»   » వసూళ్లు అదిరాయ్: ‘మనం’ 50 డేస్

వసూళ్లు అదిరాయ్: ‘మనం’ 50 డేస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని మల్టీస్టారర్ మూవీ 'మనం' చిత్రం విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం ఊహించిన దానికంటే ఎక్కువగానే వసూళ్లు సాధించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటి వరకు అక్కినేని హీరోల సినిమాలకు రాని కలెక్షన్స్ ఈ సినిమా సాధించడం విశేషం.

ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఈచిత్రం రూ. 40 కోట్లపైనే వసూలు చేసింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈచిత్రం ఫ్యామిలీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి సినిమా కావడం కూడా సినిమాకు ఒక రకంగా కలిసొచ్చింది.

 50 Days for Akkineni's 'Manam'

అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం కూడా సినిమా ప్లస్సయింది. ఓవరాల్‍‌గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా 50 రోజులు పూర్తి కావడంతో అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రం ద్వారా అక్కినేని కుటుంబం నుండి మరో యువ హీరో అఖిల్ ఇంట్రడ్యూస్ కావడం సినిమాకు క్లైమాక్స్‌లో హైలెట్‌ అయింది.

అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలసి నటించిన చిత్రం 'మనం'. సమంత, శ్రియ హీరోయిన్స్. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో అక్కినేని కుటుంబం ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.

English summary
Dr ANR, Akkineni Nagarjuna and Naga Chaitanya’s successful family drama ‘Manam’ has completed 50 days . The film is the biggest hit for the Akkineni Family, with worldwide revenues above the 40 Crore figure.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu