»   »  పూర్తి రిస్క్: గోపీచంద్ ‘సాహసం’ బడ్జెట్

పూర్తి రిస్క్: గోపీచంద్ ‘సాహసం’ బడ్జెట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై గోపీచంద్ హీరోగా, చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం'సాహసం'. ఈ చిత్రం 30 కోట్ల బడ్జెట్ తో రూపొందిందని చెప్తున్నారు. వరస ప్లాపుల్లో ఉన్న గోపీచంద్ కు ఈ రేంజి బడ్జెట్ అంటే పూర్తి రిస్క్ అంటున్నారు. అంత రేంజిలో బిజినెస్ అవుతుందా అనేది ఇప్పుడు అందరి ఎదురుగా ఉన్న ఆలోచన.

ఇక ఈ చిత్రాన్ని జూన్ 21న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టెన్మెంట్ సమర్పణలో ఛత్రపతి ప్రసాద్ నిర్మించారు. అస్థిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఓ యువకుడు సాగించిన ప్రయాణమే ప్రధానాశంగా రూపొందిన చిత్రం 'సాహసం' అని చెప్తున్నారు.

ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ- ''ఒక చిన్న పిల్లకాలువలా ఈ కథ మొదలవుతుంది. పోను పోను మహాసముద్రంగా మారుతుంది. ఊహకందని రీతిలో కథ, కథనాలు సాగుతాయి. ఓ సెక్యూరిటీ గార్డ్ జీవితంలోని ఆసక్తికరమైన మలుపులే ఈ సినిమా. నిధి నేపథ్యంలో సాగే అడ్వంచరస్ మూవీ ఇది. చంద్రశేఖర్ ఏలేటి ఎంతో ప్రతిష్టాత్మంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా చంద్రశేఖర్ శైలిలో ఈ సినిమా ఉంటుంది. శ్రీ స్వరాలందించిన ఈ చిత్రం పాటలు ఇప్పటికే శ్రోతలను అలరిస్తున్నాయి. శ్రీ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రాణం. గోపిచంద్‌కి కచ్చితంగా ఈ సినిమా మంచి విజయాన్నిస్తుంది'' అని నమ్మకం వ్యక్తం చేశారు.

తాప్సీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో శక్తికపూర్, అలీతో పాటు ప్రముఖ తారాగణం నటించారు. ఈ చిత్రానికి మాటలు: కె.కె.రాధాకృష్ణకుమార్, కెమెరా: శ్యామ్‌దత్ ఎస్., ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, కళ: ఎస్.రామకృష్ణ, పాటలు: అనంత శ్రీరామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్, సహ నిర్మాత: భోగవల్లి బాపినీడు, సమర్పణ: రిలయన్స్ ఎంటర్‌టైన్ మెంట్స్.

English summary
For the first time in the history of Telugu cinema, the Producer BVSN Prasad has risked spending 30 crores on a film that features a hero who is not among the top 5 because the subject demanded it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu