twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    10 Years For Bussinessman: అత్యంత వేగంగా పూర్తయిన మూవీ.. క్లోజింగ్ కలెక్షన్స్ ఎంతంటే?

    |

    పోకిరి లాంటి బాక్సాఫీస్ హిట్ అనంతరం డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో వచ్చిన చిత్రం బిజినెస్ మ్యాన్. అప్పటి వరకు ఒక పెద్ద సినిమా అంటే కనీసం 8 నెలల సమయం పడుతుంది అని అనుకుంటున్న తరుణంలో కేవలం రెండున్నర నెలలో బిజినెస్ మెన్ సినిమాను పూర్తి చేసి దర్శకుడు పూరి విడుదలకు సిద్ధం చేశాడు. ఇక ఆ సినిమా 2012 సంక్రాంతి 1న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక బిజినెస్ మెన్ ప్రేక్షకుల ముందుకు వచ్చి సరిగ్గా 10 ఏళ్ల అవుతోంది. ఇక సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..

    74రోజుల్లోనే ఫినిష్..

    74రోజుల్లోనే ఫినిష్..

    డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎలాంటి సినిమా చేసినా కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనికుంటాడు. హీరో సహకరిస్తే అత్యంత వేగంగా షూట్ ను ఫినిష్ చేసే అతికొద్ది మంది దర్శకులతో ఆయన టాప్ లిస్టులో ఉంటారని చెప్పవచ్చు. ఇక బిజినెస్ మెన్ సినిమాను 74రోజుల్లోనే ఫినిష్ చేసి విడుదలకు సిద్ధం చేశారు.

    సాలీడ్ కలెక్షన్స్..

    సాలీడ్ కలెక్షన్స్..

    2013 జనవరి 13న విడుదలైన బిజినెస్ మెన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నైజాంలో 12.5కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా సీడెడ్ లో 6.1 కోట్లను అందుకుంది. ఉత్తరాంధ్ర 3.85కోట్లు, గుంటూరులో 3.9 కోట్లు, ఈస్ట్ లో 3.1 కోట్లు, వెస్ట్ లో 2.3కోట్లు, కృష్ణ లో 2.25కోట్లు, నెల్లూరులో 1.37కోట్ల షేర్ ను రాబట్టింది.

    వరల్డ్ వైడ్ కలెక్షన్స్..

    వరల్డ్ వైడ్ కలెక్షన్స్..

    ఏపీ తెలంగాణలో టోటల్ గా 35.37 కోట్ల షేర్ రాగా 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. రెస్ట్ ఆఫ్ వరల్డ్ కలెక్షన్స్ 8.85 కోట్లు రాగా ప్రపంచవ్యాప్తంగా 41.22కోట్లను అందుకొని మహేష్ కెరీర్ లో అప్పట్లో సరికొత్త రికార్డులను బ్రేక్ చేసింది. ఒక విధంగా మహేష్ బాబు కూడా ఈ సినిమాను చాలా వేగంగా ఫినిష్ చేశాడు. సినిమాకు వర్క్ చేసిన ప్రతీ ఒక్కరు చాలా పాజిటివ్ గా ఎనర్జిటిక్ గా వర్క్ చేసినట్లు మహేష్ చెప్పాడు.

    11 రోజుల్లోనే..

    11 రోజుల్లోనే..

    ఈ సినిమాను 75 రోజుల్లో అనుకున్న సమయానికి పూర్తి చేశారు. సినిమాను ముంబై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఇక సినిమాకి మ్యూజిక్ అందించిన థమన్ కూడా తన సినీ జీవితంలోనే అత్యధిక వేగంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను ఫినిష్ చేశాడట. కేవలం 11 రోజుల్లోనే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను ఫినిష్ చేసినట్లుగా చెప్పారు.

    Recommended Video

    Krithi Shetty Speech | Aa Ammayi Gurinchi Meeku Cheppali | Filmibeat Telugu
    నా జీవితంలో ఫాస్టెస్ట్ మూవీ..

    నా జీవితంలో ఫాస్టెస్ట్ మూవీ..

    ఇక సినిమా వచ్చి దశాబ్దం కావడంతో సంగీత దర్శకుడు థమన్ సోషల్ మీడియా ద్వారా ఒక వివరణ ఇచ్చారు. నా జీవితంలో అత్యధిక వేగంగా పుర్తి చేసిన సినిమా ఇదే. ఇదొక 100 మిటర్ రన్ లాంటిది. వ్వాటే మూవీ. బిజినెస్ మెన్ ఇప్పటికి యంగ్ గానే ఉంటాడు. మహేష్ బాబుగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇక పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు 5 స్టార్స్ అంటూ.. బిజినెస్ మ్యాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ 11 రోజుల్లోనే ఫినిష్ చేసినట్లుగా థమన్ వివరణ ఇచ్చారు.

    English summary
    10 Years For Bussinessman total worldwide closing collections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X