ఆయన తెలిపారు. మరి ట్రిమ్ చేసిన వెర్షన్ ప్రేక్షకులను ఏ మేరకు సంతృప్తి పరుస్తుందో చూడాలి. ఏది ఏమైనా నిర్మాతల ప్రయత్నం, తాపత్రయం చూస్తుంటే ప్రేక్షకులను సంతృప్తి పరచడమే వారి లక్ష్యంగా కనిపిస్తోంది.

    టెక్నికల్‌గా సినిమా హాలీవుడ్ సినిమాల స్ధాయిలో హై స్టాండర్డ్స్‌లో ఉండాలని సుకుమార్ ఫిక్సై తీసాడని మొదటి ఫ్రేమ్ నుంచే అర్దమవుతుంది. అయితే ఈచిత్రం తెలుగు ప్రేక్షకుల టేస్టుకు తగిన విధంగా లేదనేది మరికొందరి వాదన. అయితే టెక్నికల్ వ్యాల్యూస్ తెలిసిన వారు మాత్రం....ఇది ప్యూర్ టెక్నికల్ ఫిల్మ్, మూస తెలుగు సినిమాల్లా కాకుండా డిపరెంట్ జానర్లో దర్శకుడు తెరకెక్కించాడు. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని రేంజిలో ఉందని అంటున్నారు.

    ఇక సినిమా వివరాల్లోకి వెళితే..... సకుమార్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో క్రితి సానన్ హీరోయిన్‌గా నటించింది. మహేష్ తనయుడు గౌతం కృష్ణ ఈ చిత్రంతో బాల నటుడిగా తెరంగ్రేటం చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకరలు ఈచిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈరోస్ ఇంటర్నేషనల్ అనే బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ కూడా ఈచిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంది.

    English summary
    
 The USA Premier show records were on the name of Pawan Kalyan’s Attarintiki Daredi with $345,359 from 65 locations followed by NTR’s Baadshah with $234,686 from 76 locs and Mahesh’s 1Nenokkadine has to settle in third place as it has managed to collect only $226,278 $ from 73 locations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X