»   » అనుష్క సినిమాకి 2 కోట్ల టేబుల్ ప్రాఫిట్

అనుష్క సినిమాకి 2 కోట్ల టేబుల్ ప్రాఫిట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ మధ్య కాలంలో ఏ చిన్న చిత్రానికి రానంత క్రేజ్ అనుష్క తాజా చిత్రం పంచాక్షరి కి వచ్చింది. దాంతో ఈ చిత్రాన్ని రెండు కోట్ల టేబుల్ ప్రాఫిట్ కు అమ్మినట్లు సమాచారం. అరుంధరి చిత్రంలా ప్రోమోలు వేసి, అదే లైన్ లో స్టోరీ ఉందని చెప్పటంతో ఈ క్రేజ్ వచ్చిందని తెలుస్తోంది. అలాగే బయ్యర్లుకు కూడా చాలా రీజన్ బుల్ రేట్లుకు ఇవ్వటంతో వెంటనే మార్కెట్ అయిపోయింది. జూన్ నాలుగవ తేదీన రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని దర్శకుడు సముద్ర రూపొందించారు. నాగార్జున పర్శనల్ మేకప్ మ్యాన్ చంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు. అలాగే నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో అనుష్క ద్విపాత్రాభినయం చేసింది. ఈ విషయమై అనుష్క మాట్లాడుతూ..హీరోయిన్ గా నాకు తొలి మేకప్ వేసినప్పుడు మేకప్ మాన్ చంద్ర 'నేను నిర్మాతగా తీసే మొదటి సినిమాలో నటిస్తావా? అనడిగారు. ఆయన సినిమా తీసేటప్పటికి నేనెక్కడుంటానో? అసలు సినిమా రంగంలో ఉంటానా? లేదా? అనుకున్నాను. అయినప్పటికీ చంద్రకి మాటిచ్చాను. 'అరుంధతి" తో ఫేం రావడంతో ఈ సినిమాని చేయండం లేదు. ఈ సినిమాకి 'అరుంధతి"కీ ఎటువంటి సంబంధం లేదు. బొమ్మి (చంద్ర) ఎంతో ప్యాషన్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అద్బుతమైన కథతో 'పంచాక్షరి" చిత్రం రూపొందుతోంది అన్నారు అనుష్క.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu