For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాజమౌళి చిత్రం రైట్స్ తీసుకున్న 'దూకుడు' నిర్మాతలు

  By Srikanya
  |

  హైదరాబాద్ : సాయిశివానీ సమర్పణలో వారాహి చలనచిత్రం పతాకంపై హనురాఘవపూడి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 'అందాల రాక్షసి'. దర్శకుడు ఎస్.ఎస్.రాజవౌళి ఈ చిత్రం ద్వారా నిర్మాతగా మారనున్నారు. మరో నిర్మాతగా సాయి కొర్రపాటి వ్యవహరిస్తున్నారు.ఈ చిత్రం ఓవర్ సీస్ (యుస్)రైట్స్ ని 'దూకుడు'నిర్మాతలు తీసుకున్నారు. ఫికాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఓవర్ సీస్ లో రిలీజ్ చేస్తారు.

  నవీన్‌చంద్ర రాహుల్, లావణ్య జంటగా నటిస్తున్న ఈ చిత్రం గురించి ఎస్.ఎస్.రాజవౌళి మాట్లాడుతూ చిత్రంపై నమ్మకంతోనే తాను నిర్మాతగా మారానని, నిర్మాతగా మారడానికి దర్శకుడు హను రాఘవపూడి కూడా ఓ కారణమని, నిర్మాతపై నమ్మకంతోనే తానీ చిత్రానికి కొంత షేర్ కలిశానని తెలిపారు. దర్శకుడు హను మాట్లాడుతూ ఓ అందమైన ప్రేమకథగా ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని, నిజమైన ప్రేయసే అందాల రాక్షసిగా మారుతుందన్న మాటను సెటైరికల్‌గా ఈ చిత్రంలో చూపామని తెలిపారు.

  అలాగే ఎవరి అనుమతీ అవసరం లేదన్నట్టుగా... ఉదయం వాకిలి తీయగానే ఇంట్లోకి చొరబడతాడు సూర్యుడు. వెలుగుని పంచుతాడు. అచ్చం అలాంటి మనస్తత్వమే ఉన్న యువకుడు సూర్య. నలుగురికి సంతోషాన్ని పంచిపెట్టడంలోనే తన ఆనందాన్ని వెదుక్కొంటాడు. అందరూ వృథా అన్న వస్తువుకు కూడా ప్రాణం పోస్తాడు. అలాంటి యువకుడి జీవితంలోకి ఓ అందాల భామ వస్తుంది. మరి ఆ అమ్మాయిని రాక్షసి అని ఎందుకన్నాడో తెరమీదే చూడాలి. సినిమా ప్రారంభమైన రోజు నుంచి అత్యంత శ్రద్ధతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. అందరూ చాలా నేచురల్‌గా నటించారు. నా నమ్మకమే నాకు శక్తినిచ్చింది. రాజమౌళిగారు, దిల్‌రాజుగారు ఈ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. అందాల రాక్షసి హిట్టవుతుందన్న నమ్మకం ఉంది అన్నారు.

  ఈ సినిమా పంపిణీ చేస్తున్న దిల్‌రాజు మాట్లాడుతూ ''చాలా రోజుల తర్వాత ఒక కొత్త తరహా సినిమాని చూసిన అనుభూతి కలిగింది. దర్శకుడు చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ కొత్తవారైనా హనుమంతు చక్కగా చిత్రీకరించాడు. అన్ని పనులు పూర్తయ్యాయి. ఈ నెల 10న ఈ చిత్రం విడుదలవుతోంది. విజయం సాధించాలని కోరుకుంటున్నా''అన్నారు. ''నేను పోషించిన సూర్య అనే పాత్ర కోసం యేడాది పాటు కష్టపడ్డాను. ఇప్పటికీ ఆ పాత్రలోనే జీవిస్తున్నాన''న్నారు నవీన్‌చంద్ర. మంచి పాత్రల్లో, ఎంతో కష్టపడి చేశామని రాహుల్, లావణ్య అన్నారు. తాజాగా ఈచిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేశారు.ఈ చిత్రం ట్రైలర్స్‌కు, ఆడియోకు మంచి స్పందన వస్తోంది. దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జి.మురళి, సంగీతం: రధన్‌

  English summary
  
 14 Reels Entertainment has bought the overseas (US) rights of Andhala Rakshasi and will be releasing the movie through Ficus. Andala Rakshasi is a triangle love story which is set in the 90′s back drop and shot very aesthetically. The film is slated for August 10 and the overseas screening locations (release schedules) of the film will be released shortly.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X