For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాహుబలికి ఐదేళ్లు.. బాక్సాఫీస్‌పై మాహిష్మతి సామ్రాజ్యం దండయాత్ర

  |

  బాహుబలి ఓ చరిత్ర.. ఆ చరిత్రకు ఐదేళ్లు. భారత సినీ చరిత్రలో బాహుబలిది ప్రత్యేక స్థానం. చుక్కల్లో ధృవతార.. శిఖరాల్లో ఎవరెస్ట్.. మహా సముద్రాల్లో ఫసిపిక్ వంటిదే బాహుబలి. వందేళ్ల భారత సనీ చరిత్రకు సరికొత్త నిర్వచనం ఇచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో ఇండియాను నిలబెట్టింది బాహుబలి. ప్రపంచ దేశాల్లోని గొప్ప వేదికలపై బాహుబలిని ప్రదర్శించాలి. అంతటి చరిత్ర కలిగిన బాహుబలి విడుదలై నేటికి ఐదేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా నాటి సంగతులను సోషల్ మీడియాలో ప్రతీ ఒక్కరూ పంచుకుంటున్నారు.

  రెండేళ్ల శ్రమ..

  రెండేళ్ల శ్రమ..

  బాహుబలి మొదటి పార్ట్ రావడానికి రెండేళ్లు కొన్ని వందల మంది నిర్విరామంగా శ్రమించారు. అయితే అప్పుడు వారికి తెలియకపోవచ్చు.. తెలుగు సినిమా గతిని, ఇండియన్ సినీ ఇండస్ట్రీ విలువను మార్చేస్తున్నట్టు. బాహుబలి ఫస్ట్ పార్ట్ 10 జూలై 2015న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిసింది. అది అలా పెరిగి పెరిగి పెద్ద తుపానుగా మారింది.

  థియేటర్లు కళకళ..

  థియేటర్లు కళకళ..

  రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు వంద శాతం ఆక్యుపెన్సీతో కళకళలాడాయి. బాహుబలి సినిమాతో జాతరను తలపించాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మొత్తం దక్షిణాదిన అలాంటి వాతావరణమే కనిపించింది. ఇక ఓ డబ్బింగ్ సినిమా ఇంతలా ఆదరణకు నోచుకోవడం బాలీవుడ్ ఖంగుతింది. అక్కడా బాహుబలి స్వైర విహారం చేసింది. ఖాన్ల సినిమాలు సైతం పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది.

   అన్ని రికార్డులు బద్దలు..

  అన్ని రికార్డులు బద్దలు..

  దర్శకధీరుడు జక్కన్న విజన్‌కు ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అయింది. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి దుమ్ములేపింది. ఒక్క అమెరికాలో రెండు మిలియన్ల డాలర్లకు పైగా కొల్లగొట్టింది ఆహా అనిపించింది. ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి ఫస్ట్ డే 75 కోట్లను కొల్లగొట్టి ఆశ్చర్యపరిచింది.

  బాక్సాఫీస్‌పై దాడి..

  బాక్సాఫీస్‌పై దాడి..

  బాహుబలి చిత్రాన్ని దాదాపు రూ.180. కోట్లతో నిర్మించగా.. రూ.685 కోట్లు కొల్లగొట్టింది. ఇక ఈ సినిమాను వీక్షించిన వారు రెండో పార్ట్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూడసాగారు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనేది బేతాళ ప్రశ్నగా తయారైంది ఆ టైమ్‌లో. అంతేకాకుండా శివగామి, దేవసేన పాత్రలకు విపరీతమైన స్పందన వచ్చింది.

  Prabhas20 Title Announcement In August, Fans Frustration Peaks
  ప్రత్యేక ఆదరణ..

  ప్రత్యేక ఆదరణ..

  బాహుబలి చిత్రానికి దేశ విదేశాల్లో ప్రత్యేక ఆదరణ లభించింది. మరీ ముఖ్యంగా జపనీయులు బాహుబలి, భళ్లాలదేవుడిని, సుబ్బరాజును తెగ అభిమానించారు. వారి కోసం ప్రత్యేకంగా బహుమతులు కూడా పంపేవారు. బాక్సాఫీస్ రికార్డుల్లోనే కాదు జనాల్లోనూ, చరిత్రలోనూ ఎప్పటికీ బాహుబలి పదిలంగానే ఉంది. ఇంకా వందేళైనా అలాగే ఉంటుంది.

  English summary
  5 Years For Baahubali Tollywood New Box Office Records. It's heartening to see that even after 5 years, India is hailing #Baahubali and #5YearsForBaahubaliRoar is a top trend in India! Fire Thank you audience for making our film a major milestone that will be celebrated for as long as Indian cinema is alive.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X