»   » 2010 తెలుగు సినిమా...ఏవి హిట్స్ ? ఏవి ప్లాఫ్స్?

2010 తెలుగు సినిమా...ఏవి హిట్స్ ? ఏవి ప్లాఫ్స్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

2010 సంవత్సరం తెలుగులో స్ట్రైయిట్ గా 114 సినిమాలు విడుదల అయితే అందులో కేవలం ఎనిమిది మాత్రమే డబ్బులు వెనక్కి తీసుకువచ్చాయి. మిగిలిన 106 ప్లాప్ లుగా మిగిలి కొనుక్కున్న వారికి నష్టాలు మిగిల్చాయి. సూపర్ డూపర్ హిట్ సినిమాగా బాలకృష్ణ సింహా నిలిస్తే, ఆ తర్వాత ప్లేస్ లో మర్యాద రామన్న మంచి విజయం సాధించింది. ఇక డార్లింగ్, బృందావనం, ఏమి మాయ చేసావే, బెట్టింగ్ బంగార్రాజు, అదుర్స్, వేదం చిత్రాలు మంచి రాబడినే సంపాదించాయి. బిందాస్ వంటి కొన్ని చిత్రాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నా ఎవరికీ లాభాన్ని మిగల్చలేక పోయాయి.

కేవలం ఏడు శాతం మాత్రమే విజయం సాధించింది. ఇక ఈ ఫ్లాపుల్లో ఖలేజా, పులి,ఆరెంజ్ రికార్డు గా నిలిచాయి. అలాగే ఎక్కువ నష్టపోయిన నిర్మాత శింగనమల రమేష్. ఇక డబ్బింగ్ చిత్రాల్లో టాప్ ప్లేస్ లు నిలబడి కలెక్షన్స్ కురిపించిన చిత్రం రోబో. ఆ తర్వాత రక్త చరిత్ర-1, యుగానికి ఒక్కడు(కార్తీ),యముడు(సూర్య),ఆవారా(కార్తీ) చిత్రాలు కూడా కమర్షియల్ గా విజయవంతమయ్యాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X