»   » హిట్ టాక్: సూర్య ‘24’ తొలి రోజు ఎంత వసూలు చేసింది?

హిట్ టాక్: సూర్య ‘24’ తొలి రోజు ఎంత వసూలు చేసింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూర్య హీరోగా 'మనం' చిత్ర దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం '24'. భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కిన ఈచిత్రం మే 6న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజైన సంగతి తెలిసిందే. విడుదలైన తొలి రోజే ఈచిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సౌత్ లో వచ్చిన ఓ బ్రిలియంట్ మూవీగా సినీ విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది.

సూర్యకు దక్షిణాది మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో అందుకు తగిన విధంగానే సినిమాను భారీగా రిలీజ్ చేసారు. తొలి రోజు బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించింది. సౌత్ ఇండియాన, నార్త్ ఇండియా కలిపి ఈ చిత్రం తొలి రోజు రూ. 25 కోట్ల పైచిలుకు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. యూఎస్ఏ, ఇతర ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకుంటే వసూళ్లు రూ. 30 కోట్లు దాటే అవకాశం ఉంది.


 24 movie first Day Collection

ఎక్కువ వసూళ్లు తెలుగు, తమిళ వెర్షన్ నుండి వచ్చాయి. తమిళనాడు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రం తొలి రోజు దాదాపు రూ. 20 కోట్లు వసూలు చేసింది. సూర్య కెరీర్లోనే '24' చిత్రం హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రానికి తానే స్వయంగా నిర్మాత కూడా కావడంతో సూర్య చాలా హ్యాపీగా ఉన్నారు.


రోటీన్ సినిమాలకు భిన్నంగా టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ముఖ్యంగా దర్శకుడు స్టోరీ నేరేషన్ చేసిన తీరు అద్భుతంగా ఉండటం, టేకింగ్, నిర్మాణ విలువలు, గ్రాఫిక్స్ అద్భుతంగా ఉండటంతో సినిమా అందరినీ ఆకట్టుకుంటోంది. ఈచిత్రం త్వరలోనే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

English summary
Suriya starrer sci-fi family drama 24, which released yesterday has collected 25 crores on the first day all over India.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu