»   » 2016 బిగ్గెస్ట్‌ డిజాస్టర్స్‌..! వాటిని చూసి సిగ్గుపడాలి.. లిస్ట్

2016 బిగ్గెస్ట్‌ డిజాస్టర్స్‌..! వాటిని చూసి సిగ్గుపడాలి.. లిస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 2016 సంవత్సరం అప్పుడే హాఫ్ ఇయిర్ దాటి రెండో అర్దం జరిగిపోతోంది. ఈ నేపధ్యంలో తెలుగులో వచ్చిన సినిమాల్లో హిట్స్ ఇంతకు ముందు చూసాం. అయితే ఈ సంవత్సరం బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాలు వచ్చాయి.

సంవత్సరం ప్రారంభం హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలతో ఉత్సాహం తెస్తే తర్వాత పెద్ద సినిమాలన్ని ఢమాల్ అనటం మొదలెట్టి అందరినీ భయపెట్టాయి. అయితే బిచ్చగాడు, మరాఠిలో సూపర్ హిట్ అయిన సైరత్ చిత్రాలు కలెక్షన్స్ చూస్తూంటే ఈ పెద్ద సినిమాలు సిగ్గు పడేలా ఉన్నాయి. ఎందుకంటే వీటిల్లో స్టార్స్ లేరు.

ఇప్పుడున్న పరిస్దితుల్లో సినిమా హిట్..ఫ్లాఫ్ అనే దానికి కొలమానం కేవలం కలెక్షన్సే. భారీ కలెక్షన్లు రావడం వల్ల సినిమా తీసిన నిర్మాతతోపాటు ఆ సినిమాని కొన్న బయ్యర్లు, దాని డిస్ట్రిబ్యూటర్లు.. ఇలా ప్రతి ఒక్కరూ లాభపడటంతో కలెక్షన్లే నేటి సినిమాల సక్సెస్‌కి కొలమానమైంది.

మరో ప్రక్క ఎన్ని కోట్ల కలెక్షన్లు వసూలు చేసినా ఎంటర్‌టైన్‌ చేయని సినిమా ప్రేక్షకుడి దృష్టిలో బిగ్గెస్ట్‌ డిజాస్టరే అంటున్నారు. దానికి ఉదాహరణగా.. ఇటీవల విడుదలైన రజనీకాంత్‌ 'కబాలి' ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల పరంగా సునామీ సృష్టించింది.

అయితేనేం...సినిమా బాగోలేదనే టాక్ తెచ్చుకుంది. చూసిన చాలా మంది ప్రేక్షకులు పెదివి విరిచారు. ఏమీలేదని తేల్చేసారు. ఒక్కమాటలో చెప్పాలంటే కథాపరంగా చూస్తే 'కబాలి' బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌ అని తేల్చారు.

బ్రహ్మోత్సవం

బ్రహ్మోత్సవం

మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ అదరకొట్టినా, పాత కాలం కథ, సీరియల్ టైప్ టేకింగ్ తో జనం ధియోటర్స్ నుంచి పారిపోయే స్టేజీకి వచ్చింది.

సర్దార్ గబ్బర్ సింగ్

సర్దార్ గబ్బర్ సింగ్

ఈ కోవలోనే ఇటీవల పవన్‌కళ్యాణ్‌ నటించిన 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'నిలిచింది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి అయితే చెప్పక్కర్లేదు. అయితే ఈ సినిమా అనూహ్యంగా భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.

సూర్య '24'

సూర్య '24'

ఈ సినిమా చాలా బాగుందని , క్రిటిక్స్ నుంచి ప్రశంసలు వచ్చినా సినిమా కమర్షియల్ గా ఫ్లాఫైంది. సామాన్యులను చేరటంలో విఫలమైందనే చెప్పాలి.

పోలీస్

పోలీస్

భారీ అంచనాలతో విడుదల మరో చిత్రం విజయ్ 'థెరి'. తెలుగులో పోలీస్ టైటిల్ తో వచ్చిన ఈ చిత్రాన్ని దిల్ రాజు విడుదల చేసారు. ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది.

సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు

సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు

సినిమా చూపిస్తా మామతో ఊపు మీదున్న రాజ్ తరుణ్..సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు అంటూ వచ్చి బోల్తా పడ్డాడు. ఈ చిత్రం భాక్సాపీస్ డిజాస్ట్రర్ అయ్యింది.

కృష్ణాష్టమి

కృష్ణాష్టమి

దిల్ రాజు నిర్మాతగా వాసు వర్మ దర్శకత్వంలో సునీల్ హీరోగా వచ్చిన ఈ చిత్రం ..రిలీజ్ కు ముందు మంచి హైప్ తెచ్చుకుంది. సినిమా భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.

శౌర్య

శౌర్య

మంచు మనోజ్ హీరోగా, దశరధ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం గురించి అయితే చెప్పక్కర్లేదు. ఈ సినిమా దారుణంగా భాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది.

రాజా చెయ్యి వేస్తే

రాజా చెయ్యి వేస్తే

నారా రోహిత్ ...హీరోగా వచ్చిన రాజా చెయ్యి వేస్తే చిత్రం రిలీజ్ కు ముందు మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే చిత్రం రిలీజ్ అయ్యాక దారణమైన ఫ్లాఫ్ టాక్ ని ఎదుర్కొంది. తారకరత్న విలన్ గా చేసాడని క్రేజ్ క్రియేట్ అయ్యింది.

ఒక్క అమ్మాయి తప్ప

ఒక్క అమ్మాయి తప్పసందీప్ కిషన్ హీరోగా వచ్చిన ఈ చిత్రం ట్రైలర్ తో కొద్దిగా క్రేజ్ క్రియేట్ చేయగలిగినా మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుని తెర మరుగైపోయింది. నిత్యామీనన్ వంటి స్టార్ కాస్టింగ్ ఉన్నా ఫలితం లేకపోయింది.

షారూఖ్‌ ఖాన్‌ 'ఫ్యాన్‌'..

షారూఖ్‌ ఖాన్‌ 'ఫ్యాన్‌'..

ఎంతో ఎక్సపెక్టేషన్స్ వచ్చిన షారూఖ్ ఖాన్ చిత్రం ఫ్యాన్ ..ఊహించని విధంగా షారూఖ్ కు జలక్ ఇచ్చింది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.

బిచ్చగాడు

బిచ్చగాడు


తెలుగువారికి పెద్దగా పరిచయంలేని తమిళ హీరో విజయ్ ఆంటోని నటించిన 'బిచ్చగాడు'. ఒక్క తెలుగునాటే 20కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్‌ చేసి టాలీవుడ్‌ సినీ ప్రముఖులకు షాక్‌ ఇచ్చింది.

సైరత్

సైరత్


అలాగే స్టార్స్ లేకపోయినప్పటికీ మరాఠి 'సైరత్‌' అదిరిపోయే కలెక్షన్లు సాధించింది. మరాఠీ సినీ చరిత్రలోనే వంద కోట్లకి పైగా వసూలు చేసిన తొలి చిత్రంగా 'సైరత్‌' సంచలనం సృష్టించింది.

English summary
Tollywood saw many decent hits this year till now. At the same time, few movies that came in with high expectations crashed unimaginably at box office. Here are some biggest flop movies this year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu