»   »  2013 టాలీవుడ్: USA లో కలెక్షన్స్ టాప్ 10

2013 టాలీవుడ్: USA లో కలెక్షన్స్ టాప్ 10

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : తెలుగు సినిమాకు మంచి మార్కెట్ USA . అక్కడ కలెక్షన్స్ ని కూడా బిజినెస్ విషయాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. అందులోనూ ఎన్నారై మార్కెట్ విపరీతంగా పెరిగిన నేపధ్యంలో అక్కడ వారిని దృష్టిలో పెట్టుకుని మరీ కథలు అల్లటం, వారు మెచ్చే అంశాలు కలపటం కూడా జరుగుతోంది. అంచనాల్ని మించిన విజయం అంటే ఎలా ఉంటుందో ఈ ఏడాది 'అత్తారింటికి దారేది' నిరూపించింది. సాధారణంగా పవన్‌ కల్యాణ్‌ సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ఇక త్రివిక్రమ్‌ కూడా జతకలవడంతో అందరి కళ్లూ ఈ సినిమావైపే వెళ్లాయి. సినిమా విడుదలకు ముందే సగం సినిమా పైరసీ ద్వారా బయటకు రావడం చిత్రబృందానికి షాక్‌నిచ్చింది. చిత్రానికి పెట్టిన పెట్టుబడైనా తిరిగొస్తుందో రాదో అనుకున్నారు. పవన్‌ కల్యాణ్‌ ప్రభంజనంతో ఆ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ చిత్రం తర్వాత మరే పెద్ద సినిమాలు విజయాల్ని సాధించలేకపోయాయి.

  వాస్తవానికి ''స్టార్లు లేకపోయినా ఫర్లేదు... కథలో దమ్ముంటే చాలు'' - ఇలాంటి స్టేట్‌మెంట్లు దాదాపు ప్రతీ సినిమా వేదికపైనా వింటూనే ఉన్నాం. అది నిజమే కావచ్చు. కథలో దమ్ముంటే ఇంకేం అక్కర్లెద్దు. కానీ స్టార్లను తక్కువ అంచనా వేయకూడదు. ఓమాదిరి సినిమా అయినా సరే - సూపర్‌ హిట్‌గా మార్చేసత్తా వారికి ఉంది. ''వేసవి వరకు పరిశ్రమ సాధించిన ఫలితాలు ఆశాజనకంగా కనిపించాయి. దీంతో చాలా మంది నిర్మాతలు సినిమాలు తీయడానికి ముందుకొచ్చారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఈ సారి 174 చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయంటే కారణం అదే'' అన్నారు ఓ ప్రముఖ నిర్మాత.

  సంక్రాతి పండుగనాడు ముగ్గురు స్టార్ హీరోలు వినోదాలు పంచారు. రామ్‌చరణ్‌ 'నాయక్‌'గా వచ్చి అలరిస్తే, మహేష్‌బాబు-వెంకటేష్‌ లు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నీడన అనుబంధాల్ని చూపించారు. 'నాయక్‌' మాస్‌ని బాగా ఆకట్టుకొంది. రెండు పాత్రల్లో చరణ్‌ నటన, ఆయన వేసిన స్టెప్పులు, పోరాట దృశ్యాలు అలరించాయి. ఇక కుటుంబ బంధాలకు పెద్దపీట వేస్తూ నిర్మించిన 'సీతమ్మ వాకిట్లో...' పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. మల్టీస్టారర్‌ చిత్రాలకు 'సీతమ్మ...' బూస్టప్‌ ఇచ్చినట్త్టెంది. అయితే ఎన్నారై మార్కెట్ దగ్గరకి వచ్చేసరికి సంవత్సరం చివరి లో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రం టాప్ ప్లేస్ లో నిలిచింది. మరో మెగా హీరో అల్లు శిరీష్ నటించిన గౌరవం చిత్రం అతి తక్కువ వసూలు చేసిన చిత్రంగా మిగిలిపోయింది.

  గమనిక: ఈ వివరాలు కేవలం ట్రేడ్ లో చెప్పుకోబడుతున్న లెక్కలు మాత్రమే. ఇవే ఖచ్చితమని చెప్పలేము. కానీ చాలా భాగం కరెక్టుగా ఉండే అవకాసం ఉంది. ఇవి అథికారికంగా వెల్లడించిన లెక్కలు మాత్రం కావు.

  USA భాక్సాఫీస్... స్లేడ్ షో లో...

  అత్తారింటికి దారేది

  అత్తారింటికి దారేది

  పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రం USA భాక్సాఫీస్ వద్ద - $1900 K కలెక్టు చేసి రికార్డులు క్రియేట్ చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరో ఎన్నారై కావటం విశేషం. ఈ యేడాది అందరి కళ్లూ 'అత్తారింటికి దారేది'పైనే. సంక్షోభ పరిస్థితిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయినా సరే... అంచనాలకు మించిన విజయం అందుకొంది. రికార్డు వసూళ్లతో బాక్సాఫీసు తడిసిముద్దయ్యింది. పవన్‌ మేనరిజం, త్రివిక్రమ్‌ పంచ్‌ డైలాగులు, దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం ఇవన్నీ ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయి. 'వంద కోట్ల' ఆశలు చిగురింపజేసిన తొలి తెలుగు చిత్రం ఇదే. ద్వితీయార్థంలో తెలుగు చిత్రసీమకు విజయంతో కాపు కాసిన చిత్రమూ ఇదే. 'అత్తారింటికి..' తరవాత అగ్ర కథానాయకుల సినిమాలేం రాలేదనే చెప్పాలి.

  'సీతమ్మ వాకిట్లో...'

  'సీతమ్మ వాకిట్లో...'

  కుటుంబ బంధాలకు పెద్దపీట వేస్తూ నిర్మించిన 'సీతమ్మ వాకిట్లో...' పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. మల్టీస్టారర్‌ చిత్రాలకు 'సీతమ్మ...' బూస్టప్‌ ఇచ్చినట్త్టెంది. మహేష్‌బాబు-వెంకటేష్‌ లు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నీడన అనుబంధాల్ని చూపించారు. ఈ చిత్రం $1635 K కలెక్ట్ చేసింది.

  'బాద్‌షా'

  'బాద్‌షా'  వేసవిలో వచ్చిన 'బాద్‌షా' భారీ విజయాన్ని దక్కించుకోకపోయినా... అభిమానుల్ని మాత్రం అలరించింది. 'దమ్ము' తరవాత వూరటనిచ్చిన సినిమా ఇది. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ మూడు కోణాల్లో ఉండే పాత్రను పోషించారు. ఈ చిత్రం $1350 K వసూలు చేసింది.

  'మిర్చి'

  'మిర్చి'

  'మిర్చి' తో ప్రభాస్ అదరగొట్టారు. 'ప్రేమిస్తే పోయేదేముంది డ్యూడ్‌..' లాంటి సంభాషణలు పలికించి ప్రభాస్‌కి కొత్తకోణంలో చూపించారు దర్శకుడు కొరటాల శివ. బాక్సాఫీసు దగ్గర ఈ చిత్రం మంచి వసూళ్లు దక్కించుకొంది. ఈ చిత్రం - $679 K వసూలు చేసింది.

  'నాయక్‌'

  'నాయక్‌'


  సంక్రాతి పండుగనాడు రామ్‌చరణ్‌ 'నాయక్‌'గా వచ్చి అలరించారు. 'నాయక్‌' మాస్‌ని బాగా ఆకట్టుకొంది. రెండు పాత్రల్లో చరణ్‌ నటన, ఆయన వేసిన స్టెప్పులు, పోరాట దృశ్యాలు అలరించాయి. ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద - $494 K వసూలు చేసింది.

  'బలుపు'

  'బలుపు'


  వరుస పరజయాల భారాన్ని 'బలుపు'తో దించుకొన్నారు రవితేజ. ఈ సినిమా మాస్‌ని బాగా ఆకట్టుకొంది. రవితేజ పలికిన సంభాషణలు, తీర్చిదిద్దిన యాక్షన్‌ ఘట్టాలూ... ఈ చిత్రానికి విజయాన్ని తెచ్చిపెట్టాయి. ఈ చిత్రం - $443 K వసూలు చేసింది.

  రామయ్యా వస్తావయ్యా

  రామయ్యా వస్తావయ్యా


  ఎన్టీఆర్ హీరోగా వచ్చిన రామయ్యా వస్తావయ్యా...అంచనాలను అందుకోలేక చతికిల పడింది. సినిమా మరీ రొటీన్ గా ఉండటం మైనస్ గా మారింది. హరీష్ శంకర్ పంచ్ డైలాగులు, ఎన్టీఆర్ నట విన్యాసాలు సైతం సినిమాను కాపాడలేకపోయాయి. ఈ చిత్రం - $370 K వసూలు చేసింది.

  'గుండెజారి గల్లంతయ్యిందే'

  'గుండెజారి గల్లంతయ్యిందే'


  నితిన్ ని మళ్లీ ఫామ్ లోకి తీసుకువచ్చిన ఇష్క్ తర్వాత వచ్చిన చిత్రం , 'గుండెజారి గల్లంతయ్యిందే'. నిత్యా మీనన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం బడ్జెట్ ని మించి ఊహించని విధంగా భారీ కలెక్షన్స్ నే సాధించింది. ఈ చిత్రం - $360 K వసూలు చేసింది.

  'ఇద్దరమ్మాయిలతో'

  'ఇద్దరమ్మాయిలతో'


  అల్లు అర్జున్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం ఫ్లాఫ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా ఓకే అనిపించుకుంది. ఈ చిత్రం - $340 K వసూలు చేసింది.

  'ప్రేమకథా చిత్రమ్‌'

  'ప్రేమకథా చిత్రమ్‌'


  సుధీర్ బాబు హీరోగా,మారుతి నిర్మాతగా వచ్చిన ఈ చిత్రం ఊహించని విజయం సాధించింది. అతి తక్కువ బడ్జెట్ లో తయారైన ఈ చిత్రం మంచి విజయం సాధించి చిన్న సినిమాలు ఊపు తెచ్చింది. ఈ చిత్రం - $85 K కలెక్షన్స్ సాధించింది.

  English summary
  Tollywood's USA box- office this year witnessed some surprising trends. While Power Star Pawan Kalyan's ‘Attarintiki Daaredhi’ showed the power of Tollywood raking in huge collections amounting to $1.90 Million (all time record),Hero from Mega compound Allu Sirish who debuted with ‘Gauravam’ had the ignonimity of lowest collections of $85. Not even 10 members have seen ‘Gauravam’ film in USA!!!!!Top ten chart busters in USA are as follows.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more