»   » నితిన్, సమంత ఇద్దరూ కన్ఫర్మ్ చేసి చెప్పారు

నితిన్, సమంత ఇద్దరూ కన్ఫర్మ్ చేసి చెప్పారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్‌, సమంత జంటగా తెరకెక్కిన 'అ..ఆ: అనసూయ రామలింగం వర్సెస్‌ ఆనంద్‌ విహారి' చిత్రం జూన్‌ 2న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. హీరో నితిన్‌ సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. అలాగే సమంత సైతం ఇదే విషయాన్ని అదే పోస్టర్ తో ఖరారు చేసి చెప్పింది.


ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించి సరికొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. మిక్కీ జె. మేయర్‌ సంగీతం సమకూర్చారు.


మొదట ఈ చిత్రాన్ని మే 6న విడుదల చేయాలనుకున్నారు, అదే సమయానికి కు సూర్య తాజా చిత్రం 24 మూవీ రిలీజ్‌కు రెడీ అయింది. దీంతో మే రెండో వారంలో రిలీజ్‌ కు ప్లాన్‌ చేశారు. కాని అంతలోనే మహేష్‌ తాజా చిత్రం బ్రహ్మోత్సవం దూసుకొచ్చింది. దీంతో అ..ఆ మూవీ రిలీజ్‌ డేట్‌పై సందిగ్ధం నెలకొంది..


అయితే బ్రహ్మోత్సవం చిత్రం మే 20న విడుదల కాగా, అ..ఆ చిత్రాన్ని జూన్‌ 2కు విడుదల చేయాలా వద్దా అనే ఆలోచనతో ఉన్నారు చిత్ర నిర్మాతలు. కాని తాజాగా వచ్చిన బ్రహ్మోత్సవం డిజాస్టర్ రిజల్ట్‌తో అ..ఆ మూవీ రిలీజ్‌ డేట్‌ని ఫిక్స్ చేసి ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. జూన్ 2న అఫీషియల్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు.నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) మాట్లాడుతూ ''త్రివిక్రమ్‌ కలం నుంచి జాలువారిన మంచి ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ డ్రామా ఇది. ఇటీవల విడుదల చేసిన ఆడియోకు మంచి స్పందన వస్తోంది. మిక్కీ సంగీతం అందరినీ మెప్పిస్తోంది. జూన 2న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం'' అని అన్నారు.


ఈ చిత్రంలో అనసూయ రామలింగం పాత్రలో సమంత, ఆనంద్‌ విహారి పాత్రలో నితిన్‌ నటించారు. అనుపమ పరమేశ్వరన్ మరో హీరోయిన్. నదియ, అనన్య, ఈశ్వరీరావు, సన, గిరిబాబు, పోసాని, నరేశ్, రావు రమేశ్, అవసరాల శ్రీనివాస్‌, ప్రవీణ్‌, రఘుబాబు, పమ్మి సాయి, శ్రీనివాస్‌ రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంగీతం: మిక్కీ.జె.మేయర్‌, కెమెరా: నటరాజ్‌ సుబ్రమణియన్, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాశ్, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, సౌండ్‌ డిజైన్: విష్ణు గోవింద్‌, శ్రీ శంకర్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పి.డి.వి.ప్రసాద్‌, సమర్పణ: మమత.


English summary
Nithin and Samantha, who have been paired for the first time, have revealed the release date of their first combo movie "A... Aa," which is scheduled to hit the screens across the globe on June 2.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu