»   » ఓవర్సీస్‌లో బాహుబలి2కి షాక్.. దంగల్‌కు రికార్డు కలెక్షన్లు.. చైనాలో అమీర్ హవా..

ఓవర్సీస్‌లో బాహుబలి2కి షాక్.. దంగల్‌కు రికార్డు కలెక్షన్లు.. చైనాలో అమీర్ హవా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

అమీర్‌ఖాన్ నటించిన దంగల్ చిత్రం విదేశీ గడ్డపై రికార్డు సృష్టించింది. ఓవర్సీస్‌లో అత్యధిక ఓపెనింగ్స్ ఉన్న చిత్రంగా దంగల్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది. ఈ రికార్డును బాహుబలి2 అధిగమించకపోవడం గమనార్హం. చైనాలో గతవారం విడుదలైన దంగల్ చిత్రం రూ.75 కోట్లను కొల్లగొట్టింది. ఈ మొత్తం ఓవర్సీస్ మార్కెట్‌లో అమీర్ ఖాన్ పేరిట నమోదైన సరికొత్త రికార్డు. దంగల్ చిత్రం మే 5వ తేదీన చైనాలో దాదాపు 7 వేల థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.

మూడు రోజులకు 75 కోట్లు..

మూడు రోజులకు 75 కోట్లు..

చైనాలో విడుదలైన దంగల్ సినిమా తొలి వారాంతంలో రూ.75 కోట్ల (80.56 మిలియన్ యాన్స్) కలెక్షన్లను సాధించింది. అమెరికాలో బాహుబలి2 సాధించిన రూ.67 కోట్ల కంటే ఎక్కవ అనే విషయం బాక్సాఫీస్ వద్ద స్పష్టమైంది. శనివారం దాదాపు 30 శాతం మేర కలెక్షన్లు పెరుగడం విశేషం. ఈ కలెక్షన్లు చైనాలో అమీర్ ఖాన్‌కు ఉన్న ప్రేక్షకాదరణను చెప్పకనే చెప్తున్నాయి.


చైనాలో ప్రభంజనం

చైనాలో ప్రభంజనం

చైనాలో విడుదలైన మొదటి రోజు నుంచే దంగల్ కలెక్షన్ల పరంగా ప్రభంజనం సృష్టిస్తున్నది. చైనాలో ఆన్‌లైన్ టికెట్ సర్వీస్ వెబ్‌సైట్ మావోయాన్, ఇతర పోర్టల్స్ 9.8/10 రేటింగ్ ఇవ్వడం గమనార్హం. ఈ చిత్రం కథ, కథనం, సినిమాలో ఉద్వేగపూరిత సన్నివేశాలు చైనావాసులను విపరీతంగా ఆకట్టుకొంటున్నట్టు సమాచారం.


అమీర్‌ ఖాన్‌ సినిమాలకు..

అమీర్‌ ఖాన్‌ సినిమాలకు..

బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్‌ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. చైనాలో విడుదలైన అమీర్ సినిమా పీకే రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రస్తుతం దంగల్ చిత్రం అమెరికా, బ్రిటన్ దేశాల్లో కంటే ఎక్కువ వసూళ్లను సాధిస్తున్నది.


రెండో స్థానంలో దంగల్‌

రెండో స్థానంలో దంగల్‌

ఇటీవల విడుదలైన గార్డియన్స్ చిత్రం అత్యధిక వసూళ్ల (రూ.45.9 మిలియన్ డాలర్లు)ను సాధించింది. ఆ తర్వాత రెండో స్థానంలో దంగల్ (రూ.11.3 మిలియన్ డాలర్లు) సాధించింది. ప్రతీ రోజు గార్డియన్స్ చిత్రం 95 వేల స్క్రీన్లలో ప్రదర్శిస్తుండగా, దంగల్ 30 వేల స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నట్టు సమాచారం.English summary
Not Baahubali 2, Aamir Khan's Dangal holds the record for the highest opening for an Indian film in any foreign market. While Guardians earned $45.9 million in China, Dangal stood on second number with $11.3 million. The film has garnered rave reviews in China, with a rating of 9.8 on the widely used online ticketing service Maoyan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu