»   » ‘విశాల్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా 'అభిమన్యుడు'’

‘విశాల్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా 'అభిమన్యుడు'’

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  మాస్‌ హీరో విశాల్‌, హ్యాట్రిక్‌ హీరోయిన్‌ సమంత యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ప్రధాన పాత్రల్లో విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ, హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బేనస్స్‌పై ఎమ్‌. పురుషోత్తమ్‌ సమర్పణలో యువ నిర్మాత జి. హరి నిర్మించిన 'అభిమన్యుడు' గతవారం విడుదలై సూపర్‌ టాక్‌తో సూపర్‌ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది.

  ఈ ఘన విజయంపై నిర్మాత గుజ్జలపూడి హరి మాట్లాడుతూ - ''కేవలం 7 రోజుల్లోనే 12 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసి విశాల్‌గారి కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది మా 'అభిమన్యుడు'. రెండోవారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో 261 థియేటర్స్‌లో హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో రన్‌ అవుతోంది. ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా ఆన్‌లైన్‌ మోసాలు ఎలా జరుగుతున్నాయో కళ్ళకు కట్టినట్లు దర్శకులు పి.ఎస్‌. మిత్రన్‌ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది.

   Abhimanyudu Collected More Than 12 Crores

  నిజ జీవితంలో విశాల్‌ వ్యక్తిత్వానికి దగ్గరగా ఈ చిత్రంలోని హీరో పాత్ర వుండడంతో విశాల్‌ చాలా నేచురల్‌గా చేసిన పెర్‌ఫార్మెన్స్‌ సినిమాని పెద్ద రేంజ్‌కు తీసుకెళ్ళింది. వరస విజయాలతో ప్రేక్షకుల ప్రశంసల్ని అందుకుంటున్న సమంత ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌ పాయింట్‌ అయింది. అలాగే యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ పోషించిన నెగిటివ్‌ రోల్‌ చిత్రానికి మంచి గ్రిప్‌ తీసుకొచ్చింది.

  యువన్‌ శంకర్‌ రాజా రీరికార్డింగ్‌ ఆడియన్స్‌కి చాలా థ్రిల్‌ ఇచ్చింది. అన్ని విధాలుగా సినిమా ఎక్స్‌ట్రార్డినరీగా వుందన్న అనుభూతి ప్రేక్షకులకు కలిగినందువలనే 7 రోజుల్లోనే 12 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసింది. రెండోవారం కూడా అన్నీ ఫుల్స్‌ మీద రన్‌ అవడం చాలా ఆనందంగా వుంది. మా హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బేనర్‌కి ఇంత పెద్ద హిట్‌ ఇచ్చిన విశాల్‌గారికి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను'' అన్నారు.

  'అభిమన్యుడు' 7 రోజుల గ్రాస్‌ కలెక్షన్‌!!

  నైజాంలో రూ.4,37,52,661, సీడెడ్‌‌లో రూ.99,85,861, వైజాగ్‌లో రూ.1,50,02,989, నెల్లూరులో రూ.50,63,222, ఈస్ట్‌ రూ.72,35,797, వెస్ట్‌ రూ. 46,41,397, కృష్ణా రూ.1,03,97,414, గుంటూరులో రూ.77,09,345, కర్ణాటకలో 49,00,000, ఒరిస్సా, నార్త్‌ ఇండియా 24,00,000, ఓవర్సీస్‌లో 91,00,000, 7 రోజుల్లో మొత్తం రూ. 12,01,88,686 వసూలు చేసింది.

  English summary
  'Abhimanyudu' starring Mass Hero Vishal, Hat-trick Heroine Samantha, Action King Arjun in lead roles released last week is going strong with superb collections and terrific talk across all centers. Young Producer G.Hari Produced this film under Vishal Film Factory and Hari Venkateswara Pictures banners Presented by M.Purushottaman. Speaking about the grand success of the film Producer Gujjalapudi Hari says, " 'Abhimanyudu' stands as Biggest Blockbuster in Vishal's career by collecting more than 12 crores in 7 days. The film is running with house-full collections in its second week in 261 theatres across AP & Telangana.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more