»   » 'నాన్నకు ప్రేమతో' బిజినెస్: ఆ రెండు చోట్లా తప్ప ఫినిష్

'నాన్నకు ప్రేమతో' బిజినెస్: ఆ రెండు చోట్లా తప్ప ఫినిష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :ఎన్టీఆర్ తాజా చిత్రం 'నాన్నకు ప్రేమతో' సంక్రాంతికి విడుదల చేయటానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆడియో రిలీజ్ అయ్యి అందరి మన్ననలూ పొందుతోంది. మరో ప్రక్క బిజినెస్ సైతం ఊపందుకుంది. సీడెడ్, నార్త్ ఇండియా తప్ప అన్ని ఏరియాలు బిజినెస్ పూర్తైనట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ రెండు ప్రాంతాల్లోనూ ఈ సినిమాను సమర్పిస్తున్న రిలియన్స్ వారే రిలీజ్ చేస్తున్నట్లు చెప్తున్నారు. మరో ప్రక్క ..., ఆడియో పాటు విడుదలైన దియోటర్ ట్రైలర్ కి మంచి స్పందన వస్తొంది. ఆ ట్రైలర్ ని ఇక్కడ చూడండి.


ఇంకా ఒక రోజు మాత్రమే షూటింగ్ మిగిలివున్నఈ సినిమా ప్యాచ్ వర్క్ పూర్తిచేస్తూనే, మరో పక్క పోస్ట్ ప్రోడక్షన్ జరుపుకుంటోంది. ఈ సినిమాపై అంచానాలు బాగానే ఉన్నాయి. జనవరి 13న రిలిజ్ అవుతున్న ఈ సినిమాకోసం అటు అభిమానులు, ఇటు సంక్రాంతి ప్రేక్షకులు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.


రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే అత్యంత కాస్ట్‌లియస్ట్‌ చిత్రంగా 'నాన్నకు ప్రేమతో' చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా చాలా లావిష్‌గా చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు సుకుమార్‌ టెక్నికల్‌గా చాలా హై స్టాండర్డ్స్‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.


 About NTR ‘Nannaku Prematho’ Business

ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు.


ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌.


English summary
NTR's ‘Nannaku Prematho’ Has been sold out in All Areas Except Ceded & North India where Reliance will be releasing the film.
Please Wait while comments are loading...