Don't Miss!
- News
ఘనంగా మొదలైన మేడారం మినీ జాతర.. నాలుగురోజుల పాటు సాగే వన సంబరం!!
- Finance
Jio laptop: మార్కెట్లోకి Jio ల్యాప్ ట్యాప్.. ఫీచర్లు, ధర చూస్తే వావ్ అనాల్సిందే !!
- Sports
INDvsNZ : మూడో టీ20లో ఈ రికార్డులు బద్దలవడం ఖాయం.. సూర్య సాధిస్తాడా?
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
2.0 ఫస్ట్ డే కలెక్షన్లు.. తొలిరోజే 100 కోట్లు, బాహుబలిని అధిగమించిన చిట్టి!
Recommended Video

ఇండియన్ సూపర్‌స్టార్స్ రజనీకాంత్, అక్షయ్ కుమార్ కాంబినేషన్‌లో దర్శకుడు శంకర్ రూపొందించిన 2.0 చిత్రానికి భారీ స్పందన లభిస్తున్నది. తొలి రోజు దేశవ్యాప్తంగా టికెట్ కౌంటర్లు కిక్కిరిసిపోయి కనిపించాయి. రిలీజైన ప్రతీ చోట 95 శాతానికి పైగా అక్యుపెన్సీ ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. శంకర్ విజన్, ఆలోచనకు ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మ్యాజిక్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తొలి రోజు సాధించే లెక్క ఎంతంటే..

ప్రపంచవ్యాప్తంగా 2.0 చిత్రం
2.0 చిత్రం ప్రపంచవ్యాప్తంగా 10500 స్క్రీన్లలో విడుదలైంది. ఉత్తర అమెరికాలో 850 స్క్రీన్లలో, యూకేలో 300, యూరప్‌లో 500, యూఏఈలో 350, దక్షిణాసియాలో 100, ఇండియాలో 7500, ఇతర ప్రాంతాల్లో 900 స్క్రీన్లలో రిలీజ్ అయింది. మొదటి రోజు 35 వేల షోలు ప్రదర్శించే అవకాశం ఉంది. రిలీజైన ప్రతీ చోట మంచి రెస్పాన్స్ లభిస్తున్నది.

బాహుబలిని అధిగమించిన చిట్టి
2.0 చిత్రం బాహుబలి2 స్క్రీన్లను అధిగమించి కొత్త రికార్డును సొంతం చేసుకొన్నది. బాహుబలి చిత్రం ప్రపంచవ్యాప్తంగా 9000 స్క్రీన్లలో రిలీజై ప్రభంజనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా పలురికార్డులను తిరగరాసింది. ప్రస్తుతం 2.0 చిత్రం కూడా భారీగానే రిలీజైంది. రెండు రోజులు ఆగితే ఈ సినిమా సత్తా ఎంత అనేది తేలుతుంది.
2.O మూవీ రివ్యూ అండ్ రేటింగ్: గ్రాఫిక్స్‌తో ఇంద్రజాలం
|
తొలిరోజు రూ. 100 కోట్లు
అక్షయ్ ప్రత్యేక పాత్రలో నటించిన 2.0 చిత్రం ఉత్తరాదిలో హిందీ వెర్షన్ భారీ మొత్తంలో రిలీజైంది. ఈ చిత్రం హిందీలోనే రూ.25 కోట్లకుపైగా వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ఇక తెలుగు, తమిళం, ఇతర భాషల్లో కలిపితే దాదాపు రూ.100 కోట్లకుపైగానే కలెక్షన్లు సాధిస్తుందనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.

లాంగ్ వీకెండ్ కారణంగా
2.O చిత్రానికి సుదీర్ఘమైన వారాంతం ఉండటం కలిసి వచ్చే అంశంగా ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దాంతో భారీగా కలెక్షన్లు సాధించే ఛాన్స్ ఉంది. బాహుబలి2, కబాలి, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రాలకు సంబంధించిన రికార్డులను అధిగమించే అవకాశముందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.