Don't Miss!
- News
తెలంగాణలో భారతీ ఎయిర్టెల్ భారీ పెట్టుబడి: హైదరాబాద్లో 2వే కోట్లతో డేటా సెంటర్
- Lifestyle
శృంగారం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయా? డాక్టర్ సమాధనం, నివారణ మార్గాలు..
- Sports
ఓడినా.. ఈ మ్యాచ్ మాకు ప్రత్యేకం: టామ్ లాథమ్
- Finance
Capex: కేంద్రం ఊతమిస్తున్నా, రాష్ట్రాలు వాడుకోవట్లే...??
- Technology
ఈ షియోమీ ఫోన్లలో 5G ఫీచర్ ఉన్న కూడా ..! Jio 5G పనిచేయదు. ఎందుకంటే ..!
- Travel
బిష్ణుపూర్.. అదోక అందమైన బొమ్మల నగరం!
- Automobiles
బైక్పై వెళ్ళేటప్పుడు పిల్లులు అవసరమా.. వీడియో చూసి మీరే చెప్పండి
ఈ ఏడాది 100 కోట్ల క్లబ్ లో చేరిన టాప్ ఇండియన్ మూవీస్.. ఆ భాషలోనే ఎక్కువ!
2022 సినిమా ఇండస్ట్రీకి సరికొత్త బూస్ట్ వచ్చింది అనే చెప్పాలి. 100 కోట్ల క్లబ్ లో కొన్ని పెద్ద సినిమాలతో పాటు కొన్ని చిన్న సినిమాలు కూడా చేరడం విశేషం. ఇక ఇండియాలో ఇప్పుడైతే బాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేదు. సౌత్ ఇండస్ట్రీలో కూడా కంటెంట్ వర్కౌట్ అయితే అన్ని భాషల ప్రేక్షకులకు చేరువవుతోంది. ఇక తెలుగు తమిళ్ కన్నడ హిందీ చిత్ర పరిశ్రమలలో ఈ ఏడాది ఎక్కువ స్థాయిలో 100 కోట్ల కలెక్షన్స్ అందుకున్న సినిమాల సంఖ్య ఎక్కువగానే ఉంది. మలయాళం లో మాత్రం ఒకే ఒక్క సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఆ లిస్టు వివరాలలోకి వెళితే..

కన్నడ సినిమాల హవా
ముందుగా కన్నడ చిత్ర పరిశ్రమలో అయితే కొన్ని సినిమాలకు అత్యధిక కలెక్షన్స్ వచ్చాయి. ముఖ్యంగా కేజిఎఫ్ చాప్టర్ 2 అత్యధికంగా 1250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్. అందుకుంది. ఇక చిన్న సినిమాగా వచ్చిన కాంతార మాత్రం 404 కోట్ల వసూళ్లను అందుకుంది. ఇక జేమ్స్, 777 చార్లీ, విక్రాంత్ రోనా సినిమాలు కూడా 100 నుంచి 150 కోట్ల మధ్యలో మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్నాయి.

బాలీవుడ్ బాక్సాఫీస్
ఇక ఈ ఏడాది హిందీలో కూడా కొన్ని సినిమాలు ఊహించని ఫలితాన్ని అందుకున్నాయి. బ్రహ్మాస్త్ర 1 సినిమా మాత్రం వరల్డ్ వైడ్గా 400 కోట్ల రూపాయల వసూళ్ళను అందుకోగా ది కాశ్మీర్ ఫైల్స్ మాత్రం 340 కోట్లను రాబట్టింది. దృశ్యం 2 మూవీ 300 కోట్లను దాటిన విషయం తెలిసిందే. బుల్ బులియా 2 సినిమా 256 కోట్లను రాబట్టింది. అలాగే విక్రమ్ వేదా కూడా 135 కోట్లను అందుకోగా. జూగ్ జూగ్ జియో 135.2 కోట్ల గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుంది.

తమిళంలో ఎక్కువ సినిమాలు
ఇక తమిళంలో మాత్రం ఈ ఏడాది అత్యధిక స్థాయిలో 100 కోట్ల రూపాయలను అందుకున్న సినిమాలు ఎక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా పొన్నియిన్ సెల్వన్ 1 505 కోట్లను అందుకోగా విక్రమ్ సినిమా 500 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఇక బీస్ట్ సినిమాకు 243.5 కోట్లు రాగా వాలిమై 150 కోట్లను అందుకుంది. ఇక శివ కార్తికేయన్ డాన్ సినిమా 117 కోట్లు రాబట్టింది. అలాగే ధనుష్ తిరు, కార్తీ సర్దార్ సినిమాలు కూడా వంద కోట్ల క్లబ్ లో చేరాయి.

టాలీవుడ్ హిట్స్
తెలుగు బాక్సాఫీస్ విషయానికి వస్తే 2022 లో RRR సినిమా ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద 1200 కోట్ల కలెక్షన్స్ సిద్ధం చేసుకుంది. ఇక తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ 150 కోట్లు అందుకోగా రాధే శ్యామ్ సినిమా 107 కోట్లను రాబట్టింది. ఇక ఆ తర్వాత F 3 సినిమా కార్తికేయ 2, సీతారామం సినిమా కూడా 100 కోట్ల క్లబ్ లో చేరాయి. ఇక మలయాళం లో అయితే భీష్మపర్వం అనే ఓకే ఒక సినిమా 100 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకుంది.