»   » చైనాలో దంగల్ దడదడ.. 1000 కోట్ల క్లబ్‌లో.. బాక్సాఫీస్ షేకింగ్..

చైనాలో దంగల్ దడదడ.. 1000 కోట్ల క్లబ్‌లో.. బాక్సాఫీస్ షేకింగ్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

చైనాలో దంగల్ చిత్రం రికార్డు వసూళ్లను సాధిస్తున్నది. భారతీయ సినిమా చరిత్రలో ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా దంగల్ సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ చిత్రం చైనాలో బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ ఫాలోయింగ్‌ను చెప్పకనే చెప్పింది. త్వరలోనే భారత్‌లో సాధించిన కలెక్షన్ల రికార్డును దంగల్ చిత్రం చైనాలో అధిగమిస్తుందనే ఆశాభావాన్ని ట్రేడ్ అనలిస్టులు పేర్కొంటున్నారు.

 ఒక్కరోజే రూ.87 కోట్లు..

ఒక్కరోజే రూ.87 కోట్లు..

దంగల్ గతవారం (మే 5 తేదీన) చైనాలో విడుదలైన సంగతి తెలిసిందే. శనివారం (మే 13న) ఒక్కరోజే రూ.87.66 కోట్లు అందర్నీ ఆశ్చర్యపరిచింది. శనివారం వచ్చిన ఊపుతో దంగల్ చిత్రం రూ.301. 50 కోట్ల మైలురాయిని దాటింది.

1027 కోట్లు సాధించిన..

1027 కోట్లు సాధించిన..

గతంలో దంగల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తైవాన్‌లో సాధించిన కలెక్షన్లతో కలిపి రూ.726 కోట్లు వసూలు చేసింది. తాజాగా చైనాలో వసూలు చేసిన 301. కోట్ల కలెక్షన్లతో మొత్తం 1027.50 కోట్లు వసూలు చేసింది అని ట్రేడ్ అనలిస్టులు పేర్కొన్నారు.

. హాలీవుడ్ చిత్రాలు వెలవెల

. హాలీవుడ్ చిత్రాలు వెలవెల

చైనాలో దంగల్ జోరు ముందు హాలీవుడ్ చిత్రాల కలెక్షన్లు వెలవెలపోయాయి. చైనా బాక్సాఫీస్ వద్ద అమీర్ ఖాన్ చిత్రం నంబర్‌వన్‌గా నిలిచింది. హాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన చిత్రం గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ2 చిత్రం రెండోస్థానంలో నిలిచింది.

అమీర్‌ఖాన్‌కు బ్రహ్మరథం..

అమీర్‌ఖాన్‌కు బ్రహ్మరథం..

గతంలో కూడా అమీర్ ఖాన్ నటించిన చిత్రాలకు చైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. పీకే, 3 ఇడియెట్స్ చిత్రాలు కూడా రికార్డు వసూళ్లను సాధించాయి. తాజాగా విడుదలైన దంగల్ సినిమాకు అనూహ్య స్పందన లభిస్తున్నది. చైనా మీడియా ఈ చిత్రానికి 9/10 రేటింగ్ ఇవ్వడం గమనార్హం.

400 కోట్ల వైపు పరుగులు..

400 కోట్ల వైపు పరుగులు..

చైనాలో ప్రస్తుతం కొనసాగిస్తున్న హవాను చూస్తుంటే.. రూ.400 కోట్ల మైలురాయిని అవలీలగా దాటే అవకాశముందనే అభిప్రాయాన్ని ట్రేడ్ అనలిస్టులు వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం షూజీయోబా బాబా (కుస్తీ పడుదాం.. నాన్న) పేరుతో చైనాలో రిలీజైంది.

English summary
Dangal was released last week in China. Yesterday, it earned an unimaginable Rs 87.66 crore in a single day thereby pushing the collections to Rs 301.50 crore. The Indian box-office collection of Dangal is Rs 387.38 crore. As such it is only a matter of time before the Indian record is broken.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu