»   » సూపర్బ్: ‘అ..ఆ’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ (ఏరియా వైజ్)

సూపర్బ్: ‘అ..ఆ’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ (ఏరియా వైజ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నితిన్, సమంత హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అ..ఆ' మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్ తో దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద అంచనాలకు మించిన వసూళ్లు రాబడుతోంది.

బుధవారంతో బాక్సాఫీసు వద్ద తొలి వారం పూర్తి చేసుకున్న ఈచిత్రం స్టార్ హీరోల సినిమాల రేంజిలో భారీ బిజినెస్ చేసింది. ఫస్ట్ వీక్ బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ లిస్టులో చోటు దక్కించుకుంది. నితిన్ కెరీర్లోనే ఈచిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.


ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రం తొలి వారం రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఓవరాల్ గా ఇప్పటి వరకు రూ. 32 కోట్లకుపైగా షేర్ వచ్చినట్లు తెలుస్తోంది.


ఈ మధ్య తెలుగు సినీ పరిశ్రమలో మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్ ఒక్కటీ లేదు. ఆలోటును పూడ్చడానికే అన్నట్లు త్రివిక్రమ్ ఎంటర్టెనింగుతో కూడిన మంచి ఫ్యామిలీ మూవీని తీసి సక్సాస్ అయ్యాడు. తొలి వారం ఈ చిత్రం ఏరియా వైజ్ సాధించిన కలెక్షన్ల వివరాలు స్లైడ్ షోలో...


నైజాం(తెలంగాణ)

నైజాం(తెలంగాణ)

నైజాం ఏరియాలో అ..ఆ మూవీ తొలి వారం రూ. 9.50 కోట్ల షేర్ సాధించింది.


సీడెడ్

సీడెడ్

సీడెడ్ ఏరియాలో అ..ఆ మూవీ తొలి వారం రూ. 3.15 కోట్ల షేర్ సాధించింది.


ఆంద్రప్రదేశ్

ఆంద్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిపి తొలి వారం అ..ఆ మూవీ రూ. 9.35 కోట్లు వసూలు చేసింది.


కర్ణాటకలో

కర్ణాటకలో

కర్ణాటకలో అ..ఆ మూవీ తొలివారం రూ. 2.12 కోట్లు రాబట్టింది.


రెస్టాఫ్ ఇండియా

రెస్టాఫ్ ఇండియా

రెస్టాఫ్ ఇండియా మొత్తం కలిపి తొలివారం రూ. 35 లక్షలు వచ్చాయి.


యూఎస్ఏ

యూఎస్ఏ

యూఎస్ఏలో తొలివారం అ..ఆ చిత్రం రూ. 7.5 కోట్లు (1.85 మిలియన్ డాలర్ల గ్రాస్) వసూలు చేసింది.


రెస్టాఫ్ వరల్డ్

రెస్టాఫ్ వరల్డ్

ఆస్ట్రేలియాన, బ్రిటన్, దుబాయ్ ఇలా ఇతర దేశాల్లో రూ. 25 లక్షలు వసూలయ్యాయి.


టోటల్

టోటల్

వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్ టోటల్ రూ. 32.22 కోట్లు వసూలైంది.


English summary
Trivikram’s A..Aa movie has raked in Rs 50 plus crore gross worldwide in just first week, biggest movie till date in Nithin’s career. Share is around Rs 32 Cr.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu