»   »  ‘నాన్నకు ప్రేమతో’ ఇంకా సగం రావాలి

‘నాన్నకు ప్రేమతో’ ఇంకా సగం రావాలి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జూనియర్‌ ఎన్టీఆర్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా భారీ అంచనాలతో విడుదలైన చిత్రం ‘నాన్నకు ప్రేమతో'. ఎన్టీఆర్ సిల్వర్ జూబ్లీ చిత్రం గా రెడీ అయి వచ్చిన ఈ చిత్రం తొలిరోజు ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. కానీ తర్వాత డిక్టేటర్, సోగ్గాడే చిన్ని నాయినా, ఎక్సప్రెస్ రాజా చిత్రాల విడుదల తో కాస్త డౌన్ అయ్యింది. కలెక్షన్స్ లో ఊపు తగ్గింది. ఈ నేపధ్యంలో ఇప్పటివరకూ ఎంత కలెక్ట్ అయ్యింది. ఇంతెంత కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ వస్తుందో చూద్దాం...

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న లెక్కలు ప్రకారం ఈ మూడు రోజుల రన్ లో ...19.45 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అయితే ఈ చిత్రం 38.5 కోట్లకు ధియోటర్ రైట్స్ కు అమ్ముడైంది. దాంతో మరో 19 కోట్లు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ వస్తుంది. మరి మిగతా సంక్రాంతి చిత్రాలకు కూడా పాజిటివ్ టాక్ వచ్చిన నేపధ్యంలో ఏ మేరకు ఈ చిత్రం రికవరీ అవుతుందో తేలాల్సి ఉంది. ముఖ్యంగా ఈ రోజు నుంచి అంటే సోమవారం నుంచి వచ్చే కలెక్షన్స్ కీలకం కానున్నాయి.


మరో ప్రక్కఈ చిత్రం అమెరికాలో భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. జనవరి 13న విడుదలైన ఈ చిత్రం మూడురోజుల్లోనే యూఎస్‌ బాక్సాఫీస్‌ వద్ద ఒక మిలియన్‌డాలర్ల కలెక్షన్‌ను అధిగమించింది.


About Nannaku Prematho collections

ఈ సంవత్సరంలో తక్కువ సమయంలో మిలియన్‌ మార్క్‌ చేరిన తొలి సినిమాగా ఇది రికార్డు సృష్టించింది. చిత్ర ఓవర్‌సీస్‌ పంపిణీదారు సినీ గెలాక్సీ ఇన్‌కార్పొరేషన్‌ ఈ వివరాలను ప్రకటించింది. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బి.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు.


ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. దాదాపు రూ. 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం తొలి మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ రూ. 30 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది.

English summary
'Naannaku Prematho' collected a share of Rs.19.45 crores at the end of its three days run in AP and Telangana.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu