»   » ‘సత్యమూర్తి’ టాక్ వీక్..మరి కలెక్షన్స్ ?

‘సత్యమూర్తి’ టాక్ వీక్..మరి కలెక్షన్స్ ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ రూపొందించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి' మొన్న గురువారం( ఏప్రిల్ 9న)ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలైంది.మార్నింగ్ షో నుంచి డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ లో మాత్రం రేసు గుర్రం లా పరుగెడుతోందని ట్రేడ్ వర్గాల సమాచారం. మొదటి రోజే తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది కోట్లకి పైగా షేర్ సాధించిన ఈ చిత్రం రెండో రోజు కూడా అదరకొట్టింది. ఇదే జోరు నిన్న(శనివారం),ఈ రోజు(ఆదివారం) కొనసాగుతోంది.

చాలా చోట్ల ఇప్పటికి బ్లాక్ లో టిక్కెట్లు కొనుక్కునే పరిస్ధితి కనపడుతోందని చెప్పుతున్నారు. ఇదే కొనసాగితే వీకెండ్ అయ్యేలోగా..ఈ చిత్రం మన రాష్ట్రాల్లోనే పాతిక కోట్లు మార్కు ని చేరుకునే అవకాసం ఉందని అంటున్నారు. ఆ తర్వాత స్టడీగా కలెక్షన్స్ ఉంటే పూర్తి సేఫ్ అయినట్లే,లాభాలు కూడా వచ్చే అవకాసం ఉందని అని చెప్తున్నారు. టాక్ తేడాగా ఉండటంతో కలెక్షన్స్ పై ప్రభావం చూపెడుతుందని భయపడ్డ బయ్యర్లు..రిలీఫ్ ఫీలవుతున్నారు.


అల్లు అర్జున్ సినిమా అంటేనే అంచనాలు పెరిగిపోతాయి. అలాంటిది కుటుంబ ప్రేక్షకులను తనదైన సెంటిమెంట్, భావోద్వేగాలు, ఫన్ తో ఆకట్టుకునే త్రివిక్రమ్ జత కలిస్తే ఇంకేముంది. జులాయి ని మించిపోతుంది. ఇప్పుడు అందరి అంచనా ఇదే. దానికి తోడు విభిన్నమైన టైటిల్, అత్తారింటికి దారేది వంటి మెగా హిట్ తర్వాత త్రివిక్రమ్ నుంచి, రేసు గుర్రం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ వస్తున్న చిత్రం కావటం మరింతగా అంచనాలు పెంచేసింది. దాంతో టాక్ తో సంభందం లేకుండా ముందుకు వెళ్తోంది.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


About Satya Murthy weekend collections

విలువైన మంచిమాటలే ఆస్తి అనే అంశాన్ని ఈ చిత్రంలో ప్రధానమైన అంశంగా తీసుకుని దర్శకుడు కథను రూపొందించారు. 'నాన్న నాకేమిచ్చాడు' అంటూ లెక్కలేసుకొంటుంటారు తనయులు. కార్లు, బంగళాలూ, వూరవతల గెస్ట్‌ హౌస్‌లూ ఇవన్నీ కాగితాలపైనే కనిపిస్తాయి. కానీ కంటికి కనిపించని ఆస్తులు ఆయన చాలానే ఇస్తాడు. బతుకు పోరాటం నేర్పించేది నాన్నే. అంతెందుకు ఈ జీవితాన్ని ఇచ్చిందే నాన్న. విరాజ్‌ ఆనంద్‌ నమ్మిందీ అదే. సత్యమూర్తి గారబ్బాయి విరాజ్‌ ఆనంద్‌. తండ్రంటే దస్తావేజులపై కనిపించే సంతకం కాదు.. నా జీవితం అని నమ్మిన విరాజ్‌.. ఆ తండ్రి కోసం ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.


చిత్రం గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ... ఇటీవల వచ్చిన 'ఇద్దరమ్మాయిలతో...' సినిమాలో రాక్ గిటార్ ప్లేయర్‌గా చేశాను. 'రేసు గుర్రం'లో మధ్యతరగతి అబ్బాయిగా చేశాను. వాటితో పోలిస్తే, 'సన్ ఆఫ్ సత్యమూర్తి'లో నాది కొంత డిగ్నిటీ ఎక్కువున్న పాత్ర. హుందాతనం నిండిన ఆ పాత్రలో కూడా వస్త్రధారణలో ఒక స్టైల్ తెచ్చేందుకు ప్రయత్నించాం. పైగా, నేనెప్పుడూ ఒకటికి నాలుగు అలంకరణలతో నిండిన వస్త్రధారణ చేస్తుంటా. కానీ, పాటలు వదిలేస్తే, ఈ సినిమాలో కావాలనే అవన్నీ వదిలించుకొని, సింపుల్‌గా, సింగిల్ పీస్‌లో ఉండేలా చూశా. దాంతో, నేను కొత్తగా కనిపిస్తాను అన్నారు.


About Satya Murthy weekend collections

త్రివిక్రమ్ సినిమాలంటే పంచ్ డైలాగులు ఉంటాయని..సగటు ప్రేక్షకుడ్ని కూడా అలరిస్తాయని అందరికి తెలిసిన విషయమే. ఆయన మాటల్లోని పంచ్‌లు ప్రతి అభిమానికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయి. అందుకే ఆయన మాటల మాంత్రికుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినిమా ఏదీ చూసిన తన డైలాగుల మార్క్ కనబడుతుంది. దానికి తగ్గట్టుగా త్రివిక్రమ్ డైలాగ్స్‌ ‘సత్యమూర్తి'కి సరికొత్త లుక్‌ని తీసుకొచ్చాడని చెబుతున్నారు. ఆ చిత్రంలోని కొన్ని పంచ్ డైలాగులు మీకోసం...


కొన్నిసార్లు పట్టుకోవడం కంటే.. విడిచిపెట్టడమే ఉత్తమం
కొన్నిసార్లు గెలవడం కంటే ఓడిపోవడమే ఉత్తమం
మనిషి వస్తువులతో కాదు.. విలువలతో బతకాలి..


యాక్సిడెంట్ అంటే బైకో, కారో గుద్దుకుని రోడ్డు మీద పడడం కాదురా, ఒక ఫ్యామిలీ రోడ్డున పడ్డం..
అదృష్టం వచ్చి షేక్‌హాండ్ ఇచ్చేలోపే.. దురద్రుష్టం వచ్చి లిప్‌కిస్ పెట్టేసింది
తెలిసి చేస్తే మోసం - చేసాక తెలిస్తే తప్పు


మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి.. కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడొద్దు సార్
ఎంత ఏడిస్తే అంత ప్రేమ ఉన్నట్టు లెక్క అనుకుంటే.. మా నాన్న కోసం నేను ఏడిస్తే ఈ జీవితం సరిపోదు.

English summary
Allu Arjun's latest Son of Satya Murthy movie weekend collections are very good.
Please Wait while comments are loading...