Just In
- 11 min ago
KRACK వివాదం.. దిల్ రాజు గురించి మాట్లాడే అర్హతే లేదు.. బెల్లంకొండ సురేష్ కామెంట్స్
- 1 hr ago
క్రాక్ ఓటీటీ రిలీక్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు రాబోతోందంటే?
- 1 hr ago
ఇన్నేళ్లకు ఆ విషయం తెలిసింది.. ఇకపై నేనేంటో చూపిస్తా.. రామ్ కామెంట్స్ వైరల్
- 1 hr ago
సలార్ సినిమాకు హీరోయిన్ టెన్షన్.. వాళ్ళు ఖాళీగా లేరట
Don't Miss!
- News
తిరుమలలో అపచారం: ఎక్కడి నుంచి వచ్చాయో గానీ: శ్రీవారి ఆలయం వద్ద తిష్ఠ: భక్తుల అసహనం
- Sports
యువరాజ్ సింగ్ పంచుకున్న భరతనాట్యం బౌలింగ్.. చూస్తే వావ్ అనాల్సిందే!వీడియో
- Finance
startup India seed fund: స్టార్టప్స్ కోసం రూ.1000 కోట్ల నిధి
- Automobiles
కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కలెక్షన్స్ సునామీ...రికార్డులు బ్రద్దులవుతున్నాయి
ముంబై : రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో అమీర్‌ఖాన్ నటించిన పీకే చిత్రం ఘన విజయం సాధించి బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ కురిపిస్తోంది. గత నెల 19న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.620 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో 'ధూమ్3' (రూ.547 కోట్లు) అత్యధిక వసూళ్ల రికార్డు బద్దలైంది.
తొలి ట్రైలర్ విడుదల నాటి నుంచే నిరసనల స్వాగతం అందుకున్న ఈ చిత్రానికి ఇప్పటికీ ఆ సెగ తగులుతూనే ఉంది. సినిమాలో ఉన్న విషయంతోపాటు... ఈ నిరసనలూ వసూళ్ల ప్రభంజనానికి కారణమయ్యాయంటోంది బాలీవుడ్. ఏదేమైనా బాలీవుడ్‌లో రూ.600 కోట్ల క్లబ్‌ను ప్రారంభించాడు 'పీకే' ఆమీర్ ఖాన్.
ఈ చిత్రంలో హిందూ మతాన్ని కించపరిచేలా కొన్ని దృశ్యాలున్నాయని అభ్యంతరాలు వ్యక్తమైనా దాని ప్రభావం వసూళ్ల మీద పడలేదు. ఇక..ఈ చిత్రం ఇంత పెద్ద హిట్ కావటంపై చిత్ర దర్శకుడు రాజు హిరానీ ఆనందం వ్యక్తం చేశారు. తమ సినిమాకు కథే హీరో అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో హిర్వానీ, ఆమిర్‌ఖాన్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘త్రీ ఇడియట్స్' సినిమా కూడా ఘనవిజయం సాధించింది.

ఈ సినిమాను దేశవ్యాప్తంగా నిలిపివేయాలని కొందరు ఆలహాబాద్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భారతీయ మతానికి సంబంధించి..హిందూదేవుళ్లపై విమర్శనాసా్త్రలు సంధించడంతో ఆగ్రహానికి గురైన పలువురు పీకే చిత్రంపై, ఆ చిత్ర దర్శకుడిపై కేసులు నమోదు చేశారు. లక్నోకు చెందిన హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ అనే సంస్థ ఈ పిల్‌ను దాఖలు చేసింది.
ఈ సినిమాలో కొన్ని సంభాషణలు హిందువుల్ని కించపరిచేలా ఉన్నాయని ముఖ్యంగా ‘‘భయపడే వాళ్లే దేవాలయాలకు వెళ్తుంటారు'' అనే డైలాగు హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని తమ పిటిషన్లో అభ్యంతరాలు వ్యక్తం చేశారు.