twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తుఫాన్ దెబ్బకు...ఎన్ని థియేటర్లు మిస్సయ్యాయి?

    By Srikanya
    |

    హైదరాబాద్: తుఫాన్ ఉత్తారాంధ్ర జిల్లాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో టాలీవుడ్ కు ఏ మేరకు నష్టం వాటిల్లనుంది అనేది ఇప్పుడు తెలుగు సినీ ట్రేడ్ వర్గాల్లో చర్చగా మారింది. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సురేష్ బాబు చెప్తున్న సమాచరం ప్రకారం దాదాపు 250 థియోటర్స్ మిస్ అయ్యాయని అంటున్నారు. ఈ రోజున(శుక్రవారం) అక్కడ రిలీజ్ అవటం కష్టం అంటున్నారు. దాంతో తెలుగు సినిమాలకు మేజర్ షేర్ వచ్చే ఉత్తారాంధ్ర కలెక్షన్స్ లేనట్లే. అది ఎంతవరకూ రిలీజ్ అవుతున్న చిత్రాల రికవరీ మీద పడనుందో అని టెన్షన్ పట్టకుంది.

    ముఖ్యంగా వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం లో థియోటర్స్ బాగా దెబ్ తిన్నాయి. ఎలక్ట్రికల్ పోల్స్ లేకపోవటంతో మొత్తం వ్యవస్ధే దెబ్బ తిన్నట్లు అయ్యింది. పోనీ జనరేటర్స్ తో నడపుదామన్నా డీజల్ దొరకని పరిస్ధితి. ఇవన్నీ ఎలాగోలా బేర్ చేసి సినిమా షో వేసినా ఈ భాధల్లో ఎవరు సినిమా చూడటానికి వస్తారు అంటున్నారు. ఈ నేపధ్యంలో నాగ చైతన్య ఒక లైలా కోసం విడుదల అవుతోంది.

     250 Theatres Missing In Tollywood

    ఒక లైలా కోసం నిర్మాత అయిన నాగార్జున, నాగ చైతన్య ఈ విషయం తెలుసినా, నష్టాన్ని బేర్ చేస్తామనే విడుదల చేస్తున్నారు. ఎప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఇప్పుడు మరోసారి వాయిదా పడితే ఎప్పుడు ఈ థియోటర్స్ పునరుద్దరణ జరిగి, తిరగి ప్రజా జీవితం యధా స్ధితికి వస్తుందో తెలియదు కాబట్టి... రిలీజ్ చేసేస్తున్నామంటున్నారు.

    నాగచైతన్య మాట్లాడుతూ... మాకు నష్టం ఖచ్చితంగా ఉంటుంది. దానికి సిద్దపడే విడుదల చేస్తున్నాం. తుఫాన్ బీభత్సం వల్ల వారికి ఎదురైన నష్టంతో పోలిస్తే మన నష్టం ఏముంది చెప్పండి. చాలా బాధగా ఉంది. ఈ సినిమా విడుదలకు కావాల్సిన అన్ని పనులూ పూర్తైపోయాయి. అందుకే తప్పటం లేదు అంటూ వివరణ ఇచ్చారు నాగ చైతన్య. ఆయన తన తాజా చిత్రం ‘ఒక లైలా కోసం' కోసం అంటూ ప్రేక్షకుల ముందుకి ఈ శుక్రవారం రానున్నారు. తుఫాన్ తో ఉత్తరాంధ్ర ప్రాంతాలలో విడుదల ఉండదు కదా ..అది మీకు నష్టం కదా అనే ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చారు.

    నాగ చైతన్య మాట్లాడుతూ... హుద్‌హుద్‌ తుపాన్‌ వల్ల వైజాగ్‌ ప్రాంతమంతా అల్లకల్లోలం అయిపోయింది. టీవీలో అక్కడి పరిస్థితిని చూస్తుంటే చాలా బాధగా ఉంది. అక్కడ పరిస్థితులు మెరుగవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఉత్తరాంధ్రలో మా సినిమా రిలీజ్‌కి ఎన్ని థియేటర్లు దొరికితే అన్నింటిలో రిలీజ్‌ చేస్తాం. అక్కడ పరిస్థితులు మెరుగుపడ్డాక ఓ రెండు మూడు వారాల తరువాత సినిమాను రీ-రిలీజ్‌ చేస్తాం. ‘కరెంట్‌ తీగ' వాయిదా పడడం వల్ల థియేటర్లు ఏమీ పెంచలేదు. ముందు ఎన్ని థియేటర్లు అనుకున్నామో అలాగే విడుదల చేస్తాం అన్నారు.

    'దడ', 'ఆటోనగర్‌ సూర్య' ఫెయిల్యూర్స్ తో తనకెలాంటి కథలు నప్పుతాయో చైతూకు బాగా అర్థమైంది. అందుకే ప్రేమకథలవైపు దృష్టిపెట్టారు. 'మనం'తో మరపురాని విజయం అందుకొన్న చైతన్య ఇప్పుడు వినోదాల ప్రేమకథతో అల్లరి చేయబోతున్నాడు. అదే 'ఒక లైలా కోసం'. ‘గుండెజారి గల్లంతయ్యిందే' ఫేం విజయ్‌కుమార్‌ కొండా దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ రోజు విడుదలవుతోంది.

    English summary
    Barring a couple of theatres, none have got restored and according to leading distributor Suresh Babu, almost 250 theatres are lying vacant without power.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X